హేమా హేమీలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
}}
==సంక్షిప్త చిత్రకథ==
ఒక జమీందారు దగ్గర కోట్ల విలువ చేసే వజ్రాల కిరీటం ఉంటుంది. జమీందారు బావమరిది దానికోసం ప్రయత్నించి జమీందారు కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేస్తాడు. జమీందారు పెద్ద కొడుకు రఘుబాబు, జమీందారు భార్య, జమీందారు కూతురు విజయ, దివాన్ శివరామయ్య ఒక చోట చేరుకుంటారు. జమీందారు చిన్నకొడుకు రామచంద్రబాబు ఒక పల్లెలో పెరుగుతాడు. దివాన్ కొడుకు రాజా ఒక బ్యాంక్ ఉద్యోగి ఆలనాపాలనలో పెరిగి పెద్దవాడవుతాడు. దివాన్ భార్య, కూతురు సీత ఒక పల్లె చేరుకుంటారు. రఘుబాబు పెరిగి పెద్దవాడయి తమ కుటుంబానికి అన్యాయం చేసినవారిపై పగ తీర్చుకోవడానికి రెడ్ లయన్ అనే మారుపేరుతో ఒక ముఠా ఏర్పాటు చేసుకుంటాడు. నల్లపిల్లి పేరుగల ఒక బందిపోటు ముఠా నాయకుడు త్రిలింగా బ్యాంకుపై దాడి చెసి, మేనేజర్‌ను హతమార్చి, జమీందారుకు చెందిన వజ్రకిరీటాన్ని అపహరిస్తాడు. రాజా తనపెంపుడు తండ్రిని హతమార్చినవారిపై పగతీర్చుకోవడానికి నైట్ కింగ్‌గా అవతరించి అడుగడుగునా రెడ్ లయన్‌కు, నల్లపిల్లికి అడ్డుతగులుతుంటాడు. ఒక సారి రాజా రెడ్ లయన్‌ను కలుసుకోయినప్పుడు నల్లపిల్లి జరిపిన కాల్పులవల్ల రఘుబాబు మరణిస్తాడు. దివాన్ శివరామయ్య రఘుబాబు మృతదేహాన్ని భద్రపరుస్తాడు. ఒక పల్లెలో ఆయనకు రామచంద్రబాబు కనిపిస్తాడు. అతడెవరో తెలియని దివాన్ శివరామయ్య అతడిని తీసుకువెళ్ళి ఇంట్లో రఘుబాబు స్థానంలో ప్రవేశపెడతాడు<ref>{{cite news|last1=వి.ఆర్.|title=చిత్రసమీక్ష - హేమాహేమీలు|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=14211|accessdate=13 December 2017|work=ఆంధ్రపత్రిక దినపత్రిక|issue=సంపుటి 65, సంచిక 351|date=30 March 1979}}</ref>.
 
==తారాగణం==
"https://te.wikipedia.org/wiki/హేమా_హేమీలు" నుండి వెలికితీశారు