ఒగ్గు కథ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ఒక్క ఒగ్గు కథ కళాకారుని పెరును జతపరిచాను.
పంక్తి 45:
ఇది అన్నిటికన్నా ప్రధానమైనది. ఒగ్గు కళాకారుల్లో విస్తృతంగా ఉంటుంది. ప్రేక్షకుల మనసు తెలుసుకుని వారికి నచ్చే విధంగా కథని చెప్తారు. ఎక్కడ ప్రేక్షకుడు ఏడుస్తాడు, ఎక్కడ నవ్వుతాడు, ఎక్కడ భక్తి భావంతో ఉంటాడో తెలుసుకొని కథను నడిపిస్తాడు. కథచెబుతూ వెంటనే పాత్రదారునిగా మారటం అందులో పూర్తిగా లీనమై వెనువెంటనే కథకుడిగా మారటం సంయమనం ఉన్న కళాకారుడు తప్ప ఇతరులకి అసాధ్యం.ఒగ్గుకళాకారుడు ఇవన్నీ కలిగుంటాడు.
==ప్రార్థనాగీతం==
ప్రార్థనాగీతంలో మొదట గంగని తలవటం ప్రత్యేకమైన అంశం. దేశీయత ఉట్టిపడేటట్టుగా గంగ గొప్పతనాన్ని చెప్పడం, జనాల్ని మంత్ర ముగ్దుల్ని చేసేరాగాలాపన, విస్మయం కలిగించే ఆహార్యం, పొడుపు కథలు, జాతియాలు, సామెతలు, ఇతర అన్యదేశ్యాలు కథలో సహజంగా ప్రవర్తిల్లుతాయి. సీన్ కి తగిన స్టేజ్ ఉండకపోయినా, పాత్రకి తగిన వేషదారణ కనబడకపోయినా ప్రేక్షకులు తమ హృదయసభల్లో ఆ లోటుని భర్తీ చేసుకుంటారు. మిద్దెరాములు, చుక్కసత్తయ్య మరియు పూడూరు మల్లయ్య మొదలైన ఒగ్గు కళాకారులు ప్రపంచపు జానపద కళాయవనికపై ఒగ్గుకథా రూపాన్ని స్థిరంగా నిలిపారు.
 
==ఆహార్యం==
ఒగ్గుకథ నాటక ప్రక్రియ కాదు. అయిన నాటక సన్నివేషాలు అనేకం ఉన్నాయి. సంప్రదాయ వేషదారనే కాని పాత్రోచిత వేషదారణ ఉండదు. కూచిపూడి కళాకారులకి ఉండేంత అభినయ నైపుణ్యం ఒగ్గుకళాకారులకీ ఉంటుంది. కథకులు కథని చెబుతూ వెంటనే తమను తాము పాత్రలుగా మలుచుకుంటారు. గాంభీర్యప్రదర్శనలో, లాలిత్య పోషణలో, రసాబాస కలిగించటంలో ఇతర నాటక కళాకారులకి ఏమాత్రం తక్కువ కాకుండా నటిస్తారు. ముఖకవలికలు కదపటంలో. చేతుల్తో నాటక ముద్రల్ని ప్రదర్శించటంలో, ఒంటితో సాత్వికతని ప్రదర్శించండంలో విశేషమైన ప్రజ్ఞని ప్రదర్శిస్తారు.
"https://te.wikipedia.org/wiki/ఒగ్గు_కథ" నుండి వెలికితీశారు