గయ: కూర్పుల మధ్య తేడాలు

→‎గయలో పవిత్ర క్షేత్రాలు: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 42:
బౌద్ధ మరియు హిందూ మతాలకు గయ ఒక పవిత్రనగరం. పవిత్ర ఫలగూ నదీతీరము స్నాన ఘట్టాలు మరియు ఆలయాలు బారులుతీరి ఉంటాయి. రావిచెట్లు, అక్షయవట్, మర్రిచెట్టు మొదలైన పవిత్ర వృక్షాలుకూడా ఉన్నాయి. పవిత్రమైన మంగళగౌరి ఆలయం సతీదేవి ఛాతీ భాగం పడిన ప్రదేశమని విశ్వసించబడుతుంది. ప్రస్తుతం ఫలగూ నదీతీరంలో చాలా ప్రసిద్ధిచెందిన విష్ణుపద్ ఆలయం ఉంది. అక్కడ విష్ణుపాద ముద్రలు ఉంటాయి. గయాసురుని చాతి మీద భగవానుడైన మహావిష్ణువు పాదము ఉంచిన ప్రదేశం ఇదే. విష్ణుపద్ ఆలయంలో భూమిహార్ బ్రాహ్మణులు వంశపారంపర్యంగా పూజలు చేస్తుంటారు. పక్కన జిల్లా అయిన హజారీభాగ్ నుండి వచ్చే గయావాల్ పాండాలు ఇక్కడ పూజాదికాలకు యాత్రీకులకు సహకరిస్తుంటారు. 18వ శతాబ్దిలో దేవి అహల్యాభాయ్ హోల్‌కర్ ప్రస్తుత ఆలయం నిర్మించింది. విష్ణుపద్ ఆలయంలోని పాదముద్రలను బౌద్ధసంప్రదాయం కూడా గౌరవిస్తుంది. భగవాన్ విష్ణుమూర్తి దశావతారాలలో బుద్ధుడు ఒకడని విశ్వసించబడుతుంది.
 
గయ హిందువులకు పితరులకు మోక్షప్రదాయకమైన నగరంగా విశ్వదించబడుతుంది. ఇక్కడ పితరులకు పిండప్రదానం చేస్తే పితరులకు మోక్షం లభిస్తుందని హిందువుల విశ్వాసం. శ్రీరాముడు తనదేవేరి సీత మరియు సోదరుడైన లక్ష్మణునితో ఇక్కడకు వచ్చి పితరులకు పిండప్రదానం చేసినట్లు పురాణకథనాలు వర్ణిస్తున్నాయి. పిండప్రదానానికి ముందు స్నానమాచరించడానికి శ్రీ రాముడు వెళ్ళిన సమయంలో మహారాజైన దశరథుని హస్తాలు రెండు సీతముందు కనిపించి తాను చాలా ఆకలిగా ఉన్నానని రామునికి బదులుగా పిండం ప్రదానం చెయ్యమని సీతను అడుగగా సీతాదేవి పిండములు తీసి ఆచేతులలో ఉంచింది. శ్రీరాముడు తిరిగి వచ్చి యధావిధిగా పిండములు ప్రదానము చేసే సమయములో అతని తండ్రి ఆ పిండాలను స్వీకరించక పోయినప్పుడు శ్రీరాముడు ఆశ్చర్యానికి గురికావడమే కాక బాధపడ్డాడు. తరువాత సీతాదేవి జరిగిన ఉదంతం వివరించి సాక్ష్యానికి ఫలగు నది సమీపంలో నిలిచియున్న బ్రాహ్మణుని, ఆవుని మరియు రావిచెట్టుని పిలిచింది. రావిచెట్టు తప్ప మిగిలిన వారు సాక్ష్యం చెప్పలేదు. ఆవు శ్రీ రామునికి భయపడి, ఫల్గూ నది శ్రీరాముని నుండి అధిక వరాలు పొందడానికి, బ్రాహ్మణుడు శ్రీరాముని నుండి అధిక దక్షిణ పొందాలని నిజం చెప్పలేదు. సీతాదేవి ఆముగ్గిరిని శపించిందని పురాణకథనం వివరిస్తుంది. శాపకారణంగా ఫల్గూనదిలో నీరు ఇంకి పోయింది. రావిచెట్టును శాశ్వతంగా జీవించమని వరమిచ్చింది. ఈ రావిచెట్టు ఆకులు ఎప్పుడూ రాలవని ఎప్పుడూ పచ్చగానే ఉంటాయని ఇక్కడివారు చెప్తున్నారు. అక్షయ వృక్షం అంటే ఎప్పటికీ క్షయం పొదని వృక్షం అని అర్ధం. కరువు సమయంలో కూడా ఈ వృక్షం పచ్చగా ఉటుందిఉంటుంది.
 
బౌద్ధులకు ఒక ప్రాముఖ్యమైన యాత్రాక్షేత్రం. ఈ బ్రహ్మయోని కొండల మీద బుద్ధుడు ఆదిత్య పర్యాయ సూత్రాలను బోధించాడని చెప్పబడుతుంది. ఈ సూత్రాలను విన్న వేలాది అగ్నిఆరాధకులు. జ్ఞానసిద్ధి పొందారని అందువలన ఈ కొండని గయాసిసా అని పిలిచేవారని చెప్పబడుతుంది.
"https://te.wikipedia.org/wiki/గయ" నుండి వెలికితీశారు