రవిప్రకాష్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
| name = రవిప్రకాష్
| occupation = నటుడు
|residence=విశాఖపట్నం, హైదరాబాదు}}
'''రవిప్రకాష్''' ఒక సినీ నటుడు.<ref name=prajasakti.com>{{cite web|title=ఉత్తమ నటనపై దృష్టి|url=http://www.prajasakti.com/WEBSUBCONT/1842644|website=prajasakti.com|accessdate=29 November 2017}}</ref> తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 125 కి పైగా చిత్రాల్లో నటించాడు.<ref name=andhrajyothy.com>{{cite web|title=నోట్ల రద్దు ప్రభావం సినీ రంగంపై ఎక్కువే: నటుడు రవి ప్రకాశ్|url=http://www.andhrajyothy.com/pages/cinema_article?SID=342041|website=andhrajyothy.com|publisher=ఆంధ్రజ్యోతి|accessdate=29 November 2017}}</ref> ముందుగా వైద్యవిద్యనభ్యసించి తర్వాత ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన [[శుభవేళ]] అనే చిత్రంలో కథానాయకుడిగా తన నట ప్రస్థానాన్ని ప్రారంభించాడు. తర్వాత ఎక్కువగా సహాయ పాత్రల్లో నటించాడు. ముఖ్యంగా రవిప్రకాష్ [[ఘర్షణ (2004 సినిమా)|ఘర్షణ]], [[అతడు (సినిమా)|అతడు]], [[వేదం (సినిమా)|వేదం]] సినిమాల్లో అతను పోషించిన పోలీసు ఆఫీసరు పాత్రలకు మంచి గుర్తింపు లభించింది. తమిళంలో వానం, పయనం, మాట్రాన్ లాంటి సినిమాల్లో నటించాడు.
 
== వ్యక్తిగత విశేషాలు ==
రవిప్రకాష్ అసలు పేరు దుగ్గిరాల రవి.<ref>{{Cite web|url=https://www.youtube.com/watch?v=iNWMfwAP4_U|title=Special chit chat with Actor Ravi Prakash|publisher=10TV}}</ref> స్వస్థలం [[విజయవాడ]]. తండ్రి జిల్లా కోర్టులో పనిచేసేవాడు. తర్వాత విశాఖపట్నంలోనే వ్యాపారస్తుడిగా స్థిరపడ్డారు. తల్లి గృహిణి. ప్రాథమిక విద్య నుంచి పీజీ దాకా [[విశాఖపట్నం]]<nowiki/>లో చదువుకున్నాడు. సామాజిక సేవ స్ఫూర్తితో వైద్యవిద్య చదవాలనుకున్నాడు. 2000 లో ఎం. బి. బి. ఎస్ పూర్తయింది. చదివే సమయంలో స్నేహితుల సలహా మేరకు నట శిక్షకుడు సత్యానంద్ దగ్గర శిక్షణ తీసుకున్నాడు.<ref>{{Cite web|url=https://www.youtube.com/watch?v=khypz42dcJE|title=Rocking Ramulamma Show|publisher=6TV}}</ref> వైద్యవృత్తిలోకి రాకమునుపే సరదాగా సినిమాల్లో అవకాశం కోసం ఫోటోలు పంపించాడు. సినిమా అవకాశం రావడంతో ఆ రంగంలోకి ప్రవేశించాడు.
 
ఈయనకు ఒక అక్క. ఆమె అమెరికాలో నివసిస్తోంది.<ref>{{Cite web|url=https://www.youtube.com/watch?v=KxrS6Nh9ljg|title=Telugu actor Ravi Prakash Exclusive Interview|website=Youtube|publisher=Studio N News}}</ref> ఇతని భార్య మరియు ఆమె కుటుంబం మొత్తం వృత్తిరీత్యా వైద్యులే.<ref>{{Cite web|url=https://www.youtube.com/watch?v=i4-C3UyIs2Q|title=Interview with actor Ravi Prakash Part3|publisher=Cinegoer}}</ref>వీరికి ఒక బాబు.
 
== కెరీర్ ==
2000 లో రమణ దర్శకత్వంలో [[ఉషాకిరణ్ మూవీస్]] నిర్మించిన [[శుభవేళ]] అనే చిత్రంలో కథానాయకుడిగా తన నట ప్రస్థానాన్ని ప్రారంభించాడు. రమణ దర్శకుడు [[తేజ]] స్నేహితుడు కావడంతో ఈ సినిమా నిర్మాణంలో ఆయనే కీలక పాత్ర పోషించారు. ఆ సినిమా ఆశించినంతగా ఆడలేదు. ఈ సినిమాలో సిబ్బంది పొరపాటున రవికాంత్ అనే పేరుతో అచ్చైంది. తర్వాత రవిప్రకాష్ అని పేరు మార్చుకున్నాడు. తర్వాత హైదరాబాదులో గాంధీ ఆసుపత్రిలో రెండు సంవత్సరాలు హౌస్ సర్జన్ చేయడం కోసం గ్యాప్ తీసుకున్నాడు. పెద్దగా శిక్షణ లేకుండా మొదటి సినిమా నటించిన తర్వాత కొద్దిరోజులు నటనలో నైపుణ్యాలు మెరుగుపరుచుకున్నాడు. తర్వాత 2002 లో [[ఈశ్వర్]], సీతయ్య సినిమాల్లో నటించాడు. ఘర్షణ సినిమాలో అతను పోషించిన పోలీసు ఆఫీసరు పాత్ర అతనికి మంచి గుర్తింపునిచ్చింది. తర్వాత అలాంటి పాత్రలు చాలా నటించాడు. [[అతడు (సినిమా)|అతడు]] సినిమాలో చేసిన పాత్ర కూడా అతనికి గుర్తింపు తెచ్చిపెట్టింది.
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/రవిప్రకాష్" నుండి వెలికితీశారు