ఉగ్ర శ్రీనివాసుడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రతిష్ట → ప్రతిష్ఠ using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
 
'''[[ఉగ్ర శ్రీనివాసుడు]]''' స్వామి వారి ఆగ్రహదశను సూచిస్తుంది. మూలబేరం తరువాత ప్రాచీనకాలానికి చెందిన తొలి విగ్రహం ఇదియే అయి ఉంటుంది. ఈ విగ్రహాన్నే స్నపన బేరం అని కూడా అంటారు. ఈ విగ్రహం దాదాపు 18 అంగుళాల ఎత్తు కలిగి రమారమి 7 అంగుళాల ఎత్తు పీఠం మీద నిలువబడి ఉంటుంది. [[ధృవబేరము|ధృవబేర]], కౌతుకబేర, బలిబేరాలకు భిన్నంగా ఈ విగ్రహం నిలుచుని ఉన్న భంగిమలో శ్రీదేవి, భూదేవుల ప్రతిమలతో కలసి ఉంటుంది.
 
[[తమిళం|తమిళ]] పర్యాయపదమైన 'వెంకట తురైవార్' అన్న పేరును బట్టి [[భోగ శ్రీనివాసుడు]] ప్రతిష్ఠ జరగడానికి పూర్వం ఉత్సవ విగ్రహంగా ఉండేదని తెలుస్తుంది. 14వ శతాబ్దానికి ముందు ఉత్సవ విగ్రహంగా ఉపయోగించేవారు. ఒకసారి ఈ విగ్రహం ఊరేగింపుగా వెళ్ళినప్పుడు [[అగ్ని ప్రమాదాలు|అగ్నిప్రమాదం]] జరగడం వల్ల అప్పట్నుంచీ ఈ విగ్రహంపై సూర్యకిరణాలు పడనివ్వరు. ఏడాదికి ఒక్కసారి సూర్యోదయానికి ముందే ఉగ్ర శ్రీనివాసుని అన్ని అలంకారాలతో ఊరేగింపుగా తీసుకువెళ్ళి, గర్భగుడిలోకి[[గర్భగుడి]]<nowiki/>లోకి తీసుకెళ్ళిపోతారు.<ref>{{cite book|last1=పి.వి.ఆర్.కె|first1=ప్రసాద్|author1=పి.వి.ఆర్.కె.ప్రసాద్|authorlink1=పి.వి.ఆర్.కె.ప్రసాద్|title=సర్వసంభవామ్|publisher=ఎమెస్కో|page=62|edition=10|accessdate=17 November 2015|ref=సర్వసంభవామ్}}</ref> ఉత్థాన ఏకాదశి, [[ముక్కోటి ఏకాదశి]], ద్వాదశి ఆరాధనలలో[[ఆరాధన]]<nowiki/>లలో ఈ ఉగ్రశ్రీనివాసుని ప్రాధాన్యత ఏర్పడుతుంది. ఈయనపై సూర్యకిరణాలు పడరాదని, అలా ప్రసరించినట్లయితే ప్రపంచానికి హాని సంభవిస్తుందని పురాణేతిహాసం తెలుపుతోంది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఉగ్ర_శ్రీనివాసుడు" నుండి వెలికితీశారు