"మడిపల్లి భద్రయ్య" కూర్పుల మధ్య తేడాలు

చి (వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
'''మడిపల్లి భద్రయ్య''' తెలంగాణా ప్రాంతానికి చెందిన రచయిత, ఉత్తమ ఉపాధ్యాయుడు మరియు ఆధ్యాత్మికవేత్త.
==జీవిత విశేషాలు==
ఇతడు [[1945]], [[జనవరి 17]]వ తేదీన [[నిర్మల్]] పట్టణంలో మడిపల్లి వీరయ్య, గంగమ్మ దంపతులకు జన్మించాడు. తెలుగు భాషమీద ప్రత్యేక అభిమానంతో తెలుగులో ఉన్నత విద్యను అభ్యసించాడు. ఇతని తండ్రి వీరయ్య కూడా విద్వత్కవి. ఆయన వేములవాడ రాజరాజేశ్వరుని మీద సీసపద్యాలలో ఒక శతకాన్ని వ్రాశాడు. తండ్రి నుండి ఇతడు పద్యాలను ఎలా ఆలాపించాలో నేర్చుకున్నాడు. ఇతడు ఐదవ తరగతి చదువుతున్నప్పుడు కోరుట్ల ఆంధ్ర బాలానందసంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. 1963లో లక్షెట్టిపేట పాఠశాలలో ఉపాధ్యాయుడిగా తన ఉద్యోగ జీవితాన్ని ఆరంభించి 2001లో కుంటాల ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ చేశాడు. ఇతడు జన్నారంలో మిత్రకళాసమితి, ఇచ్చోడలో ప్రత్యూష కళా నికుంజం, ఉట్నూరులో ఆంధ్ర పద్యకవితా సదస్సు, నర్సాపూరులో నవతా కళా సమితి మొదలైన సాహితీ సాంస్కృతిక సంస్థలను స్థాపించి ఆయా ప్రాంతాలలో సాహిత్య, సాంస్కృతిక చైతన్యానికి పాటుపడ్డాడు. ఇచ్చోడలో పనిచేస్తున్నప్పుడు "ప్రత్యూష" అనే లిఖత సాహిత్యపత్రికను నడిపాడు. సత్యహరిశ్చంద్ర, గయోపాఖ్యానము వంటి పౌరాణిక నాటకాలతో పాటు నటనాలయం, రాముడు లేని రాజ్యంలో వంటి సాంఘిక నాటకాలలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇతడు బుల్లితెరపై నాగబాల, చాకలి ఐలమ్మ, కొమరం భీం వంటి సీరియళ్లలో కూడా నటించాడు. ఇతడు తొలి, మలి తెలంగాణా పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఉద్యమకారుడు. ఇతడికి భార్య ఇందిర, నలుగురు కుమారులు, కోడళ్లు, మనుమలు, మనవరాళ్లు ఉన్నారు.
 
==రచనలు==
ఇతడు ఆధ్యాత్మిక రచనలు, గేయాలు, ఒగ్గుకథలు, హరికథలు అనేకం రచించాడు. ఇతడు ప్రస్తుతం ఆదిలాబాదు మాండలిక పదకోశం నిర్మిచే పనిలో వున్నాడు. ఇతడు ప్రకటించిన గ్రంథాలు కొన్ని:
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2265542" నుండి వెలికితీశారు