లాంకషైర్ బాయిలరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
లాంకషైరు బాయిలర్లు చూచుటకు షెల్ మరియు ట్యూబు హీట్ఎ క్చెంజరు వలే ఉండును.బాయిలరు షెల్ వెలుపలి నిర్మాణం చూచుటకు పొడవైన డ్రమ్ములా వుండును.పొడవు 9 నుండి 10 మీటర్ల వరకు వుండి, డ్రమ్ము [[వ్యాసం]] 4 నుండి 6 మీటర్లు వుండును. షెల్‌లో రెండు ఫైరు ట్యూబులు వుండును. ఈ ఫైరు ట్యూబుల వ్యాసం షెల్ వ్యాసంలో 40% వరకు ఉండును. షెల్ రిఫ్రాక్టరి ఇటుకలతో నిర్మించిన కట్టడం మీద అమర్చబడి వుండును. బాయిలరు డ్రమ్ము మరియు ఇటుకలనిర్మాణం మధ్య మూడు ఖాళి మార్గాలు వుండును.ఈ ఖాళి ద్వారా ఇంధన దహనం వలన వెలువడిన వేడివాయువులు పయనించును. మొదట ఫైరు ట్యూబులలో ఏర్పడిన వేడి వాయువులు, ఫైరు ట్యూబులచివర నుండి బాయిలరు షెల్ కింది బాగపు బయటి ఉపరితలం వెంబడి, ముందు వరకు వచ్చి, అక్కడి నుండి డ్రమ్ము/స్తుపాకారడ్రమ్ముఇరువైపులా డ్రమ్ము బయటి ఉపరితలాన్ని తాకుతూ స్మోకు బాక్సువరకు వెళ్ళి అక్కడి నుండి పొగగొట్టంకు వెళ్ళును.డ్రమ్ములో నీటిమట్టం బాయిలరు వేడి వాయువులు షెల్ పక్కల గుండా పయనించుమట్టం కన్న ఎక్కువ మట్టంలో వుండును. డ్రమ్ములో సగంకు పైగా నీరు వుండును. అందువలన ఫైరు ట్యూబులు పూర్తిగా నీటి మట్టంలో మునిగి వుండును. ఫైరు ట్యూబులలో ముందు భాగాన కొంతఎత్తు వరకుగ్రేట్వుండును వాటి మీద గ్రేట్ పలకలు అమర్చబడి వుండును.గ్రేట్ వెనుక భాగాన గ్రెట్ ఎత్తుకు రిఫ్రాక్తరి గోడ వుండును.అందువలన ఫ్లూ వాయువుల వేగానికి బూడిద ముందుకు తోసుకు వెల్లకుండా ,ఫైరు ట్యూబు కింది అర్థ భాగంలో జమ అగును. గ్రేట్ పలకల మీద ఇంధనాన్ని/[[బొగ్గు]]ను పేర్చి కాల్చేదరు.గ్రేట్ కున్నరంధ్రాల ద్వారా బూడిద గ్రేట్ దిగువున వున్న ప్రదేశంలోజమఅగును.జమ అయ్యిన బూడిదను మాన్యువల్‌గా తొలగిస్తారు. కొన్ని బాయిలర్లలో ఫ్లూగ్యాసెస్ చిమ్నీకివెళ్ళుటకు ముందు ఎకనమైజరు ద్వారా పయనించును. బాయిలరుకు వెళ్ళు నీటిని ఈ ఎకనమైజరు ద్వారా పంపడం వలన నీరు వేడెక్కును.ఫ్లూ గ్యాసుద్వారా నష్ట పొయ్యే ఉష్ణాన్ని కొంత మేరకు తగ్గించ వచ్చును<ref>{{citeweb|url=https://web.archive.org/web/20160320191035/http://www.mech4study.com/2016/03/lancashire-boiler.html|title=Lancashire Boiler|publisher=mech4study.com|accessdate=10-12-17}}</ref>.
 
==బాయిలరు అంతర్భాగాలు==<ref>{{citeweb|url=https://web.archive.org/web/20170708155257/http://mechanicalbuzz.com/lancashire-boiler-working-diagram.html| title=Lancashire Boiler Construction,working,Diagram|publisher=mechanicalbuzz.com|accessdate=10-12-2017}}</ref>
==బాయిలరు అంతర్భాగాలు==
*1.సిలిండరికల్ షెల్/క్షితిజసమాంతర స్తూపాకార షెల్
*2.ఫర్నేష్ ట్యూబులు,
"https://te.wikipedia.org/wiki/లాంకషైర్_బాయిలరు" నుండి వెలికితీశారు