వీధి నాటకం: కూర్పుల మధ్య తేడాలు

చి 201.172.215.199 (చర్చ) చేసిన మార్పులను Pranayraj1985 యొక్క చివరి కూర్పు వరకు త...
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మూలాలు లేవు}}
[[దస్త్రం:Harikatha kaariNi.JPG|thumb|right|దామల చెరువు గ్రామమంలో మహాభారత నాటకాల సందర్భంగా హరికథ చెప్పే హరికథ కళాకారిణి|220x220px]]'''వీధి నాటకం''' అనునది బహిరంగ ప్రదేశాలలో ప్రేక్షకుల నుండి ప్రత్యేక చెల్లింపు లేకుండా కళాకారులు చేసే రంగస్థల ప్రదర్శన. ఈ ప్రదర్శనా ప్రాంతాలు షాపింగ్ కేంద్రాలు, కారుపార్కులు, వినోద కేంద్రాలు, కళాశాల లేదా విశ్వవిద్యాలయ క్యాంపస్ లు మరియు వీథిలో బహిరంగ ప్రదేశాలు ఏవైనా కావచ్చు. ఈ ప్రదర్శనకారులు ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో ముఖ్యంగా పెద్ద సంఖ్యలో ఉన్న జనసమూహం గల ప్రాంతాలలో ప్రదర్శనలిస్తుంటారు. వీధినాటకాలలో ప్రదర్శించే కళాకారులు ఏదైనా రంగస్థల సంస్థలకు చెందినవారు కానీ, లేదా వారి ప్రదర్శనలను పలువురికి చూపాలనే ఔత్సాహిక కళాకారులు గానీ ఉంటారు. పల్లెల్లో ప్రజలు వినోదార్ధం వీధి నాటకాలు వేసే వారు. ముఖ్యంగా భారతంలో ప్రధాన ఘట్టాలను ఆడే వారు. వేష ధారణతో, పాటలతో, హావ భావాలతో సాగే ఇటువంటి వీధి నాటకాలు ప్రజలనెంతో అలరించేవి. [[నాటకం|నాటక]] ప్రక్రియల్లో వీధి నాటకం ఒకటి.
[[దస్త్రం:Harikatha kaariNi.JPG|thumb|right|దామల చెరువు గ్రామమంలో మహాభారత నాటకాల సందర్భంగా హరికథ చెప్పే హరికథ కళాకారిణి]]
[[దస్త్రం:Bharatam lo.JPG|thumb|right|మహాభారత నాటకాల సందర్భంగా పగటి పూట జరిగే ధుర్యోధన వధ నాటకాని తీర్చి దిద్దిన ధుర్యోధన మట్టి విగ్రహం. దామల చెరువు గ్రామంలో తీసిన చిత్రము]]
[[దస్త్రం:Top of penance tree.JPG|thumb|right|మహాభారత నాటకాల సందర్భంలో పగటి పూట జరిగే అర్జునుడు తపస్సు మాను ఎక్కుట అనేఘట్టాన్ని ప్రదర్శిసున్న కళాకారులు. మొగరాల గ్రామంలో తీసిన చిత్రము]]
[[దస్త్రం:Bhima and duryodana.JPG|thumb|right|మహాభారత నాటకాల సందర్భంలో ధుర్యోధనుని వద ఘట్టం ప్రారంబానికి ముందుకు వస్తున్న భీమ, ధుర్యోధనుల వేష ధారులు. దామల చెరువులో తీసిన చిత్రం]]
 
గతంలో...... పల్లెల్లో ప్రజలు వినోదార్ధం వీధి నాటకాలు వేసే వారు. ముఖ్యంగా భారతంలో ప్రధాన ఘట్టాలను ఆడే వారు. వేష ధారణతో, పాటలతో, హావ భావాలతో సాగే ఇటువంటి వీధి నాటకాలు ప్రజలనెంతో అలరించేవి. [[నాటకం|నాటక]] ప్రక్రియల్లో వీధి నాటకం ఒకటి.
 
