వైద్యుల చంద్రశేఖరం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
←Created page with ''''వైద్యుల చంద్రశేఖరం''' ప్రముఖ రంగస్థల నటుడు. ఇతడు ఏకపాత్రాభి...' |
|||
పంక్తి 6:
ఇతడు 1924లో విద్యార్థి దశలో ఉన్నప్పుడు నెల్లూరులోని ఔత్సాహిక నాటక కళాకారుల బృందంతో కలిసి పౌరాణిక నాటకాలు ప్రదర్శించాడు. ఈ నాటకాలలో ఇతడు ధరించిన పాత్రలన్నీ స్త్రీ పాత్రలు. తరువాత తన మిత్రులతో కలిసి సాంఘిక ఇతివృత్తాలున్న చిన్న చిన్న నాటికలను ప్రదర్శించేవాడు. పౌరాణిక నాటకాలలో స్త్రీ పాత్రలు ధరించిన నేపథ్యంలో ఇతనికి షేక్స్పియర్ నాటకాలలో కూడా స్త్రీపాత్రలు ధరించే అవకాశం లభించింది. కింగ్ లియర్, మర్చెంట్ ఆఫ్ వెనీస్, మాక్బెత్, ఒథెల్లో నాటకాలలో ఇతడు నటించాడు. ఇతని వాచకం ఇంగ్లీష్ జాతీయుల ఉచ్చారణతో పోటీ పడేది.
===ఏకపాత్రలు===
ఒకవైపు ఇతడు నాటకాలలో నటిస్తూనే ఏకపాత్ర ప్రక్రియవైపు దృష్టిని సారించాడు. ఇది ఇతని రంగస్థల జీవితంలో పెద్ద మార్పు. ఈ ప్రక్రియనుండి ఇతడు బహురూపధారణ అనే ప్రక్రియకు శ్రీకారం చుట్టాడు. దాదాపు 90 రూపాలను ఒకే ప్రదర్శనలో ఒకే వేదికపై ప్రదర్శించేవాడు. కొత్త వేషం కోసం తెరవెనుకకు వెళ్లేవాడు కాదు. వేదిక మీదే ఏర్పాటు చేసుకున్న టేబుల్ ఇతని గ్రీన్‌రూమ్ అయిపోతుంది. దాని మీదే మేకప్ సామాగ్రి ఉంచుకునే వాడు. అప్పటికే ఉన్న వేషం తాలూకు మేకప్‌ను కొద్దిగా మార్చుకుని కేవలం మూడు నిమిషాలలో ఐదారు రూపాలను ప్రదర్శించేవాడు. ఇతడు వేసుకునే వేషాలన్నీ ప్రపంచ ప్రఖ్యాతులైన వారివే. ఇతడు వేసిన వేషాలలో [[జవహర్లాల్ నెహ్రూ]], [[బి.డి.జెట్టి]], [[మహాత్మా గాంధీ]], [[ఒమర్ ముఖ్తార్]], [[టంగుటూరి ప్రకాశం]], [[అడాల్ఫ్ హిట్లర్]], [[ఇందిరా గాంధీ]], [[అబుల్ కలాం
|