కొప్పుల ఈశ్వర్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
}}
 
'''[[కొప్పుల ఈశ్వర్]]''' [[కరీంనగర్ జిల్లా]]కు చెందిన రాజకీయ నాయకుడు. ఈయన 20 ఏప్రిల్ 1959న [[గోదావరిఖని]]లో జన్మించారు. బీఏ వరకు అభ్యసించి సింగరేణిలో బొగ్గుగని కార్మికుడిగా జీవనం ఆరంభించారు.<ref>నమస్తే తెలంగాణ దినపత్రిక, కరీంనగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 05-04-2014</ref> 2004లో తొలిసారిగా మేడారం నుంచి [[శాసనసభ]]కు ఎన్నికయ్యారు. [[తెలంగాణ]] ఉద్యమ నేపథ్యంలో పదవికి రాజీనామా సమర్పించి 2008లో జరిగిన ఉప ఎన్నికలలో పోటీచేసి విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజనలో మేడారం స్థానం రద్దు కావడంతో 2009లో కొత్తగా ఏర్పడిన [[ధర్మపురి శాసనసభ నియోజకవర్గం]] నుంచి పోటీచేసి [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్ పార్టీ]] అభ్యర్థి, జిల్లా పరిషత్తు చైర్మెన్ అయిన ఎ.లక్ష్మణ్ కుమార్‌పై విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో మరోసారి రాజీనామా చేసి 2010 ఉప ఎన్నికలలో మళ్ళీ గెలుపొందినారు. 2014 ఎన్నికలలో మళ్ళీ [[తెరాస]] తరఫున [[ధర్మపురి]] నుంచి పోటీ చేస్తున్నారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కొప్పుల_ఈశ్వర్" నుండి వెలికితీశారు