==పల్లెవాసులే నటులు==
నాటకం లోని స్త్రీ పాతలను కూడా మగ వారె వేసే వారు. పల్లెల్లోని కొంత మంది ఔత్సాహికులు కలిసి ఒక గురువును తీసుకొని వచ్చి అతని ద్వారా నాటకాన్ని నేర్చుకునేవారు. సుమారు ఒక నెల పాటు నేర్చుకునే వారు. దీన్ని [[ఒద్దిక]] (రెహార్సిల్) అనేవారు. ముఖానికి రంగులు లేకుండా, వేషం కట్టకుండా పాటలను, పద్యాలను బట్టీ పట్టేవారు. ఇది సాధారణంగా ఆవూరి గుడిలోనో, భజన మందిరంలోనో జరిగేది. దానిని చూడడానికి కూడా ఆవూరి ప్రజలు వచ్చేవారు. పూర్తిగా నేర్చుకున్న తర్వాత అసలు నాటకాన్ని మొఖానికి రంగులు వేసుకొని, వేషాలు కట్టి ఒక వేదికమీద ఆడేవారు. దాన్ని చూడడానికి చుట్టు ప్రక్కల పల్లెల నుండి ఎక్కువగా జనం వచ్చేవారు. వారి వేషధారణకు కావలసిన ఆభరణాలు, ఆయుధాలు, బట్టలు, తెరలు వంటి వస్తువులను అద్దెకిచ్చె కొన్ని అంగళ్ళూ చిన్న పట్టణాలలో ఉండేవి.రాను రాను పల్లెవాసులు ముఖాలకు రంగులేసుకునే కాలం పోయింది. ఆ నాటకాలలో పద్యాలు పాడడానికే ఎక్కువ ప్రాముక్యత వుండేది. ఒక పద్యానికి సుమారు పది నిముషాలు సమయం రాగం తీసేవారు. దాన్ని ప్రజలు కూడా మెచ్చుకునేవారు. ఇలాంటి నాటకాలు రాత్రులలో సుమారు పది గంటలకు మొదలై తెల్లవారు జామున నాలుగు గంటల ప్రాంతంలో ముగిసేయి. అంత సేపూ ప్రజలు ఓపిగ్గా కూర్చుని చూసేవారు.
==నాటకం తీరు==
ఒక వేషధారి వేదికమీదికి రాగానే.... తన పాత్ర పేరు చెప్పుకుంటూ పాట పాడుతూ ఆ వేదికపై గుండ్రంగా తిరుగు తాడు. ఉదాహరణకు దుర్యోధనుని పాత్ర ధారి వేదికమీదికి తన సహోధరులతో వేదిక మీదికి రాగానే '' రాజు వెడలె రవి తేజములలరగ.... కుడి ఎడమల్ డాల్ కత్తులు మెరయగ..... అని పాడుతూ వస్తాడు. దాంతో ఆ వచ్చినది దుర్యోధనుడని ప్రేక్షకులకు తెలుస్తుంది. ఆ తర్వాత అతను ''ధుర్వోధన.....'' అంటూ చేతులు వూపుతూ తిరుగుతుంటే వెంట నున్న సోదరులు..'' రాజే... రాజే.... రాజే... '' అంటూ సుమారు పది నిముషాలు తిరుగుతారు. ఆతర్వాత దుర్వోధనుడు సింహాసనం పై ఆసీనుడై.. పాట రూపంలో..... ''సుఖమా మన రాజ్యామెల్లను జయమా.. '' అంటూ రాగాలు తీస్తూ పాడితే... దానికి వంతగా మిగతావారు సామూహికంగా వంత పాడతారు. ఈ వంత పాటలను వేదిక మీద వున్న వేష ధారులే కాక.... తెర వెనుక వున్న ఇతర వేష ధారులు కూడ కలిసి పాడుతారు. అసలు కథకన్నా ఇటువంటి వాటికే ఎక్కువ సమయం అయి పోతుంది. భీముడు- దుర్వోధను వాగ్వివాదము జరిగే సందర్భంలో..... వారి సంభాషణ చాల మొరటుగాను, అపహాస్యంగాను, వ్వక్తిగత నిందారోపణలు చేసుకున్నట్టు వుంటుంది. భాష కూడ అదే తీరులో వుంటుండి. పల్లెల్లో నిజంగా ఏదైన కొట్లాట జరిగితే ఆసందర్భంలో జరిగే మాటల లాంటివె... ఆ భాషనే సమయా సందర్భంగా వాడుతారు. కాని ప్రేక్షకులు దానిని కూడ స్వాగతిస్తారు. ఈ మధ్యలో ఏదేని మంచి పద్యం పొడుగ్గా రాగం తీస్తే.... దాన్ని మళ్ళీ పాడమని ''ఒన్ సు మోర్ '' అని అరుస్తారు. విధిగా ఆ పద్యాన్ని తిరిగి వారు పాడేవారు. సందర్బాను సారంగా మధ్య మధ్యలో ఒక మోస్తరు భూతు మాటలు కూడ పేలేవి. దానికి ప్రేక్షకులు కరతాళ ద్వనులతో ఈలలతో స్వాగతించేవారు. యుద్ధ సమయంలో ఎవరు ఎక్కువగా గంతులేస్తే వారు అంత బాగా నటించినట్లు లెక్క. ఆలా ఆవేశంతో రాత్రంతా గంతులేసి వళ్ళు హూనం చేసుకునేవారు నటులు. ఆవిధంగా ఆనాటి వీధి నాటకాలు సాగేవి...... పల్లెవాసులు కూడ బాగా ఆదరించేవారు.[[దస్త్రం:Bhima and duryodana.JPG|thumb|right|మహాభారత నాటకాల సందర్భంలో ధుర్యోధనుని వద ఘట్టం ప్రారంబానికి ముందుకు వస్తున్న భీమ, ధుర్యోధనుల వేష ధారులు. దామల చెరువులో తీసిన చిత్రం|174x174px]]
 
==వృత్తిరీత్యా నాటకాలాడేవారు==
"https://te.wikipedia.org/wiki/వీధి_నాటకం" నుండి వెలికితీశారు