పసునూరు శ్రీధర్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 48:
 
==వృత్తి జీవితం==
న్యాయశాస్త్ర పట్టభద్రుడైన తరువాత [[1992]]లో కొన్ని రోజుల పాటు [[హై కోర్టు]]లో ప్రాక్టీసు చేసినా, అందులో తాను ఇమడలేనని భావించి తన ప్రవృత్తినే వృత్తిగా మార్చుకునేందుకు 1993 లో [[హైదరాబాద్]] లోని [[ఆంధ్రభూమి]] దినపత్రికలో సబ్ ఎడిటర్ గా జర్నలిస్ట్ జీవితాన్ని ప్రారంభించాడు. రెండేళ్ళు ఆంధ్రభూమిలో పనిచేసిన తరువాత [[ఇండియా టుడే]] [[తెలుగు]] పత్రికలో సబ్ ఎడిటర్ గా ఎంపికయ్యాడు. 1995 ప్రారంభం నుంచి 2008 నవంబరు వరకు పద్నాలుగేళ్ళు [[ఇండియా టుడే]]కు ఎన్నో విశిష్ట కథనాలు అందించి, కవిగానే కాకుండా పాత్రికేయునిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.

2008 నవంబరు చివరి వారంలో ఆ ఏడాది కొత్తగా ప్రారంభమైన 24 గంటల వార్తా చానల్ [[హెచ్ ఎమ్ టివి|హెచ్.ఎం.టి.వి]] లో అసిస్టెంట్ ఎడిటర్ గా చేరాడు. ఆ తరువాత 2011 ఆగస్టు నెలలో V6 న్యూస్ ఛానెల్ వ్యవస్థాపక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా పనిచేసి, చానల్ నిర్మాణంలో కీలకపాత్ర పోషించాడు. 2012 సెప్టెంబరులో V6 న్యూస్ నుంచి వెనక్కి వచ్చి మళ్ళీ హెచ్.ఎం.టి.విలో చేరాడు.

హెచ్.ఎం.టి.విలో ప్రోగ్రెస్ డిబేట్ వంటి స్ఫూర్తిదాయక చర్చలను నిర్వహించాడు. 2013 డిసెంబరులో హెచ్.ఎం.టి.వి నుంచి వైదొలగాడు. ఆ తరువాత దాదాపు ఏడాది పాటు ETV తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ చానల్ల్లో ప్రైమ్ టైమ్ షో "ప్రతిధ్వని" కార్యక్రమాన్ని, ఇతర లైవ్ షోస్ ను ప్రజెంట్ చేశాడు. అదే సమయంలో హైదరాబాద్ లోని పుడమి పబ్లికేషన్స్ నుంచి [[విద్యార్థులు]], యువతరానికి [[రాజకీయాలు|రాజకీయ]], [[సామాజిక శాస్త్రం|సామాజిక]], శాస్త్రీయ అంశాల మీద సులువుగా అవగాహన కల్పించే లక్ష్యంతో "Young Zone" అనే మాసపత్రికను ప్రారంభించాడు.

యంగ్ జోన్ మాస పత్రికకు మేనేజింగ్ ఎడిటర్ గా పనిచేసిన తరువాత, 2015 మే నెలలో మళ్ళీ ఎలక్ట్రానిక్ మీడియాలోకి అడుగుపెట్టాడపఅడుగుపెట్టాడు. ప్రజల చానల్ గా గుర్తింపు తెచ్చుకున్న 10టీవీకి అసోసియేట్ ఎడిటర్ గా బాధ్యతలు స్వీకరించి,స్వీకరించాడు.<ref ప్రస్తుతంname="10 టీవీ విధుల్లోనేలో కొనసాగుతున్నాడుచేరబోతున్న పసునూరి శ్రీధర్ బాబు!">{{cite web|last1=ఏపి మీడియా కబుర్లు|title=10 టీవీ లో చేరబోతున్న పసునూరి శ్రీధర్ బాబు!|url=http://apmediakaburlu.blogspot.in/2015/04/10.html|website=apmediakaburlu.blogspot.in|accessdate=30 November 2017}}</ref>
 
==అనేకవచనం==