రుద్రమ దేవి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 47:
అప్పటికి ఆమె వయస్సు ఎనభై ఏళ్లు. ఇరు పక్షాల మధ్య దాదాపు రెండు వారాలకు పైగా భీకర పోరాటం సాగింది. ఆ వయసులోనూ రుద్రమను అంబదేవుడు ఓడించలేకపోయాడు. యుద్ధంలో రుద్రమను నేరుగా ఎదుర్కోలేక కపట మాయోపాయం పన్నాడు. ఆ రోజు రాత్రి క్షేత్రానికి సమీపంలో గుడారంలో కార్తీక సోమవారం సందర్భంగా పరమ భక్తురాలైన రుద్రమ ప్రత్యేక పూజల్లో నిమగ్నమై ఉంది. పూజారుల స్థానంలో తమ వాళ్లను పంపిన అంబదేవుడు తన దుష్టపథకాన్ని అమలు చేశాడు. పూజలో ఉన్న రుద్రమను అంబదేవుడి మనుషులు వెనుక నుంచి పొడిచారని చరిత్రకారులు చెబుతారు. కాకతీయ సామ్రాజ్యానికే వన్నెతెచ్చిన వీర ధీరనారి ఆమె. శత్రువుకు ఎదురొడ్డి నిలిచి.. రాజ్యాన్ని పాలించింది. గొప్ప పరిపాలనాధ్యక్షురాలిగా.. కీర్తికెక్కిన మహిళామణి. ఆమే కాకతీయ సామ్రాజ్యాన్ని దశదిశలా విస్తరింపజేసిన రాణీ రుద్రమదేవి. అయితే రుద్రమదేవి చర్రిత అందరికి తెలిసినప్పటికీ.. ఆమె జీవిత చరమాంకానికి సంబంధించిన విషయాలు ఎక్కడా ప్రస్తావించలేదు. ఆ వివరాలు తెలియాలంటే నల్లగొండ జిల్లాకు వెళ్ళాల్సిందే.
==రాణి రుద్రమదేవి చరిత్ర==
కాకతీయుల పేరు చెప్పగానే ముందుగా స్మరణకు వచ్చే రాణి రుద్రమదేవి చరిత్ర. కాకతీయుల్లోనే రాయగజకేసరి బిరుదాంకితురాలై కీర్తింపబడిన రుద్రమదేవి జీవిత చరమాంకం ఏ విధంగా ముగిసిందో చరిత్రలో ఎక్కడా రాయలేదు. కానీ నల్లగొండ జిల్లా [[నకిరేకల్మునుగోడు]] మండలంలోని చందుపట్లచోల్లేడు గ్రామం రాణీ రుద్రమాదేవి జీవిత చరమాంకానికి సంబంధించిన చారిత్రక అవశేషాలను దాచుకొంది. రాణీ రుద్రమాదేవి ఇదే గ్రామంలో చనిపోయిందని తెలిపే శిలాశాసనాలు చాలాకాలం తర్వాత బయటపడ్డాయి.
 
==రుద్రమదేవి మరణశాసనం ==
ఉస్మానియా యూనివర్శిటీలో.. తెలుగు రీసెర్చ్ స్కాలర్ గా పనిచేస్తున్న సైదులు.. కాకతీయ రుద్రమాదేవి మరణానికి సంబంధించిన చారిత్రిక ఆధారాల కోసం అన్వేషించసాగాడు. ఇందులో భాగంగానే.. చందుపట్ల గ్రామంలో మట్టిలో కూరుకుపోయిన శాసనాన్ని గుర్తించి పురావస్తు శాఖాధికారుల సహాయంతో.. వెలికితీయించి అది రుద్రమదేవి మరణశాసనంగా గుర్తించారు. విరోధనామ సంవత్సరం ద్వాదశి రోజున అంటే.. 1289వ సంవత్సరం, నవంబరు 27వ తేదీన రాణీ రుద్రమదేవి వీరమరణం పొందినట్లుగా శాసనంపై లిఖించినట్లు వెల్లడైందని తేలింది<!-- <ref>http://venuvu.blogspot.in/2014/11/blog-post.html</ref> -->.
"https://te.wikipedia.org/wiki/రుద్రమ_దేవి" నుండి వెలికితీశారు