లాంకషైర్ బాయిలరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
లాంకషైరు బాయిలర్లు చూచుటకు షెల్ మరియు ట్యూబు హీట్ఎ క్చెంజరు వలే ఉండును.బాయిలరు షెల్ వెలుపలి నిర్మాణం చూచుటకు పొడవైన డ్రమ్ములా వుండును.పొడవు 9 నుండి 10 మీటర్ల వరకు వుండి, డ్రమ్ము [[వ్యాసం]] 4 నుండి 6 మీటర్లు వుండును. షెల్‌లో రెండు ఫైరు ట్యూబులు వుండును. ఈ ఫైరు ట్యూబుల వ్యాసం షెల్ వ్యాసంలో 40% వరకు ఉండును. షెల్ రిఫ్రాక్టరి ఇటుకలతో నిర్మించిన కట్టడం మీద అమర్చబడి వుండును. బాయిలరు డ్రమ్ము మరియు ఇటుకలనిర్మాణం మధ్య మూడు ఖాళి మార్గాలు వుండును.ఈ ఖాళి ద్వారా ఇంధన దహనం వలన వెలువడిన వేడివాయువులు పయనించును. మొదట ఫైరు ట్యూబులలో ఏర్పడిన వేడి వాయువులు, ఫైరు ట్యూబులచివర నుండి బాయిలరు షెల్ కింది బాగపు బయటి ఉపరితలం వెంబడి, ముందు వరకు వచ్చి, అక్కడి నుండి డ్రమ్ము/స్తుపాకారడ్రమ్ముఇరువైపులా డ్రమ్ము బయటి ఉపరితలాన్ని తాకుతూ స్మోకు బాక్సువరకు వెళ్ళి అక్కడి నుండి పొగగొట్టంకు వెళ్ళును.డ్రమ్ములో నీటిమట్టం బాయిలరు వేడి వాయువులు షెల్ పక్కల గుండా పయనించుమట్టం కన్న ఎక్కువ మట్టంలో వుండును. డ్రమ్ములో సగంకు పైగా నీరు వుండును. అందువలన ఫైరు ట్యూబులు పూర్తిగా నీటి మట్టంలో మునిగి వుండును. ఫైరు ట్యూబులలో ముందు భాగాన కొంతఎత్తు వరకుగ్రేట్వుండును వాటి మీద గ్రేట్ పలకలు అమర్చబడి వుండును.గ్రేట్ వెనుక భాగాన గ్రెట్ ఎత్తుకు రిఫ్రాక్తరి గోడ వుండును.అందువలన ఫ్లూ వాయువుల వేగానికి బూడిద ముందుకు తోసుకు వెల్లకుండా ,ఫైరు ట్యూబు కింది అర్థ భాగంలో జమ అగును. గ్రేట్ పలకల మీద ఇంధనాన్ని/[[బొగ్గు]]ను పేర్చి కాల్చేదరు.గ్రేట్ కున్నరంధ్రాల ద్వారా బూడిద గ్రేట్ దిగువున వున్న ప్రదేశంలోజమఅగును.జమ అయ్యిన బూడిదను మాన్యువల్‌గా తొలగిస్తారు. కొన్ని బాయిలర్లలో ఫ్లూగ్యాసెస్ చిమ్నీకివెళ్ళుటకు ముందు ఎకనమైజరు ద్వారా పయనించును. బాయిలరుకు వెళ్ళు నీటిని ఈ ఎకనమైజరు ద్వారా పంపడం వలన నీరు వేడెక్కును.ఫ్లూ గ్యాసుద్వారా నష్ట పొయ్యే ఉష్ణాన్ని కొంత మేరకు తగ్గించ వచ్చును.
 
==పని చేసె/నదుపునడుపు/ నిర్వహించు విధానం==
ముందుగా బాయిలరులో ఫైరు ట్యూబులు మునిగి వుండేలా నీటిని నింపెదరు.ఎకనమైజరు వున్న బాయిలరు అయినచో ఎకనమైజరు ద్వారా నీటిని నింపెదరు.గ్రేట్ మీద బొగ్గును (లంకషైరు బాయిలర్లలో సాధారణంగా బొగ్గునే ఇంధనంగా ఉపయోగిస్తారు)కావలసినంత చేర్చి మండించెదరు.బొగ్గు మండుటకు అవసరమైన గాలి,గ్రేట్ కిందనున్న రంధ్రాల ద్వారా మరియు ఫైరు ట్యూబు డోరు/తలుపుకున్నరంధ్రాలద్వారా అందును. బొగ్గు దహనం వలన ఏర్పడిన వేడి వాయువులు([[కార్బన్ డయాక్సైడ్]],[[కార్బన్ మొనాక్సైడు]],[[నైట్రోజన్]] తదితరాలు)మొదట ఫైరు ట్యూ బుల ఒకచివర నుండి రెండోచివరకు చేరును,అక్కడ షెల్ కింద వున్న ఇటుక గూడు నిర్మాణం ద్వారా మొదట షెల్ కింది భాగాన్ని తాకుతూ ముందు వరకు పయనించును,అక్కడి నుండి షెల్ పక్క భాగాలను కప్పుతూ వున్న ఇటుక నిర్మాణంద్వారా షెల్ బయటి ఉపరి తలాన్ని వేడి చేస్తూ స్మోక్ ఛాంబరు చేరును.అక్కడి నుండి ఎకనమైజరు ఉన్నచో దాని ద్వారా పయనించి ఒక గొట్టం ద్వారా చిమ్నీ/పొగ గొట్టానికి వెళ్ళును.ఫ్లూ గ్యాసెస్ ఫైర్‌ట్యుబు /ఫ్లూ ట్యూబులో పయనించు సమయంలోనే దాదాపు 75-85% వేడిని నీరు గ్రహించి స్టీము తయారవ్వడం మొదలగును.షెల్ కింద మరియు పక్కల గుండా పయనీంచునపుడు ఫ్లూ గ్యాసెస్ ఉష్ణొగ్రతను గ్రహించి,ఫైర్ ట్యూబులకింద,పక్కన వున్న నీౠ వేడెక్కును.
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/లాంకషైర్_బాయిలరు" నుండి వెలికితీశారు