పట్నం సుబ్రమణ్య అయ్యరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పట్నం సుబ్రమణ్య అయ్యరు''' (జననం 1845, మరణం జూలై 31 1902) [[కర్ణాటక సంగీతము|దక్షిణ భారత శాస్త్రీయ సంగీత]] వాగ్గేయకారుడు. ఈయన [[త్యాగరాజు|త్యాగరాజ స్వామి]] సాంప్రదాయాన్ని అనుసరించారు. దాదాపు ఒక వంద దాకా కీర్తనలను వ్రాసారు<ref>{{cite book|last1=కోవెల|first1=శాంత|title=సంగీత సిద్ధాంత సోపానములు|pages=47-50|url=http://www.freegurukul.org/view-book/1484/SangeetaSiddantaSopanalu-1/20#home|accessdate=10 December 2017}}</ref>.
==జననం - బాల్యం ==
సుబ్రమణ్య అయ్యరు [[తమిళనాడు]]కు చెందిన [[తంజావూరు]] జిల్లా [[తిరువయ్యారు]]లో పుట్టారు. వీరి కుటుంబానికి గొప్ప సంగీత నేపథ్యం ఉంది. వీరి తండ్రి భారతం వైద్యనాథ అయ్యరు [[సంగీతం]]-శాస్త్రమూ రెండిటిలో ఉద్దండులు. వీరి పితామహులు పంచానంద శాస్త్రి తంజావూరు సెర్ఫోజీ మహారాజా ఆస్థానంలో ఆస్థాన సంగీతకారుడు. సుబ్రమణ్య అయ్యరు సంగీతాన్ని మొదటి వారి మామయ్య మేలత్తూర్ గణపతి శాస్త్రి వద్ద తదుపరి మనంబుచవాది వేంకటసుబ్బయ్యర్ వద్ద నేర్చుకున్నారు.