"వీర్ల దేవాలయం (కారంపూడి)" కూర్పుల మధ్య తేడాలు

''మొదటిరోజు రాచగావు'': రాజు ఇచ్చే బలిని (నోటితో కొరికి మేకపోతును చంపటం) రాచగావుగా పిలుస్తారు. బలిని పోతురాజుకు ఇవ్వటం ద్వారా పల్నాడు వీరారాధనోత్సవాలకు తెరలేస్తుంది. రాష్ట్రంలోని 11 జిల్లాలోని ఆచారవంతులు తమ కొణతాలు (దైవాలు) తీసుకొని కారంపూడిలోని వీర్లదేవాలయం చేరతారు<ref>http://epaper.vaartha.com/1434731/Guntur/18-11-2017#page/16</ref>.<ref>http://epaper.eenadu.net/index.php?rt=index/index#</ref>
 
''రెండోరోజు రాయబారం'': అలరాజు కోడిపోరులో ఓడిన [[మాచర్ల]] రాజ్యాన్ని తిరిగి మలిదేవులకు అప్పగించాలని గురజాల రాజు నలగాముని వద్దకు సంధికి వెళతాడు. ఈ క్రమంలో నాగమ్మ ప్రభావంతో తంబళ్ళ జీయర్‌ ద్వారా చర్లగుడిపాడు వద్ద హత్యకు గురవుతాడు. ఆనాటి హత్యాకాండను వీరవిద్యావంతులు ఆలపిస్తుంటారు. ఈ క్రమంలో ఆచారవంతులు అవేశపూరితంగా కత్తిసేవ చేస్తుండటం నేటికి దర్శనీయమే<ref>http://epaper.eenadu.net/index.php?rt=index/index#</ref>.<ref>http://epaper.vaartha.com/1436090/Guntur/19-11-2017#page/10/2</ref>
 
''మూడోరోజు మందపోరు'': కోడిపోరులో రాజ్యాన్ని కోల్పోయి అడవుల పాలైన మలిదేవాదుల వద్ద ఉన్న ఆవులను అంతమొందించేందుకు నాగమ్మ పన్నాగం ద్వారా అడవి చెంచులు దాడి చేసే క్రమంలో లంకన్న అసువులు బాస్తాడు. లంకన్నకు శంఖుతీర్ధం ఇవ్వటం ద్వారా విముక్తిని బ్రహ్మన్న ప్రసాదిస్తాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2264234" నుండి వెలికితీశారు