సింగీతం శ్రీనివాసరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
 
==జీవిత విశేషాలు==
సింగీతం శ్రీనివాసరావు [[1931]] [[సెప్టెంబరు 21]]న [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా|నెల్లూరు జిల్లా]] [[ఉదయగిరి]]లో జన్మించాడు. తండ్రి ఒక హెడ్‌మాస్టరు. తల్లి [[వయొలిన్]] వాయిద్య నిపుణురాలు. చెన్నై[[మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలోకళాశాల]]లో చదివేప్పుడు శ్రీనివాసరావుకు [[హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ]] పర్వేక్షణలో నాటకరంగంలో ప్రవేశం ఏర్పడింది. [[కళాశాల]] రోజుల్లోనే హాలీవుడ్ సినిమాలు బాగా చూసేవాడు.<ref name=sakshi.com>{{cite web|title=ఊహాశక్తికి పుస్తకమే మార్గం|url=http://www.sakshi.com/news/opinion/reading-book-is-the-only-way-of-imagination-power-242377|website=sakshi.com|publisher=జగతి ప్రచురణలు|accessdate=30 September 2016}}</ref> డిగ్రీ వచ్చిన తరువాత [[సూళ్ళూరుపేట]]లో ఉపాధ్యాయవృత్తి సాగించాడు. స్వయంగా రచించిన నాటకాలు (బ్రహ్మ, అంత్యఘట్టం) తన విద్యార్ధులతో ప్రదర్శింపజేశాడు.
[[రవీంద్రనాధ టాగూరు]] [[నాటకం]] "చిత్ర"ను "చిత్రార్జున" అనే సంగీతనాటకంగా రూపొందించి ప్రదర్శించి ప్రశంసలు అందుకొన్నాడు. ఈ నాటకాన్ని ఢిల్లీలో [[జవహర్ లాల్ నెహ్రూ]] చూశాడు. 'టామ్ బుచాన్' అనే స్కాటిష్ నాటకకారుడు ఈ నాటకాన్ని ఆంగ్లంలోకి అనువదించి ఒక అమెరికన్ [[టెలివిజన్]] ఛానల్‌లో ప్రసారం చేశాడు. కొంతకాలం శ్రీనివాసరావు "[[తెలుగు స్వతంత్ర]]" పత్రికలో రచనలు (ప్రధానంగా ఇంటర్వ్యూలు) చేశాడు.