కొక్రేన్ బాయిలరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
7.చిమ్నీ:ఉష్ణ మార్పిడి తరువాత బాయిలరు షెల్ వెనుక భాగం నుండి వెలువడు తక్కువ ఉష్ణోగ్రత వేడి గాలులు (210-220°C)ఈ చిమ్నీ ద్వారా వాతావరణం లో కలియును. మాములుగా ఓడల్లో కాకుందా భూమి మీద పరిశ్రమల్లో వుండు చిమ్నీని స్టాకింగు అని కూడా అందురు. ఇది ఉక్కుతో లేదా వెలుపల కాంక్రీట్ నిర్మాణమున్న రిఫ్రాక్టరీ ఇటుకలతో స్తూపాకారంగా కనీసం 31 మీటర్ల( 100 అడుగుల) ఎత్తు నిర్మింపబడి ఉండును.
8.మ్యాన్ హోల్:ఇది బాయిలరు షెల్ పైభాగాన ఉన్న అర్థ గోళాకార భాగాన అమర్చబడి వుండును.ఇది సులభంగా మనిషి షెల్ లోపలి వెళ్ళు సైజులో వుండును.సంవత్సరాంత మరమత్తుసమయంలోఆపరేటరు లోపలికివెళ్ళి ట్యూ బు లు ఎలా ఉన్నది,స్కేల్ ఏమేరకు ఉన్నది వంటి వి తనిఖి చెయ్యుటకు ఈ మ్యాన్ ఉపయోగ పడును.అలాగే బాయిలరు దిగువ భాగాన మడ్ హోల్ వుండును.దీని ద్వారా బాయిలరు అడుగున సెటిల్ అయ్యే బురద వంటి దాన్నిని తొలగించెదరు.
==బాయిలరుకు అదనంగా అమర్చబడి వుందువుండు ఉపకరణాలు==
1. ఫీడ్ వాటరు పంపు: ఇది బాయిలరుకు కావాల్సిన వాటరును బాయిలరుకు పంపింగు చెయ్యును. బాయిలరు వాతావరణ వత్తిడికి కన్న ఎక్కువ వత్తిడిలో( 9-10Kg/cm2)స్టీము ఉత్పత్తి చేయ్యును.కావున ఫీడ్ పంపు బాయిలరు వర్కింగు ప్రెసరు కన్న ఒకటిన్నర రెట్లు ఎక్కువ వత్తిడిలో వాటరును తోడు పంపును బాయిలరుకు అమర్చెదరు. అంతేకాదు బాయిలరు గంటకు స్టీముగా మార్చు నీటి పరిమాణం కన్నరెండితలు ఎక్కువ నీటినితోడు కెపాసిటి కల్గి వుండును.ఫీడ్ పంపుగా గతంలో రెసిప్రోకెటింగ్ వాడెవారు.తరువాత హరిజంటల్ మల్టి స్టెజి సెంట్రిఫ్యుగల్ పంపులను వాడుచున్నారు.కొత్తగా వెట్రికల్ మల్టి స్టేజి పంపులు వాడుకలోకి వచ్చాయి.
2. గ్లాసు ట్యూబువాటరు లెవల్ ఇండికేటరు గేజ్/వాటరు గేజ్:బాయిలరులో ఎప్పుడు ఫైరుట్యూబుల మట్టం దాటి నీరు వుండాలి. అప్పుడే ఎటు వంటి ప్రమాదం లేకుండా నీరు స్టీము గా ఏర్పడును. బాయిలరులో ఇంధనం వలన ఏర్పడు వేడి వాయువుల ఉష్ణోగ్రత 1000°C డిగ్రీలు దాటి వుండును.ట్యూబుల మట్టానికి దిగువన వాటరు ఉన్న చో , ఇంతటి ఉష్ణోగ్రత ఉన్న ఫ్లూగ్యాసెస్ ఫైరుట్యూబుల ద్వారా వెళ్ళునపుడు ఉష్ణ వినిమయం జరుగనందున ట్యూబుల ఉష్ణోగ్రత పెరిగి బాయిలరు ట్యూబులు పేలి పోవును.అందువలన బాయిలరు షెల్ లో నీటి మట్టం ట్యూబు బండిల్ కన్నఎక్కువ మట్టం వరకు ఉండటం అత్యంత ఆవశ్యకం.బాయిలరు షెల్ లో వాటరు ఎంత ఎత్తులో నీరు వున్నది ఈ వాటరు గేజ్ వలన తెలుస్తుంది.
ప్రెసరు గేజ్:ఈ పరికరం బాయిలరులో ఉత్పత్తి అయ్యే స్టీము ప్రెసరును చూపిస్తుంది.
[[వర్గం:బాయిలర్లు]]
[[వర్గం:ఫైరు ట్యూబు బాయిలర్లు]]
"https://te.wikipedia.org/wiki/కొక్రేన్_బాయిలరు" నుండి వెలికితీశారు