సంతానం (1955 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
రంగయ్య (ఎస్.వి.రంగారావు) అనే మిల్లు కార్మికుడికి లక్ష్మి (బేబి విజయలక్ష్మి, శ్రీరంజని), రాము (అక్కినేని నాగృశ్వరరావు), బాబు (చలం) అనే ముగ్గురు సంతానం. ఒక దురదృష్ట సంఘటనలో కళ్ళు కోల్పోతాడు రంగయ్య. సంతానం ముగ్గురూ కలసి జీవనయానం సాగించి విధివశాత్తూ బాల్యదశలోనే విడిపోతారు. వీరు విడిపోకముందు అక్క లక్ష్మి చిన్న తమ్మున్ని నిద్రపుచ్చుతూ 'నిదురపోరా తమ్ముడా' అని జోల పాడుతుంది. ఈ పాటే కధకు కీలకం. ఒక ఇరవై యేళ్ళు గడిచాక ఇదే పాట వారిని ఏకం చేస్తుంది.
 
పరిస్థితుల రీత్యా విడిపోయిన లక్ష్మి ఒక జమిందారు (మిక్కిలినేని) యింటిలో వంటమనిషిగా చేరుతుంది. రాము నాటకాల కంపెనీలో చేరి చేషాలేస్తూ పెరిగి పెద్దవాడై ఓ జమిందారు (రేలంగి) ఇంట్లో ప్రవేశించి అతని కూతురు (సావిత్రి) అభిమానాన్ని, ప్రేమను పొందుతాడు. బాబు ఓ వస్తాదు వద్ద పెరిగి మిక్కిలినేని కూతురు (కుసుమ కుమారి)ని ప్రేమిస్తాడు. ఇది నచ్చని పెద్దాయన కొడుకు విదేశాలకు వెళ్ళగానే లక్ష్మిని ఇంటినుంచి గెంటివేస్తాడు. ఆ బాధతో లక్ష్మి పాడిన గీతంతో రాము అక్కను గుర్తిస్తాడు. వారిద్దరూ పతాక సన్నివేశంలో తమ్ముడు బాబును, తండ్రి రంగయ్యను కలుసుకుంటారు. ఆ విధంగా అంధుడైన తండ్రి రంగయ్య తన సంతానం ముగ్గుర్నీ కలుసుకోవడం, అపార్ధాలు తొలగి ఆ ముగ్గురికీ వారు కోరుకున్న వారితో వివాహం జరగడంతో కథ సుఖాంతమౌతుంది.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/సంతానం_(1955_సినిమా)" నుండి వెలికితీశారు