"సుఘ్రా హుమాయున్ మిర్జా" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
1912లో బేగం తయ్యబా ఖదివేజంగ్ తో కలిసి "అంజుమనే ఖవాతీన్ దక్కన్" అనే మహిళా సంక్షేమ సంస్థను స్థాపించి, ఆ సంస్థకు కార్యదర్శిగా మూడు సంవత్సరాల పాటు పనిచేసింది.
 
1934లో ఈమె, తన తండ్రి సఫ్దర్ అలీ మిర్జా స్మారకార్ధం, మద్రస్సా-ఏ-సఫ్దరీయా అనే బాలికల ఉర్దూ మాధ్యమపు పాఠశాల స్థాపించింది. ఈ విద్యా సంస్థను నడపటానికి సఫ్దరియా ట్రస్టును ఏర్పాటుచేసి, తన ఆస్తిలో చాలామటుకు ఈ ట్రస్టుకు ధారపోసింది. సఫ్దరియా పాఠశాల నేటికి హైదరాబాదులోని హుమాయున్ నగర్ ప్రాంతంలో ఉన్నది.<ref name=towheed2007>{{cite book|last1=Towheed|first1=Shafquat|title=New Readings in the Literature of British India, c. 1780-1947|date=Oct 1, 2007|publisher=Columbia University Press|isbn=9783898216739|page=163|url=https://books.google.com/books?id=W2EZBQAAQBAJ&pg=PA163&lpg=PA163&dq=Sughra+mirza#v=onepage&q=Sughra%20mirza&f=false|accessdate=23 November 2017}}</ref><ref name=safdariafounder>{{cite web|title=The Founder|url=http://safdariaschool.com/the-founder-2/|website=Safdaria Girl High School|accessdate=24 November 2017}}</ref>
 
బేగం మిర్జా, అన్నీసా (మహిళ), జేబున్నిసా (అందమైన మహిళ) వంటి అనేక మహిళా సంబంధ పత్రికలకు సంపాదకురాలిగా పనిచేసింది.<ref name=minault1998>{{cite journal|last1=Minault|first1=Gail|title=Women’s Magazines in Urdu as Sources for Muslim Social History|journal=Indian Journal of Gender Studies|date=1998|volume=5|issue=2|pages=201-214|url=http://citeseerx.ist.psu.edu/viewdoc/download?doi=10.1.1.1028.256&rep=rep1&type=pdf|accessdate=24 November 2017}}</ref> ఈమె విరివిగా రచనలు సాగించింది. ఈమె రచనల్లో ముషీరే నిస్వాన్ (1920), మోహిని (1931), సఫర్‌నామా-ఏ-ఇరాక్ (1915), మజ్మువా-ఈ-నుహాజత్, ముఖ్తసర్ హాలాత్ హజ్రత్ బీబీ ఫాతిమా (1940), నసీహత్ కే మోతీ: మజ్మువా-ఈ-నసీహత్ (1955) ప్రముఖమైనవి. చాలామటుకు రచనలు తనం కలంపేరు "హయా" తో వ్రాసింది.<ref name=Pande>{{cite book|last1=Pande|first1=Rekha|last2=K.C.|first2=Bindu|last3=Atiya|first3=Viqar|title=Remade womanhoods, Refashioned Modernities: The construction of Good woman hood in Annisa an Early 20th Century Women’s Magazine in Urdu|date=January 2007|publisher=Ibedem- Verlag|location=Stuttgart, Germany|pages=147-172|url=https://www.researchgate.net/publication/230582433_Remade_womanhoods_Refashioned_Modernities_The_construction_of_Good_woman_hood_in_Annisa_an_Early_20th_Century_Women%27s_Magazine_in_Urdu|accessdate=24 November 2017|ref=New Readings in the Literature of British India- C.1780-1947}}</ref>
919

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2265650" నుండి వెలికితీశారు