సినివారం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
== రూపకల్పన ==
తెలంగాణ సకల కళలకు కాణాచి. వారసత్వ కళల హరివిల్లు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలోని కళలకు పునఃర్వికాసం కలిగించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులువేస్తూ, అందమైన రంగుల జానపద, వారసత్వ, సాంస్కృతిక కళలను ప్రోత్సహిస్తుంది. అందులో భాగంగా భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులుగా [[మామిడి హరికృష్ణ]]ను నియమించింది. ఆనాటినుండి వివిధ కళలకు తనవంతు సహకారం అందిస్తువస్తున్న హరికృష్ణకు తెలంగాణ సినిమాపై దృష్టిపడింది. తెలంగాణలో సినిమా తీయగల డైరెక్టర్లు, నిర్మాతలు, టెక్నీషియన్లు చాలామందే ఉన్నారు. వారి ప్రతిభను తెలియజేయడంకోసం వివిధ రకాలుగా ప్రయత్నిన్నారు. అలాంటివారికోసం ఒక వేదికను ఏర్పాటుచేయాలన్న హరికృష్ణ ఆలోచనతో ఈ సినివారం రూపుదిద్దుకుంది. షార్ట్‌ఫిలిం దర్శకులను రేపటి సినిమా దర్శకులుగా చూడాలన్న ఆశయంతో ఏర్పడిన సినివారంలో వర్ధమాన దర్శకులు తీసిన లఘుచిత్రాలను ప్రదర్శింపజేస్తున్నారు.
 
తెలంగాణ దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు అద్భుతమైన కథా, కథనాలతో సినిమాలు తీస్తున్నారు. కానీ ఇది సరిపోదు. ఇంకా ఏదో కావాలి. మరిన్ని సినిమాలు రావాలి. మరింత కొత్తదనం కావాలి. ఆ కొత్తదనం కావాలంటే కొత్తతరాన్ని ప్రోత్సహించాలి. అందుకు ఒక వేదిక కావాలి. ఏ ప్రోత్సాహం లేకపోయినా లఘుచిత్రాలను తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తూ వీడియో కింద వచ్చే కామెంట్లను చూసుకుని తమని తామే ప్రోత్సహించుకుంటున్నారు కొందరు. అలాంటి వారికి ఓ వేదిక కల్పించి, నలుగురు నిపుణులతో సలహాలు, సూచనలు ఇప్పిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనకు రూపమే ఈ సినివారం. లఘుచిత్రాల దర్శకులను రేపటి సినిమా దర్శకులుగా చూడాలన్న ఆశయంతో ఏర్పడిన సినివారంలో వర్ధమాన దర్శకులు తీసిన లఘుచిత్రాలను ప్రదర్శింపజేస్తున్నారు. అంతేకాకుండా అనుభవజ్ఞులైన సినీ దర్శకులు, టెక్నీషియన్లు, నిర్మాతలను పిలిపించి ప్రదర్శన తర్వాత సినీ ప్రముఖులు, చూసిన ప్రేక్షకులతో దర్శకుడికి, నటులకు ముఖాముఖి నిర్వహిస్తున్నది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/సినివారం" నుండి వెలికితీశారు