మొఘల్ సామ్రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
[[దస్త్రం:Mughal.gif|thumb|ఉచ్చస్థితిలో మొఘల్ సామ్రాజ్యం]]
మొఘలాయిలు కీ.శ. 1526 నుండి 1707 వరకు భారత ఉపఖండాన్ని ([[ఆఫ్ఘనిస్తాన్]], [[పాకిస్తాన్]], [[భారత్]]) పరిపాలించిన రాజవంశీయులు. 1526లో [[తైమూర్ లంగ్|తైమూరు]] వంశానికి చెందిన బాబరు ఒకటవ పానిపట్టు యుద్ధంలో [[ఇబ్రాహీమ్ లోడీను ఓడించి '''మొఘల్ సామ్రాజ్యం''' స్థాపించాడు. ముఘల్ అంటే ''మంగోల్'' అనే పదానికి పెర్షియా భాషలో సమానమైన పదం. ''మంగోల్'' అంటే మధ్య ఆసియాలోని [[చెంఘీజ్ ఖాన్]] వంశీయులైన సంచార యుద్దవీరులు అని అర్థం. మొఘల్ వంశీయులంతా ఇస్లాం మతాన్ని కచ్చితంగా పాటించారు. బాబరు తరువాత పరిపాలనా బాధ్యతల్ని చేపట్టిన [[హుమాయూన్]]ను పఠాన్ వీరుడైన [[షేర్ షా సూరి]] జయించి [[సుర్ సామ్రాజ్యం]] స్థాపించాడు. పదహారేళ్ళ తరువాత పోగట్టుకున్న కోటలన్నింటినీ [[హుమాయూన్]] మళ్ళీ జయించాడు. [[హుమాయూన్]] తరువాత అతని కుమారుడైన [[అక్బర్]] మొఘల్ సామ్రాజ్యాన్ని విస్తరించి 1605 నుండి 1627 వరకు పాలించాడు. [[అక్బర్]] తరువాత విశాలమైన మొఘల్ సామ్రాజ్యం అతని కుమారుడైన [[జహాంగీర్]]కు సంక్రమించింది. [[జహాంగీర్]] తర్వాత ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన [[షాజహాన్]] కాలంలో మొఘల్ సామ్రాజ్యం ప్రపంచంలోనే అతి గొప్ప రాజ్యంగా కీర్తింపబడింది. ఇతను పరిపాలించిన కాలాన్నే చరిత్రకారులు మొఘల్ సామ్రాజ్య స్వర్ణ యుగంగా వర్ణిస్తారు.
 
షాజహాను కీ.శ.1630 మరియు 1653 మధ్య, తన భార్య [[ముంతాజ్ మహల్|ముంతాజ్]] జ్ఞాపకార్ధంగా, ప్రసిద్ధిగాంచిన [[తాజ్ మహల్]] కట్టించాలని సంకల్పంచాడు. ముంతాజ్ తన 14వ బిడ్ద ప్రసవ సమయంలో మరణించింది. 1700 నాటికి సామ్రాజ్యం 40లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉథ్థాన స్థితికి చేరుకొన్నది.<ref>Peter Turchin, Jonathan M. Adams, and Thomas D. Hall. [http://www.eeb.uconn.edu/faculty/turchin/PDF/Latitude.pdf ''East-West Orientation of Historical Empires.''] [[University of Connecticut]], November 2004.</ref>
"https://te.wikipedia.org/wiki/మొఘల్_సామ్రాజ్యం" నుండి వెలికితీశారు