కాశీమజిలీ కథలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
→‎ఇతివృత్తం: చరిత్రములను -చరిత్రలను
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 7:
 
==ఇతివృత్తం==
అవిభక్త ఘట్టభూమిగా, మోక్షభూమిగా పేరుపొందిన [[కాశీ|కాశీ పట్టణం]] వెళ్ళేందుకు మణిసిద్ధుడు అనే విద్యావంతుడైన బ్రాహ్మణ బ్రహ్మచారి సంకల్పించుకుంటాడు. వాహన సదుపాయాలు లేకపోవడం, నదులు, కొండల వల్ల మార్గం దుర్గమంగా ఉండడంతో ఎవరైనా తోడు వస్తే బాగుంటుందని భావిస్తాడు. ఎందరినో అడిగినా వారు భయపడి రాలేదు. తుదకు శ్రీరంగపురం ఊరి శివార్లలో జీవించే పశువుల కాపరి, అనాథయైన కోటప్ప మాత్రం బయలుదేరాడు. ఆ గోపాలకుడు, మణిసిద్ధుడు కాశీకి [[మజిలీ]]లు చేసుకుంటూ బయలుదేరడం ప్రధాన కథ కాగా ఆపైన ఎన్నెన్నో ఉపకథలు, గొలుసుకట్టు కథలు ఉంటాయి. మార్గమధ్యంలో తనకు వింత వింత కథలు చెప్పి అలసట పోగొట్టి ఆహ్లాదం కలిగిస్తే వస్తానని గోపాలుడు పెట్టిన షరతుకు ఫలితమే ఆ కథలు. కథలలో పతివ్రతల ప్రభావము, దుష్టస్త్రీల కుచ్చితచేష్టలు, సత్పురుష సాంగత్యము వలన కలుగు లాభములు, దుష్టుల సహవాసము కలుగు నష్టములు, దేశాటనము పండితసంపర్కములవలన కలుగు జ్ఞానము, రాజనీతి, వ్యవహార వివేకము, వదాన్యలక్షణము, లోభిప్రవృత్తి మున్నగు అనేక విశేషములు వర్ణించబడినవి. ఇవికాక [[కృష్ణదేవరాయలు]], భోజరాజు, [[శంకరాచార్యులు]], విక్రమార్కుడు, [[నారదుడు]], ప్రహ్లాదుడు మొదలైన మహాపురుషుల చరిత్రములనుచరిత్రలను విచిత్రముగా వ్రాయబడ్డాయి.
 
==కథలు==
"https://te.wikipedia.org/wiki/కాశీమజిలీ_కథలు" నుండి వెలికితీశారు