"డెన్నిస్ రిచీ" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(కొత్త సమాచారం చేర్పు)
{{వర్గం}}
'''డెన్నిస్ రిచీ''' అమెరికాకు చెందిన సుప్రసిద్ధ కంప్యూటర్ శాస్త్రవేత్త. [[సీ]] కంప్యూటర్ భాష, మరియు [[యునిక్స్ ]] ఆపరేటింగ్ సిస్టమ్ సృష్టికర్తల్లో ఒకరు. ఈయన 1941, సెప్టెంబర్ 9వ తేదిన జన్మించాడు. కంప్యూటర్ రంగంలో ఈయన చేసిన విశేష సేవకు గాను 1983లో అత్యంత ప్రతిష్టాత్మకమైన [[ట్యూరింగ్ అవార్డ్]] ను బహూకరించారు. 1998లో [[నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ]] అనే అవార్డును కూడా అందుకున్నాడు. ల్యూసెంట్ టెక్నాలజీస్ సిస్టమ్ సాఫ్ట్వేర్ , పరిశోధనా విభాగానికి అధిపతిగా పనిచేసి 2007లో పదవీ విరమణ చేశారు.
==బాల్యం మరియు విద్యాభ్యాసం==
అమెరికాలోని [[న్యూయార్కు]] రాష్ట్రంలోని బ్రాంక్స్ విల్లె అనే నగరంలో జన్మించాడు. [[హార్వర్డ్]] విశ్వవిద్యాలయం నుంచి [[భౌతిక శాస్త్రము]] మరియు గణిత శాస్త్రం నందు పట్టా పుచ్చుకొన్నాడు.1967 నుంచీ పదవఈ విరమణ చేసేవరకూ [[బెల్ ల్యాబ్స్]] లో పని చేశాడు.
==సీ మరియు యునిక్స్==
రిచీ సీ ప్రోగ్రామింగ్ భాషా సృష్టి కర్తగా, మరియు కంప్యూటర్ వాడకంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన యునిక్స్ డెవలపర్స్ బృందంలో ముఖ్య సభ్యునిగా అందరికీ సుపరిచితులు. సహ రచయిత [[కెర్నిగాన్]] తో కలిసి ఈయన [[సీ]] మీద రాసిన పుస్తకం కూడా బాగా ప్రాచుర్యం పొందింది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/226528" నుండి వెలికితీశారు