హేండ్సప్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
==కథ==
హైదరాబాదు నగరం బాంబు పేలుళ్ళతో దద్దరిల్లుతుంటుంది. హైదరాబాదు పోలీసులు, ప్రాంతీయ సి. బి. ఐ అధికారులు సమస్యను అరికట్టడంలో విఫలమవుతారు. దాంతో ఢిల్లీ నుంచి సరస్వతి అనే కొత్త సి. బి. ఐ ఆఫీసరుని నియమిస్తుంది ప్రభుత్వం. ప్రాంతీయ సి. బి. ఐ అధికారియైన గిరిబాబు ఆమెకు పెద్దగా సహకారం అందకుండా ఉండాలని పెద్దగా అనుభవం లేని ముద్దుకృష్ణ, జగన్ అనే అధికారులుని ఆమెకు సహాయకులుగా నియమిస్తాడు. ఇలా చేస్తే వాళ్ళు కలిగించే ఇబ్బందుల వల్ల ఆమె సకాలంలో పనిచేయకుండా ఉంటే పై అధికారుల నుంచి తను చేపట్టిన పని ఎంత క్లిష్టమైన పనో నిరూపించాలని అతని పథకం.
 
జగన్, ముద్దుకృష్ణ ఇద్దరూ తెలివి తక్కువ తనంలో ఒకరికొకరు పోటీ పడుతుంటారు. తుగ్లక్ అనే హిందీ వ్యక్తి హైదరాబాదు తన స్థావరంగా చేసుకుని నగరంలో బాంబు పేలుళ్ళతో అస్థిరపరచాలనుకుంటూ ఉంటాడు. అతని అనుచరులెవరికీ హిందీ తెలియకపోవడంతో ఒక అనువాదకుడిని నియమించుకుంటాడు. సరస్వతి చార్జి తీసుకోగానే జగన్, ముద్దు కృష్ణల అమాయకత్వం వల్ల ఆమె పథకాలు బెడిసికొడుతుంటాయి. అయినా సరే ఆమె వాళ్ళిద్దరి సహాయంతోనే కేసుకు ఛేదించాలనుకుంటుంది.
 
==నటవర్గం==
"https://te.wikipedia.org/wiki/హేండ్సప్" నుండి వెలికితీశారు