సినివారం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
== రూపకల్పన ==
తెలంగాణ సకల కళలకు కాణాచి. వారసత్వ కళల హరివిల్లు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలోని కళలకు పునఃర్వికాసం కలిగించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులువేస్తూ, అందమైన రంగుల జానపద, వారసత్వ, సాంస్కృతిక కళలను ప్రోత్సహిస్తుంది. అందులో భాగంగా భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులుగా [[మామిడి హరికృష్ణ]]ను నియమించింది. ఆనాటినుండి హరికృష్ణ వివిధ కళలకు తనవంతు సహకారం అందిస్తువస్తున్నాడుఅందిస్తువస్తున్న హరికృష్ణకు తెలంగాణ సినిమాపై దృష్టిపడింది. తెలంగాణలో సినిమా తీయగల డైరెక్టర్లు, నిర్మాతలు, టెక్నీషియన్లు చాలామందే ఉన్నారు. వారి ప్రతిభను తెలియజేయడంకోసం వివిధ రకాలుగా ప్రయత్నిన్నారు. అలాంటివారికోసం ఒక వేదికను ఏర్పాటుచేయాలన్న హరికృష్ణ ఆలోచనతో ఈ సినివారం రూపుదిద్దుకుంది. షార్ట్‌ఫిలిం దర్శకులను రేపటి సినిమా దర్శకులుగా చూడాలన్న ఆశయంతో ఏర్పడిన సినివారంలో వర్ధమాన దర్శకులు తీసిన లఘుచిత్రాలను ప్రదర్శింపజేస్తున్నారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/సినివారం" నుండి వెలికితీశారు