నార్ల వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 36:
 
==జీవిత విశేషాలు==
[[మధ్య ప్రదేశ్]] లోని [[జబల్పూర్|జబల్‌పూర్‌]]<nowiki/>లో జన్మించిన నార్ల విద్యాభ్యాసం [[కృష్ణా జిల్లా|కృష్ణాజిల్లా]]<nowiki/>లో జరిగింది. వెంకటేశ్వరరావు [[ఏప్రిల్ 3]], [[1958]] నుండి [[ఏప్రిల్ 2]], [[1970]] వరకు రెండు పర్యాయములు [[రాజ్యసభ]] సభ్యునిగా పనిచేశాడు. ఈయన ''నార్ల వారి మాట'' అను శతకాన్ని కూడా రచించాడు. నార్ల వారి సొంత గ్రంథాలయంలో 20,000 పుస్తకాలు ఉండేవట. కవిగా, రచయితగా, నాటకకర్తగా, విమర్శకుడుగా, అనువాదకుడుగా, పాత్రికేయునిగా అనేకులకు నార్ల స్ఫూర్తి ప్రదాత. ఇంగ్లీషులో ఆలోచించి తెలుగులో రాసే మూసలో కొట్టుకుపోతున్న పాత్రికేయాన్ని ప్రజల భాషకు చేరువ చేశారు. తెలుగు పత్రికా రచనకు కొత్త గౌరవాన్ని, మర్యాదను సమకూర్చారు. '[[స్వరాజ్య పత్రిక|స్వరాజ్య]]', 'జనవాణి', 'ప్రజామిత్ర' పత్రికల్లో మెరుపులు మెరిపించి '[[ఆంధ్రప్రభ]]', '[[ఆంధ్రజ్యోతి]]' పత్రికల సంపాదక బాధ్యతలను చేపట్టి వాటిని తీర్చిదిద్దారు.ఎడిటర్‌గా పనిచేసిన ముప్ఫై మూడేళ్ల కాలంలో ఛాందస విశ్వాసాలతో రాజీలేని పోరు సాగించి, నిజంపట్ల నిబద్ధత, జనశ్రేయంపట్ల నిజాయతీ, వృత్తిపథంలో తిరుగులేని నిర్భీకతలను పాత్రికేయుడి ప్రధాన లక్షణాలుగా నార్ల విశ్వసించారు.
[[మధ్య ప్రదేశ్]] లోని [[జబల్పూర్|జబల్‌పూర్‌]]<nowiki/>లో జన్మించిన నార్ల విద్యాభ్యాసం [[కృష్ణా జిల్లా|కృష్ణాజిల్లా]]<nowiki/>లో జరిగింది.
 
వెంకటేశ్వరరావు [[ఏప్రిల్ 3]], [[1958]] నుండి [[ఏప్రిల్ 2]], [[1970]] వరకు రెండు పర్యాయములు [[రాజ్యసభ]] సభ్యునిగా పనిచేశాడు. ఈయన ''నార్ల వారి మాట'' అను శతకాన్ని కూడా రచించాడు. నార్ల వారి సొంత గ్రంథాలయంలో 20,000 పుస్తకాలు ఉండేవట. కవిగా, రచయితగా, నాటకకర్తగా, విమర్శకుడుగా, అనువాదకుడుగా, పాత్రికేయునిగా అనేకులకు నార్ల స్ఫూర్తి ప్రదాత. ఇంగ్లీషులో ఆలోచించి తెలుగులో రాసే మూసలో కొట్టుకుపోతున్న పాత్రికేయాన్ని ప్రజల భాషకు చేరువ చేశారు. తెలుగు పత్రికా రచనకు కొత్త గౌరవాన్ని, మర్యాదను సమకూర్చారు. '[[స్వరాజ్య పత్రిక|స్వరాజ్య]]', 'జనవాణి', 'ప్రజామిత్ర' పత్రికల్లో మెరుపులు మెరిపించి '[[ఆంధ్రప్రభ]]', '[[ఆంధ్రజ్యోతి]]' పత్రికల సంపాదక బాధ్యతలను చేపట్టి వాటిని తీర్చిదిద్దారు.ఎడిటర్‌గా పనిచేసిన ముప్ఫై మూడేళ్ల కాలంలో ఛాందస విశ్వాసాలతో రాజీలేని పోరు సాగించి, నిజంపట్ల నిబద్ధత, జనశ్రేయంపట్ల నిజాయతీ, వృత్తిపథంలో తిరుగులేని నిర్భీకతలను పాత్రికేయుడి ప్రధాన లక్షణాలుగా నార్ల విశ్వసించారు.
 
సంపాదకీయాలను పత్రికకు ప్రాణదీపాలుగా మార్చడంతోపాటు, సామాజిక సంస్కరణకు వాహికలుగా వాటిని నార్లవారు ఉపయోగించారు. [[చక్రవర్తి రాజగోపాలాచారి|రాజగోపాలాచారి]]<nowiki/>ని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవాలని 1946లో మహాత్ముడు నిర్ణయించినప్పుడు- దానికి నిరసనగా నార్ల పరంపరగా సంపాదక శస్త్రాలను ప్రయోగించారు. అదేవిధంగా మహాత్ముడు చనిపోయినప్పుడు ఆయన రాసిన సంపాదకీయం ఆంధ్రదేశాన్ని పట్టి కుదిపింది. [[వేటూరి ప్రభాకరశాస్త్రి]] స్థాయి వ్యక్తి వారికి సాష్టాంగ నమస్కారం' అన్నారు. ప్రజలకు అర్థమయ్యే జీవభాషలో సంపాదకీయాలను రాశారు. నైజాం ప్రభుత్వం ఆంధ్రప్రభను నిషేధించినా రజాకార్ల దురాగతాలపై ఎత్తిన కత్తి దించకుండా కలం చేసిన యోధుడాయన.<ref>ఈనాడు దినపత్రిక, తేది డిసెంబర్ 1, 2008, పేజీ 4లో ఇందిరాగోపాల్ రాసిన వ్యాసం</ref>