అఖిల భారత విద్యార్థి సమాఖ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి {{commons category|All India Students Federation}}
పంక్తి 2:
 
ఏఐఎస్‌ఎఫ్‌ కు భారతదేశంలో ఘనమైన పోరాట చరిత్ర ఉంది. స్వాతంత్య్రం రాకపూర్వమే [[ఉత్తర ప్రదేశ్]]లోని [[లక్నో]] నగరంలో [[1936]] [[ఆగస్టు 12]] న ఏఐఎస్‌ఎఫ్‌ ఆవిర్భవించింది. తొలిరోజుల్లో బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులను ఈ దేశం నుంచి తరిమికొట్టే ఉద్ధేశంతో, యువతీ, యువకుల్లో దేశభక్తి మెండుగా నింపింది. ఆనాటి ఉద్యమాలలో సంఘానికి సంబంధించిన ఎంతో మంది యువకులు దేశం కోసం బలిదానం చేశారు. పోరాటాలు, త్యాగాలే ధ్యేయంగా ఏర్పాటైన ఈ విద్యార్థి సంఘం స్వాతంత్య్రనంతరం శాస్త్రీయ విద్యావిధానం అమలుపై నిరంతరం పోరాటాలు సాగిస్తుంది. పేద విద్యార్థులకు హాస్టల్‌ సౌకర్యం, స్కాలర్‌షిప్‌ల మంజూరు, కాస్మోటిక్‌ చార్జీల పెంపు, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై నిరంతరం పోరాటాలు సాగిస్తోంది. ఐక్య ఉద్యమాలను నిర్మించి, కలిసి వచ్చే ఇతర సంఘాలతో విద్యార్థుల సమస్యల పట్ల దూసుకుపోతుంది. "చదువుతూ పోరాడు.. పోరాడి సాధించు.." నినాదాలతో విద్యార్థులకు మరింత చేరువ అవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలను చీల్చిచెండాడుతూ సమరశీల పోరాటాలను కొనసాగిస్తూ సమస్యల సాధన కోసం విశేషంగా కృషిచేసిన ఘనత ఏఐఎస్‌ఎఫ్‌కే దక్కింది. రాష్ట్ర, కేంద్ర బడ్జెట్‌లలో విద్యకు ఎక్కువ నిధులు కేటాయించి, విద్య సామాన్యులకు అందుబాటులో ఉండాలని డిమాండ్‌ చేస్తూ ప్రభుత్వాలకు పలుమార్లు కనువిప్పు కల్గించింది.
 
{{commons category|All India Students Federation}}
 
[[వర్గం:భారతదేశంలోని విద్యార్థి సంఘాలు]]