"వీర్ల దేవాలయం (కారంపూడి)" కూర్పుల మధ్య తేడాలు

'''వీర్ల దేవాలయం'''(వీరులగుడి) 11 వ శతాబ్దంలో [[పల్నాటి యుద్ధం]] ముగిసిన తరువాత [[బ్రహ్మనాయుడు]] ఆశయసిద్ది కోసం యుధ్దంలో మరణించిన 66 వీరనాయుకులకు గుర్తులుగా 66 వీరకల్లును ప్రతిష్ఠించి వీరాచారపీఠం స్థాపించి దానికి పిడుగు వంశంవారిని పీఠాధిపతిగా నియమించారు<ref>http://books.google.co.in/books?id=MMFdosx0PokC&pg=PA85&lpg=PA85&dq=festival+in+karempudi&source=bl&ots=gyet42x-Aq&sig=9zD89tzi5OqVqq8nhGjXVjxt6Kw&hl=en&sa=X&ei=3VdoVL2oLY-6uAShm4Eg&ved=0CEIQ6AEwBg#v=onepage&q=festival%20in%20karempudi&f=false</ref> ఆ వీరకల్లులు, వీరాచారపీఠం ఉన్నదే వీరులగుడి (వీర్లదేవాలయం). ఈ గుడి [[గుంటూరు]] జిల్లా [[పల్నాడు]] ప్రాంతంలోని [[కారంపూడి]] పట్టణంలో నాగులేరు ఒడ్డున ఉంది. యుద్ధంలో మరణించిన వీరులకు దైవత్వాన్ని ఆపాదించి, వారు ఉపయోటించిన ఆయధాలకు పూజల చేసి ఉత్సావాలు జరపటం అనే సాంప్రదాయం ప్రపంచంలో రోమ్ తరువాత ఒక్క కారంపూడి లోని వీరురగుడి లోనే జరుగును<ref>http://books.google.co.in/books?id=o63Hau4If3cC&pg=PA246&lpg=PA246&dq=festival+in+karempudi&source=bl&ots=UVM2E1T5JG&sig=6ltYPdZxdgQqEpNEsNsGcIuosvc&hl=en&sa=X&ei=FFNoVLzLBIOEuwSUnILYAQ&ved=0CC8Q6AEwAw#v=onepage&q=festival%20in%20karempudi&f=false</ref>..
== చరిత్ర ==
మహాభారత యుద్ధంలో ఘట్టాల్లా పల్నాటి యుద్ధానికి అనేక కారణాలున్నాయి. అనుగురాజు పల్నాట [[గురజాల]]ను రాజ్యంగా చేసుకొని బ్రహ్మనాయుని మంత్రివర్గంలో పాలించిన సమయంలో నాగమ్మ ఆతిధ్యం స్వీకరించి కానుకను కోరుకోమనటం, అనంతర కాలంలో అనుగురాజు కొడుకైన నలగాముడి పరిపాలనలో కానుకగా మంత్రి పదవిని నాగమ్మ అడగటంతో పల్నాడు చరిత్రకు అంకురార్పణ జరిగింది. అప్పటికే వైష్ణవం ద్వారా ప్రజల్లో సమసమాజ స్థాపనకు బ్రహ్మన్న సుస్థిర స్థానం పొందాడు. ఇదే క్రమంలో శైవాన్ని ప్రబోధిస్తూ నాగమ్మ పల్నాట ముఖ్యస్థానం సంపాదించింది. ఈ క్రమంలో పల్నాడు రాజ్యం రెండు ముక్కలైంది. అనుగురాజు మొదటి భార్య సంతానమైన నలగామునికి గురజాల, రెండో భార్య సంతానమైన మలిదేవాదులకు మాచర్ల రాజ్యంగా పంపకాలు జరిగాయి. ఇరురాజ్యాల మధ్య కోడిపోరుతో కక్షలు మొదలయ్యాయి. ఈ క్రమంలో మండాది వద్ద ఆలుమందలను అంతమొందించే క్రమంలో లంకన్న ఒరగటం, నలగాముని అల్లుడు అల్లరాజు మృతి పల్నాటి యుద్ధానికి దారి తీసింది. బ్రహ్మన్న దత్తపుత్రుడు కన్నమనీడు నేతృత్వంలో బాలచంద్రుడు తదితర 66 మంది నాయకులు ఈ పల్నాటి యుద్ధంలో అసువులు బాశారు. చివరి అంకంలో బ్రహ్మన్న, నాగమ్మలు కత్తులు దూసినప్పటికీ వైరాగ్యంతో బ్రహ్మన్న గుత్తికొండ బిలంలోకి ప్రవేశించటం, నాగమ్మ మంత్రిగా నలగామునితో రాజ్యం చేయించటంతో పల్నాటి యుద్ధం ముగిసింది<ref>http://epaper.prabhanews.com/c/23843329</ref>.
 
== ఆలయ విశేషాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2264244" నుండి వెలికితీశారు