శారద: కూర్పుల మధ్య తేడాలు

చి robot Modifying: en:Sharada (actress)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
'''తాడిపర్తి శారద''' (జ. [[జూన్ 25]], [[1945]]) తెలుగు సినిమా నటి. 1945 జూన్ 25న [[గుంటూరు]] జిల్లా, [[తెనాలి]]లో జన్మించిన శారద అసలు పేరు సరస్వతి. శారద, 1996లో 11వ [[లోక్‌సభ]]కు తెనాలి నియోజవర్గము నుండి [[తెలుగుదేశం పార్టీ]] తరఫున ఎన్నికైనది<ref>http://parliamentofindia.nic.in/ls/lok11/biodata/11ap38.htm</ref>. బాలనటిగా సినీ జీవితాన్ని ప్రారంభించిన శారద మూడు సార్లు ఊర్వశి అవార్డును అందుకొని ఊర్వశి శారదగా ప్రసిద్ధి చెందినది.
 
1955లో [[కన్యాశుల్కం]] సినిమాలో బాలనటిగా ఈమె రంగ ప్రవేశం చేసింది. 1955 నుండి 1961 బాలనటిగా ఉన్న శారద, ఆ తరువాత హాస్యనటిగా కొనసాగినది. ఈమె 1975లో ఒక మళయాళీని పెళ్ళి చేసుకొని [[కేరళ]]కు తరలి వెళ్ళింది. అక్కడ ఉన్న సమయములో అనేక మళయాళ సినిమాలలో నటించింది. ఈమె నటించిన మళయాళ చిత్రం స్వయంవరంలో నటనకు గాను శారదకు జాతీయ అవార్డు లభించింది. ఈ సినిమా చాలా విజయవంతమవడముతో నాలుగు భాషలలో తీశారు. అదే పాత్రను ఈమె నాలుగు వేర్వేరు భాషలలో పోషించవలసి వచ్చింది. హిందీ మరియు తెలుగు భాషలలో తీసిన స్వయంవరం సినిమాలు కూడా విజయవంతమయ్యాయి.
శారద మళయాళంలో నటించిన తులాభారం సినిమాకు మరియు తెలుగులో నటించిన నిమజ్జనం సినిమాలకు గాను రెండు సార్లు ఉర్వశి ఆవార్డు అందుకొన్నది. ఈ సినిమాలు విడుదలైన తర్వాత అప్పటిదాక హాస్య ప్రధాన పాత్రలలో నటించిన శారదకు గంభీరమైన పాత్రలు రావటం మొదలయ్యింది. ఇతర దక్షిణాది భాషల సినిమాలలో నటిస్తూ జిజీ అయిన శారద చండశాసనుడు సినిమాతో తిరిగి తెలుగు సినిమా రంగములో ప్రవేశించింది. రెండవ విడతలో నటించిన సినిమాలు వైవిధ్యభరితమై సంతృప్తి నిచ్చాయని శారద భావన.
 
"https://te.wikipedia.org/wiki/శారద" నుండి వెలికితీశారు