రుద్రమ దేవి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 52:
ఉస్మానియా యూనివర్శిటీలో.. తెలుగు రీసెర్చ్ స్కాలర్ గా పనిచేస్తున్న సైదులు.. కాకతీయ రుద్రమాదేవి మరణానికి సంబంధించిన చారిత్రిక ఆధారాల కోసం అన్వేషించసాగాడు. ఇందులో భాగంగానే..మునుగోడులో మట్టిలో కూరుకుపోయిన శాసనాన్ని గుర్తించి పురావస్తు శాఖాధికారుల సహాయంతో.. వెలికితీయించి అది రుద్రమదేవి మరణశాసనంగా గుర్తించారు. విరోధనామ సంవత్సరం ద్వాదశి రోజున అంటే.. 1289వ సంవత్సరం, నవంబరు 27వ తేదీన రాణీ రుద్రమదేవి వీరమరణం పొందినట్లుగా శాసనంపై లిఖించినట్లు వెల్లడైందని తేలింది<!-- <ref>http://venuvu.blogspot.in/2014/11/blog-post.html</ref> -->.
 
==అంబదేవుడి రుద్రమ చేతిలో రుద్రమ వీరమరణం ==
నల్లగొండ సమీపంలోని పానగల్లుకు వస్తోన్న క్రమంలోనే మునుగోడు కాపర్తి అయిన అంబదేవుడి చేతిలో వీరమరణం పొందినట్లు శిలాశాసనం ద్వారా వెల్లడవుతోంది. రాణి రుద్రమతోపాటు.. ఆమె సైన్యాధ్యక్షుడు మల్లిఖార్జున నాయుడు కూడా అక్కడ చనిపోయినట్లు ఆధారాలు వెల్లడిస్తున్నాయి. అయితే.. ఈ శాసనాన్ని రాణిరుద్రమ సేవకుడు పువ్వుల ముమ్మడి అనే వ్యక్తి వేయించినట్లు తెలుస్తోంది. ఈ శాసనం బైటపడేవరకు.,. రాణి రుద్రమదేవి మరణించిన తేదీల విషయం ప్రపంచానికి తెలియదు. ఈ శాసనం ఆధారంగా 1289 నవంబరు 27న రుద్రమదేవి చనిపోయినట్లుగా నిర్ధారణ అయ్యింది.
 
"https://te.wikipedia.org/wiki/రుద్రమ_దేవి" నుండి వెలికితీశారు