లాంకషైర్ బాయిలరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
బాయిలరు నీటిని స్టీము/నీటి ఆవిరిగా మార్చు లోహనిర్మాణం.బాయిలర్లలో అధిక వత్తిడితో నీటి ఆవిరిని ఉత్పత్తి చేస్తారు.ఈ నీటి ఆవిరి లేదా స్టీము వలన పలు ప్రయోజనాలు కలవు. రసాయనిక,వస్త్ర మరియు [[నూనె]] తయారీ, ఔషధ తయారీ వంటి పలు పరిశ్రమల్లో బాయిలర్లను ఉపయోగిస్తారు.అలాగే థర్మల్ పవరు ప్లాంట్లలో అధిక వత్తిడి కల్గిన స్టీమును ఉపయోగించి విద్యుత్తు జనరేటర్లను తిప్పుతారు.
==బాయిలరు నిర్మాణ అకృతి==
లాంకషైరు బాయిలర్లు చూచుటకు షెల్ మరియు ట్యూబు హీట్ఎ క్చెంజరు వలే ఉండును.బాయిలరు షెల్ వెలుపలి నిర్మాణం చూచుటకు పొడవైన డ్రమ్ములా వుండును.పొడవు 9 నుండి 10 మీటర్ల వరకు వుండి, డ్రమ్ము [[వ్యాసం]] 4 నుండి 6 మీటర్లు వుండును. షెల్‌లో రెండు ఫైరు ట్యూబులు వుండును. ఈ ఫైరు ట్యూబుల వ్యాసం షెల్ వ్యాసంలో 40% వరకు ఉండును. షెల్ రిఫ్రాక్టరి ఇటుకలతో నిర్మించిన కట్టడం మీద అమర్చబడి వుండును. బాయిలరు డ్రమ్ము మరియు ఇటుకలనిర్మాణం మధ్య మూడు ఖాళి మార్గాలు వుండును.ఈ ఖాళి ద్వారా ఇంధన దహనం వలన వెలువడిన వేడివాయువులు పయనించును. మొదట ఫైరు ట్యూబులలో ఏర్పడిన వేడి వాయువులు, ఫైరు ట్యూబులచివర నుండి బాయిలరు షెల్ కింది బాగపు బయటి ఉపరితలం వెంబడి,ముందు వరకు వచ్చి,అక్కడి నుండి డ్రమ్ము/స్తుపాకారడ్రమ్ముఇరువైపులా డ్రమ్ము బయటి ఉపరితలాన్ని తాకుతూ స్మోకు బాక్సువరకు వెళ్ళి అక్కడి నుండి పొగగొట్టంకు వెళ్ళును.డ్రమ్ములో నీటిమట్టం బాయిలరు వేడి వాయువులు షెల్ పక్కల గుండా పయనించుమట్టం కన్న ఎక్కువ మట్టంలో వుండును.డ్రమ్ములో సగంకు పైగా నీరు వుండును. అందువలన ఫైరు ట్యూబులు పూర్తిగా నీటి మట్టంలో మునిగి వుండును. ఫైరు ట్యూబులలో ముందుభాగాన కొంత ఎత్తు వరకు రెండు ఇటుక గోడలు వుండి వాటి మీద గ్రేట్ పలకలు అమర్చబడి వుండును. గ్రేట్ పలకల మీద ఇంధనాన్ని/[[బొగ్గు]]ను పేర్చి కాల్చేదరు.గ్రేట్ కున్న రంధ్రాల ద్వారా బూడిద గ్రేట్ దిగువు న వున్న ప్రదేశంలోజమఅగును.
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
[[వర్గం:బాయిలర్లు]]
"https://te.wikipedia.org/wiki/లాంకషైర్_బాయిలరు" నుండి వెలికితీశారు