కోయ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
కోయ గిరిజనుల పంచాయతీ విధానం:
 
కోయ గిరిజనులకు సంబంధించి ప్రత్యేక న్యాయ విధానం అమలులో ఉండేది. వీరి సమాజంలో వీటికి సంబంధించిన అంశాలు అంతర్లీనంగా కొనసాగుతూ వస్తుంటాయి. తమ తెగ ఆచార వ్యవహారాలు దీనిని అనుసరించే ఉంటాయి. దీనిలో తెగకి సంబంధించిన ప్రత్యేక వ్యక్తుల ప్రాధాన్యత ఉంటుంది. వీరు వంశపారంపర్యంగా విధులను నిర్వహిస్తూ వారి ఆచారవ్యవహారాలు గౌరవం కల్పిస్తూ తీర్పును వెళ్ళడిస్తారు.ఐతే వ్యక్తుల మధ్య కులాల మధ్య ఎలాంటి పొరపాట్లు జరిగినా,నష్టం కలిగినా తెగకు సంబంధించిన ప్రత్యేక వ్యవస్థ ద్వారా విచారిస్తారు.
 
కోయ గిరిజనులకు సంబంధించి ప్రత్యేక న్యాయ విధానం అమలులో ఉండేది.వీరి సమాజంలో వీటికి సంబంధించిన అంశాలు అంతర్లీనంగా కొనసాగుతూ వస్తుంటాయి. తమ తెగ ఆచార వ్యవహారాలు దీనిని అనుసరించే ఉంటాయి. దీనిలో తెగకి సంబంధించిన ప్రత్యేక వ్యక్తుల ప్రాధాన్యత ఉంటుంది. వీరు వంశపారంపర్యంగా విధులను నిర్వహిస్తూ వారి ఆచారవ్యవహారాలు గౌరవం కల్పిస్తూ తీర్పును వెళ్ళడిస్తారు.ఐతే వ్యక్తుల మధ్య కులాల మధ్య ఎలాంటి పొరపాట్లు జరిగినా,నష్టం కలిగినా తెగకు సంబంధించిన ప్రత్యేక వ్యవస్థ ద్వారా విచారిస్తారు.
 
వ్యక్తులు -ప్రాధాన్యత:
Line 24 ⟶ 23:
పంచాయతీ పరిష్కారానికి గూడెంకు సంబంధించి ప్రత్యేకమైన వ్యక్తులు ఉంటారు.వీరితో పాటుగా గూడెంకు సంబంధించిన కొందరు వ్యక్తులు కూడా ఉండి వారు ఆయా గోత్రానికి ప్రతినిధులుగా వ్యవహరిస్తారు.వారిలో
 
1.పటేల్: ఇతడే గూడెంకు సంబంధించి పెద్ద. ఈ పదవి సాధారణంగా ఆ గూడాన్ని ఏర్పాటు చేసినపుడు ఉన్న మెుదటి వ్యక్తికి సంక్రమిస్తుంది. గిరిజనులు ఎక్కువ కాలం ఒకే చోట నివాసం చేయరూ.ఇలా ఒకచోటి నుండి మరొక చోటికి వెళ్ళాళంటే పటేల్ సలహా మరియు అనుమతి అవసరం.విచారణ అనంతరం తుది తీర్పును పటేల్ వెళ్ళడిస్తాడు. క్రమంగా వంశ పారపర్యంగా ఆ కుటంబానికి చెందిన వ్యక్తులు పటేల్ గా వ్యవహరించే అధికారం సిధ్దిస్తుంది.
 
2.పిన పెద్ద: పటేల్ తర్వాత రెండవ ప్రాధాన్యత కలిగిన వ్యక్తి పిన పెద్ద. ఇతను కూడా గూడెం ఏర్పడినపుడు ఉన్న ప్రధాన వ్యక్తి.పంచాయతీ విధానంలో ఇతని తీర్పు కూడా కీలకమైనదే.
 
3.పూజారి:గూడెంకు సంబంధించిన కుటుంబాలకు మరియు ఆ గూడెంలోని దేవతలకు పూజిస్తూ పూజరిగా పిలవబడతాడు.ఇతను కూడా వంశపారంపర్యంగా విధులను కొనసాగించే హక్కు ఉంది. గూడెంకు సంబంధించిన సామూహిక పూజా కార్యక్రమాలు,మంచిరోజు,ముహూర్తంను నిర్ణయించేది పూజారే.కేవలం పూజలకే కాక గూడెంకు సంబంధించిన పంచాయతీలో ప్రధాన వ్యక్తిగా ఇతనికి ప్రాధాన్యత ఇస్తారు.
 
4.ఏపారి: గూడెంకు సంబంధించిన సామూహిక పనులు మరియు సమాచారాన్ని ప్రజలందరీ చేరవేయడం ఇతని ప్రధాన కర్తవ్యం. పంచాయతీ జరిగే సమయంలో అందరినీ పిలుచుకురావడం మరియు కుల పెద్దలు చెప్పిన విధులను నిర్వర్తిస్తుంటాడు.
 
పంచాయతీ రకాలు:
 
గతంలో భూ ఆక్రమణ, అక్రమ సంబంధం లాంటివి పెద్దల దృష్టికి తీసుకువచ్చి పంచాయతీ ఏర్పాటు చేసి పెద్దల సమక్షంలో పరిష్కారం జరిపేవారు.ఇలా తిరిగి జరగకుండా ఆ తెగకు సంబంధించిన ప్రజలు జాగ్రత్త పడేవారు.పంచాయతీలో ప్రధానంగా తిట్టుకోవడం,కొట్టుకోవడం,ఆలూమగల పంచాయతీ, దొంగతనాలు, ఆక్రమణలు,భూ తగదాలు, అత్తాకోడళ్ళ పంచాయతీ, ఆస్తి తగాదాలు,విడాకులు,అక్రమసంబంధం, బలాత్కారం వంటి ఎన్నో రకాలైన పంచాయతీలు ఉంటాయి. ఇందులో చాలా వరకూ ఆవేశంతో కూడుకుని చేసుకునే పంచాయతీలే ఉంటాయి.
 
శిక్షలు-విముక్తి చర్యలు:
"https://te.wikipedia.org/wiki/కోయ" నుండి వెలికితీశారు