మసూమా బేగం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''మాసూమా బేగం''' ([[అక్టోబరు 7]], [[1901]] - [[మార్చి 2]], [[1990]]) సుప్రసిద్ధ సంఘ సేవకురాలు. సమైక్య [[ఆంధ్రప్రదేశ్]] రాష్టంలో తొలి మహిళా మంత్రి. దేశంలో మంత్రి పదవిని అధిష్టించిన తొలి ముస్లిం మహిళ కూడా ఈమెనే! హైదరాబాదీ అయిన మాసూమా బేగం చిన్నప్పట్నుంచే సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. తల్లి ద్వారా సరోజనీనాయుడితో[[సరోజినీ నాయుడు|సరోజనీనాయుడి]]తో పరిచయం ఏర్పడింది. 1928లో బొంబాయిలో[[బొంబాయి]]లో తొలిసారిగా నిర్వహించిన అఖిల భారత మహిళా సదస్సులో పాల్గొన్నారు. [[హైదరాబాద్ స్టేట్‌లోరాష్ట్రం]]లో 1952లో జరిగిన ఎన్నికల్లో శాలిబండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. [[బూర్గుల రామకృష్ణారావు]] ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు. ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాలు విలీనం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లో పత్తర్‌గట్టి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1960 జనవరిలో రెండో ముఖ్యమంత్రి [[దామోదరం సంజీవయ్య]] ప్రభుత్వంలో మంత్రిగా చేరారు. కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకురాలు.
 
== జననం ==
మసూమా బేగం [[1901]], [[అక్టోబరు 7]] న [[హైదరాబాదు]]<nowiki/>లో విద్యావంతుల [[కుటుంబం]]<nowiki/>లో జన్మించింది. ఈమె తండ్రి ఖదివే జంగ్ బహాదుర్ (మిర్జా కరీంఖాన్), తల్లి తయ్యబా బేగం భారతదేశపు [[ముస్లిం]] మహిళలలో తొలి పట్టభద్రురాలు.<ref name=hh_tyaba>{{cite web|title=Tyaba Begum Sahaba Bilgrami|url=http://www.hellohyderabad.com/Hyderabad-History/Biographies/Tyaba-Begum-Sahaba-Bilgrami.aspx|website=HelloHyderabad.com|accessdate=3 November 2014}}</ref> ఈమె [[మాతామహుడు]] హైదరాబాదులో [[రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం|రాష్ట్ర కేంద్ర గ్రంథాలయ]] స్థాపకుడైన ఇమాదుల్ ముల్క్ [[సయ్యద్ హుస్సేన్ బిల్‌గ్రామీ ఇమాదుల్ ముల్క్]]. ఈమె సోదరుడు [[అలీ యావర్ జంగ్]] హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఈమెకు చిన్నతనం నుండి సంఘసేవలో ఆసక్తి ఎక్కువ. మసూమా విద్యాభ్యాసం మహబూబీయా బాలికల పాఠశాలలో జరిగింది. వీరు ఇరవై సంవత్సరాల వయసులో 1921లో ఈమె తల్లి తయ్యబా బేగం మరణించడంతో, <ref name=hh_tyaba /> తల్లిచే స్థాపించబడిన "అంజుమన్-ఏ-ఖవాతీన్" అనే జాతీయ మహిళా సంస్థకు<ref name=ray>{{cite book|last1=Ray|first1=Bharati|title=Women of India: Colonial and Post-colonial Periods|date=Sep 15, 2005|publisher=SAGE Publications India|isbn=8132102649|page=569|url=http://books.google.com/books?id=142HAwAAQBAJ&pg=PA569&dq=anjuman-e-khawateen#v=onepage&q=anjuman-e-khawateen&f=false|accessdate=3 November 2014}}</ref> అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 1927లో హైదరాబాదులో ఏర్పడిన అఖిల భారత మహిళా సంస్థ యొక్క ఆంధ్ర శాఖ కార్యదర్శిగా తరువాత అధ్యక్షురాలిగా పనిచేశారు.
 
1922లో ఈమె ఆక్స్‌ఫర్డులో చదివి తిరిగివచ్చిన తన కజిన్ హుసేన్ అలీఖాన్‌ను పెళ్ళి చేసుకొంది.<ref name=srivastava>{{cite book|last1=Srivastava|first1=Gouri|title=The Legend Makers: Some Eminent Muslim Women of India|date=Jan 1, 2003|publisher=Concept Publishing Company|location=New Delhi|isbn=8180690016|pages=90-92|url=http://books.google.com/books?id=ERavqiLTu7cC&pg=PA91&lpg=PA91&dq=Masuma+Begum+anjuman#v=onepage&q=Masuma%20Begum%20anjuman&f=false|accessdate=3 November 2014}}</ref> ఈమె భర్త డాక్టర్ హుసేన్ ఆలీ ఖాన్ ఆ తరువాతి కాలంలో [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో [[ఆంగ్ల భాష|ఆంగ్ల]] శాఖాధిపతిగా పనిచేశారు. వీరికి ఐదుగురు సంతానం (నలుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి) - అలీఖాన్, అనీస్ హస్నైన్, మీర్జా ఆసిఫ్ అలీఖాన్, నాసిర్ అలీఖాన్, రషీద్ అజర్ అలీఖాన్
పంక్తి 22:
[[వర్గం:1901 జననాలు]]
[[వర్గం:1990 మరణాలు]]
[[వర్గం:హైదరాబాదు జిల్లా ప్రముఖులు]]
"https://te.wikipedia.org/wiki/మసూమా_బేగం" నుండి వెలికితీశారు