జి.ఎస్.ఖాపర్దే: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగస్టు 27,1854 → 1854 ఆగస్టు 27, 27 ఆగష్టు 1854 → 1854 ఆగష్టు 27 (2), ఆగష్టు using AWB
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 8:
బాబాకు ఖాపర్దే జన్మజన్మల నుంచీ తెలుసు. ఈ విషయం బాబా చెప్పారు. ఒక జన్మలో బాబాతో కలిసి వారి గురువుగారి దగ్గర ఖాపర్దే కూడా ఉండేవాడని ఆయన చెప్పారు. ఎన్నో జన్మల నుండే అతడికి తానూ గొప్పపేరు సంపాదించు కోవాలని, బాగా ధనవంతుడినవ్వాలని, పెద్ద పెద్ద పదవులలో ఉద్యోగం చేయాలనీ కోరిక ఉండేదిట! కీర్తి మీద, దానం మీద అతనికున్న వ్యామోహాన్ని చిన్న చిన్నగా జన్మ జన్మలకూ తగ్గిస్తూ వచ్చి ఈ జన్మలో దేశసేవగా చేసేలా తయారుచేశారు బాబా. ఈ జన్మలో అతడు సాధ్యమైనంత దేశసేవ చేసిన తరువాత అతనిని తెల్లవారు జైలుకు పంపకుండా కాపాడడమే కాకుండా అతనిలోని చెడ్డగుణాలను తగ్గించి, మంచి గుణాలను పెంచి, మంచి మార్గంలో ధర్మంగా నడిచేలా చేయడమే బాబా ఉద్దేశం. అంతేకాదు, ఖాపర్దే ద్వారా బాలగంగాధర్ తిలక్ ను కూడా భవిష్యత్తులో తన దగ్గరకు రప్పించు కోవాలనుకున్నారు బాబా.
 
ఖాపర్దే డిసెంబర్ 5, 1910 న శిరిడీ చేరాడు. అక్కడ సాయి దర్శనానికి పేదవారు, ధనికులు, స్త్రీలు, పురుషులు, ఉన్నత ఉద్యోగస్ధులు, పండితులు - అందరూ రావడము, వారి సమస్యలను బాబా తొలగించడమూ గమనించాడు. మొదటిసారి ఒక్కవారం రోజులు మాత్రమే బాబా సన్నిధిలో శిరిడీలో ఉన్నాడు ఖాపర్దే. ఆ తర్వాత సాయి అనుమతితో తన ఊరికి వెళ్ళిపోయాడు. కానీ అక్కడ అతని పరిస్ధితి ఇంకా ప్రమాదకరంగా తయారైంది. అతనిని తెల్ల ప్రభుత్వం జైలుకు పంపి అటు తర్వాత ఏ అండమాన్ దీవులకో పంపివేయవచ్చని ఖాపర్దేకు అర్ధమైంది. న్యాయవాద వృత్తిలో అతనికి రాబడి తగ్గింది. భయము, దిగులు, అనారోగ్యము తట్టుకోలేక ఒక సంవత్సరం తర్వాత [[డిసెంబరు 6]], [[911]]1911న న [[శిరిడీ]] చేరాడు. ఎందుకంటే బాబా అతడు మొదటిసారి తానను దర్శించినప్పుడే అతనితో, "ఇది నీ ఇల్లే ! నేనిక్కడ ఉండగా ఎవరికైనా భయమెందుకు?" అన్నారు. ఈసారి కూడా అతడు రాగానే తిరిగి అదే మాట అన్నారు బాబా.
 
==బాబా అభయం==
బాబా అభయమివ్వడం వల్ల అతనికి బాబా సన్నిధిలో తానున్నంతవరకు తనకు ఎటువంటి ప్రమాదమూ జరుగదన్న ధైర్యం వచ్చింది. బాబాకు ఏ క్షణంలో ఎక్కడేమి జరుగుతున్నదీ తెలుస్తూ ఉంటుందనీ, అందరి మనస్సులలోని భావాలూ ఆయనకు తేలుస్తాయనీ అర్ధమైంది. అయినా అతనికి త్వరగా తన ఊరైన అమ్రావతి వెళ్లి న్యాయవాదిగా వృత్తి కొనసాగిస్తూ జీవించాలని అనిపించేది. కానీ బాబా అతనిని పంపేవారు కాదు. తన మంచి కోసమే బాబా తనను అమ్రావతి పంపటం లేదని అతనికి తెలుసు. గనుక తనకెంతగా తిరిగి వెళ్ళాలనిపించినా సమాధానపడేవాడు. అలా బాబా ఖాపర్దేకు తనపై విశ్వాసం కోల్పోకుండా ఉండడమెలాగో నేర్పించారన్నమాట. శిరిడీలో తలదాచుకున్న ఖాపర్దేను పట్టుకోవడం తెల్ల ప్రభుత్వానికి పెద్ద కష్టమేమీ కాదు. కేవలం బాబాయే వారికలా బుద్ధి పుట్టకుండా వారి మనస్సులను మార్చారు. ఆ విషయం ఆయన చెప్పారు కూడా. ఈ విధంగా ఖాపర్దేను రక్షించారు.
"https://te.wikipedia.org/wiki/జి.ఎస్.ఖాపర్దే" నుండి వెలికితీశారు