ఎ. ఆర్. రెహమాన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
రెహ్మాన్‌ అసలు పేరు [[ఎ. ఎస్‌. దిలీప్‌ కుమార్]]‌. తండ్రి ఆర్. కె. శేఖర్, తల్లి కస్తూరి. శేఖర్ సంగీత దర్శకుడు. ఆలయాల్లో భజన పాటలు పాడేవాడు. రెహమాన్ కు ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్ళు. అక్క కొడుకు [[జి. వి. ప్రకాష్]] కూడా ప్రముఖ సంగీత దర్శకుడిగా ఎదిగాడు. నాలుగేళ్ళ వయసు నుంచే తండ్రి దగ్గర పియానో వాయించడం నేర్చుకున్నాడు. తొమ్మిది సంవత్సరాల ప్రాయంలోనే తండ్రి మరణించాడు. ఆ సమయంలో ఇంట్లోని సంగీత పరికరాల్ని అద్దెకిస్తూ కుటుంబాన్ని పోషించేది తల్లి. తల్లి, ముగ్గురు అక్కచెల్లెళ్ళు- పేదరికం. 11 సంవత్సరాల ప్రాయంలో కుటుంబ బాధ్యతలు నెత్తిపై వేసుకొని తల్లికి చేదోడుగా ఉంటూ గిటార్‌, హార్మోనియం, పియానో, కీబోర్డు ప్లేయర్‌గా [[ఇళయరాజా]], [[రమేష్ నాయుడు]], [[రాజ్ కోటి]] లాంటి పలు సంగీత దర్శకుల ట్రూప్‌లో పనిచేస్తూ జీవితం ప్రారంభించాడు. దూరదర్శన్ ''వండర్ బెలూన్'' అనే ఒక కార్యక్రమంలో ఒకేసారు నాలుగు కీబోర్డులు వాయిస్తూ కనిపించాడు.
 
పనిలో పడి బడికి సరిగా వెళ్ళలేక పోయాడు. సంగీత దర్శకులు కూడా సొంత పరికరాలు కొనుక్కోవడంతో వీరి అద్దె వ్యాపారానికి గిరాకీ తగ్గింది. దాంతో తల్లి కూడా అతన్ని చదువు మానేసి సంగీతం మీదనే దృష్టిపెట్టమని చెప్పింది. మొదట్లో చదువుకోలేకపోయినందుకు అసంతృప్తి చెందినా తరువాత జీవిత పాఠాలు నేర్చుకున్నందుకు సంతోషపడ్డాడు. 1987 లో చెన్నై లోని కోడంబాకం లోకి వచ్చిన రెహమాన్ కుటుంబం అప్పటి నుంచీ అక్కడే ఉంటోంది. అమెరికాలోని లాస్ ఏంజిలెస్ లో కూడా రెహమాన్ కు ఓ ఇల్లుంది. పని ఒత్తిడి నుంచి బయటపడ్డానికి, సాధారణ జీవితం గడపడానికి అక్కడికి వెళుతూ ఉంటాడు.
 
తల్లి నగలు అమ్మి ఆధునిక హంగులతో ఇంట్లోనే ఒక స్టూడియో ప్రారంభించాడు.<ref name="అమ్మకు అంతకు మూడింతలు కొనిచ్చా!!">{{cite web|last1=జె.|first1=రాజు|first2=|last2=వీరాంజనేయులు|title=అమ్మకు అంతకు మూడింతలు కొనిచ్చా!!|url=http://archives.eenadu.net/11-26-2017/movies/latest-movie-news.aspx?item=interviews&no=271|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=27 November 2017|archiveurl=https://web.archive.org/web/20171127055241/http://archives.eenadu.net/11-26-2017/movies/latest-movie-news.aspx?item=interviews&no=271|archivedate=27 November 2017|location=హైదరాబాదు}}</ref>
పంక్తి 36:
 
== గౌరవాలు బిరుదులు ==
టైమ్ మ్యాగజైన్ రెహ్మాన్‌ కు "మొజార్త్''మొజార్ట్ ఆఫ్ మద్రాస్"'' బిరుదు ఇచ్చింది. ఆయన పాటలు ఆస్కార్ కు నామినేట్ అయ్యాయి. "[[స్లమ్‌డాగ్ మిలియనీర్]]" అనే చిత్రంలో 'జై హో' అనే పాటకు సమకూర్చిన సంగీతానికి ప్రతిష్ఠాత్మకమైన "[[గోల్డెన్ గ్లోబ్ అవార్డు]]", రెండు [[ఆస్కార్ అవార్డు]]లను అందుకొన్న తొలి భారతీయుడు. రెండు ఆస్కార్‌ అవార్డులను గెలుచుకొని భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లిన ఘనత రెహ్మాన్‌కే దక్కుతుంది. జాతీయ స్థాయిలో నాలుగుసార్లు ఉత్తమ సంగీత దర్శకుడుగా హిందీ, తమిళ చిత్రాలకు 19 సార్లు ఫిలిమ్‌ఫేర్‌ అవార్డులను, తమిళ ప్రభుత్వ అవార్డులను అందుకున్నాడు. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును స్వీకరించాడు. భార్య సైరా బాను, ముగ్గురు పిల్లలు ఖతీజా, రహీమ్‌, అమన్‌ .
 
2005 లో టైం మ్యాగజీన్ ఎంపిక చేసిన 10 ఉత్తమ సౌండ్ ట్రాక్స్ లో రోజా చిత్రంలోని పాట కూడా ఉంది. 2009 లో ప్రపంచంలోని అత్యంత ప్రభావశోలురైన వ్యక్తులలో ఒకడిగా గుర్తించింది. రెహమాన్ గౌరవార్ధం కెనడా లోని ఒంటారియో రాష్ట్రంలోని ఒక వీధికి అతని పేరు పెట్టారు.
 
== కుటుంబం ==
రెహమాన్ భార్య సైరా బాను. సైరా కుటుంబం గుజరాత్ నుంచి వచ్చి చెన్నైలో స్థిరపడ్డ కుటుంబం. తడ దర్గా ఖాద్రీ ఈమెను రెహమాన్ తల్లికి చూపించి సరైన జోడీ అని చెప్పారు. అలా వీరి వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఖతీజా, రహీమ్‌, అమన్‌.రెహమాన్ పుట్టిన రోజైన జనవరి 6 నే కుమారుడు అమన్ కూడా పుట్టాడు.
 
== సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు ==
"https://te.wikipedia.org/wiki/ఎ._ఆర్._రెహమాన్" నుండి వెలికితీశారు