వఝల సీతారామ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 40:
== శాస్త్రాధ్యయనం ==
చిన్నతనంలోనే ఆయన తమ చినతాత చినవేంకట సిద్ధాంతి సాన్నిధ్యంలో జాతక ముహూర్త సిద్ధాంత భాగాలు, లీలావతి గణితం అభ్యసించారు. మరొక పినతాత వద్ద [[సంస్కృతము|సంస్కృత]] వ్యాకరణ ధర్మశాస్త్రాలు ఆకళింపు చేసుకున్నారు. నడాదూర్ అనంతాళ్వార్ ఆచార్యుల శిష్యరికంలో తర్క వేదాంత శాస్త్రాలను అభ్యసించారు. శాస్త్రిగారు తమ తండ్రిగారుయదగు ముఖలింగేశశాస్త్రి గారి వద్ద సంస్కృత కావ్యములను అభ్యసించిరి.పినతండ్రిగారగు నారాయణ కవీంద్రుల వద్ద సంస్కృత చ్ఛందోలంకార వ్యాకారణములను, ధర్మశాస్త్రమును అభ్యసించిరి.శ్రీశాస్త్రి గారి తర్క వేదాంత శాస్త్రాధ్యయనము నడాధూర్ అనంతాళ్వార్ గారి వద్ద జరిగినది.విద్వాన్ వేంకటరాజురెడ్డి గారివద్ద తమిళ కర్ణాటక మళయాళ వ్యాకరణములను శ్రీ శాస్త్రిగారు అభ్యసించిరి.తమ కనిష్ఠ పితామహులగు చిన వేంకట సిద్దాంతిగారి వద్ద జాతక ముహూర్త సిద్దంతములను లీలావతి బీజ గణితమును నేర్చుకొనిరి.
 
==ఉద్యోగము==
1910=1912 సం.మధ్య విజయనగరమునందలి రిప్పన్ హిందూధియోలాజికల్ హైస్కూలులో ఆంధ్రోపాధ్యాయ పదవి. 1912-1930 సం.మధ్య శ్రీవిజయనగర మహారాజావారి సంస్కృత కళాశాలలో ప్రధానాంధ్రోపాధ్యాయ పదవి. 1930-1933 మధ్య మదరాసు విశ్వ విద్యాలయము వారి ప్రాచ్య విద్యాపరిశోధక సంస్థలో ఆంధ్రోపాధ్యాయ పదవి పదవి. 1933-1941 మధ్య ఆంధ్రవిశ్వ కళాపరిషత్తులో ఆంధ్రోపాధ్యాయ పదవి
 
== భాషాశాస్త్ర పరిశోధన ==
Line 46 ⟶ 49:
== సాహిత్య విమర్శ==
సాహిత్య విమర్శకునిగా సీతారామశాస్త్రి పంచకావ్యాల్లో ఒకటైన [[వసుచరిత్ర]], ద్వ్యర్థి కావ్యంగా పేరొందిన హరిశ్చంద్ర నలోపాఖ్యానము తదితర ఉద్గ్రంథాలను ప్రామాణికంగా పరిశీలించి విమర్శరచన చేశారు. [[చింతామణి]] విషయ పరిశోధనము, [[వసుచరిత్ర]] విమర్శనము, హరిశ్చంద్ర నలోపాఖ్యానము వంటి గ్రంథాలు ఆయన విమర్శనాశక్తికి గీటురాళ్లుగా నిలుస్తాయి.
భారతి ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక మున్నగు వానిలో శ్రీశాస్త్రిగారు పలు వ్యాసములు ప్రకటింపబడెను. నన్నయ భారత భాగముపై శ్రీశాస్త్రిగారు తులనాత్మక విమర్స వ్రాసిరి.అహోబిల పండితీయమును తమ విమర్సతో ప్రకటింపవలెననుకొనిరి.ఈ విమర్స వృద్ధత్వముతో మధ్యలోనే ఆగిపోయినది.
 
1932లో శ్రీశాస్త్రిగారికి '''వ్యాకరణాచార్య ''' విరుదు ప్రధానము జరిగినది. 1947లో ఆంధ్రవిశ్వకళాపరిషత్తు వారు '''కళాప్రపూర్ణ ''' బిరిదునొసంగిరి. 1956లో ఆంధ్రరాష్ట్ర తృతీయ వార్షికోత్సవ సందర్భమున శ్రీశాస్త్రిగారికి వేనూట పదార్లు అర్పించి సన్మానించిరి.
 
== గ్రంథరచన ==