మొఘల్ సామ్రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 68:
== రాజ్యస్థాపన మరియు బాబర్ ==
{{main|బాబర్}}
16వ శతాబ్దము తొలినాళ్లలో మంగోల్, తురుష్క, పర్షియన్ మరియు ఆఫ్హానీ యోధులతో కూడిన మొఘల్ సైన్యాలు, తైమూర్ వంశ యువరాజైన, జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్ నాయకత్వంలో భారతదేశంపై దండెత్తాయి. [[బాబర్]], మధ్య ఆసియా మొత్తాన్ని జయించిన మహాయోధుడు తైమూర్ లాంగ్ యొక్క ముని మనమడు. తైమూర్ 1398లో భారత్ పై డండయాత్రకు విఫలయత్నం చేసి సమర్‌ ఖండ్కు వెనుదిరిగాడు. తైమూర్ స్వయంగా తాను మరో మంగోల్ యోధుడు [[చెంగీజ్ ఖాన్]] వారసున్నని ప్రకటించుకొన్నాడు. ఉజ్బెక్ లచే సమర్‌ఖండ్ నుండి తరిమివేయబడిన బాబర్ మొదటగా 1504లో [[కాబూల్]]లో తన పాలనను స్థాపించాడు. ఆ తరువాత [[ఇబ్రహీం లోఢీ]] పాలిస్తున్న [[ఢిల్లీ]] సల్తనతులో అంత:కలహాలను ఆసరాగా తీసుకొని దౌలత్ ఖాన్ లోఢీ (పంజాబ్ గవర్నరు) మరియు ఆలం ఖాన్ (ఇబ్రహీం లోఢీ మామ) ల ఆహ్వానంతో బాబరు 1526లో ఢిల్లీపై దండెత్తాడు.
 
అనుభవమున్న సేనానిగా బాబర్ తన సుశిక్షుతులైన 12వేల సైన్యముతో 1526లో భారతదేశంలో అడుగుపెట్టి లోఢీ యొక్క సమైక్యతలోపించిన లక్ష బలము కల భారీ సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. ఈ [[మొదటి పానిపట్టు యుద్ధం]]లో బాబర్, సుల్తాన్ లోడీని నిర్ణయాత్మకముగా ఓడించాడు. తుపాకీ బళ్ళు, కదిలించగలిగే ఫిరంగీలు, అత్యుత్తమ ఆశ్వికదళ యుక్తులు మరియు ఆ కాలము నాటి ఆంగ్లేయుల పొడవు ధనుస్సు కంటే అత్యంత శక్తివంతమైన మొఘలు విల్లుల సహాయముతో అద్వితీయమైన విజయాన్ని సాధించాడు బాబర్. ఆ యుద్ధములో సుల్తాన్ లోఢీ మరణించాడు. ఒక సంవత్సరము తర్వాత (1527) [[కణ్వా యుద్ధము]]లో చిత్తోర్ రాజు రాణా ప్రతాప్ సింగ్ నేతృత్వములోని రాజపుత్రుల సంఘటిత సేనను నిర్ణయాత్మకముగా ఓడించాడు. బాబర్ పాలనలో మూడవ పెద్ద యుద్ధము 1529లో జరిగిన గోగ్రా యుద్ధము. ఇందులో బాబర్ ఆఫ్ఘన్ మరియు బెంగాల్ నవాబు యొక్క సంయుక్త సేనలను మట్టికరిపించాడు. తన సైనిక విజయాలను పటిష్ఠపరచే మునుపే బాబర్ 1530లో ఆగ్రా వద్ద మరణించాడు. తన ఐదేళ్ళ చిన్న పాలనాకాలములో బాబర్ అనేక కట్టడాలను నిర్మించేందుకు శ్రద్ధ వహించాడు. కానీ అందులో కొన్ని మాత్రమే మనగలిగాయి. బాబర్ తన అత్యంత ముఖ్యమైన వారసత్యముగా భవిష్యత్తులో భారత ఉపఖండముపై సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించాలనే తన స్వప్నాన్ని సాకారము చెయ్యగల వారసులను మిగిల్చిపోయాడు.
"https://te.wikipedia.org/wiki/మొఘల్_సామ్రాజ్యం" నుండి వెలికితీశారు