"గుణగ విజయాదిత్యుడు" కూర్పుల మధ్య తేడాలు

ఇతని తరువాత అంతఃకలహాలవల్ల వేంగి రాష్ట్రకూటుల దండయాత్రలకు తట్టుకొనే శక్తి కోల్పోయింది. కొన్ని యుద్ధాలలో జయం, కొన్నింట పరాజయం సంభవిస్తూ ఉండేవి. రెండవ అమ్మరాజు వేంగి సింహాసనాన్ని 25 సంవత్సరాలు పాలించాడు. తరువాత జటాచోడభీముడు వేంగి, కళింగ రాజ్యాలలో ఎదురు లేకుండా పాలించాడు.
 
== తెలుగు సాహిత్యపద్య చరిత్రలోశాసనాలు స్థానం ==
తెలుగు సాహిత్య చరిత్ర గుణగ విజయాదిత్యునికి ప్రత్యేక స్థానమున్నది. తెలుగుభాషలోని తొలి మూడు పద్య శాసనాలూ గుణగ విజయాదిత్యునివి, అతని సేనాని పండరంగనివి.
 
: కట్టెపు దుర్గంబు గడు బయల్సేసి
: కందుకూర్బెజవాడ గవించె మెచ్చి.
:
: గుణగ విజయాదిత్యునివే మరో రెండు తెలుగు పద్య శాసనాలు కందుకూరు, ధర్మవరం లలో లభించాయి. అవి తొలి సీస, ఆటవెలది పద్యాలను కలిగి ఉన్నాయి.
:
: శ్రీ నిరవద్యుండు చిత్తజాత సముండు
: తాని పక్ష పాతి................
: ....................విభవ గౌరవేంద్ర..
:
: ఈ సీస పద్యం చాల వరకూ శిథిలమైందని చరిత్ర కారులు చెప్పారు. అయితే ఉన్నంతవరకూ [[కొమర్రాజు లక్ష్మణరావు]]<nowiki/>గారు ఇచ్చారు.
:
: కిరణపురము దహళ నిరుతంబు దళెనాడున్
: వల్లభుండు గుణకె నల్లుండు (వంచి) నన్
: బండరంగ చూరె పండరంగు
:
: ఈ ఆటవెలది పద్యము గుణగవిజయాదిత్యుని దాహళదేశ దండయాత్ర గురించి తెెెెలుపుతుంది.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2257516" నుండి వెలికితీశారు