"ఇది కథ కాదు" కూర్పుల మధ్య తేడాలు

చి
 
==సంక్షిప్త కథ==
నర్తకి సుహాసిని (జయసుధ) తను ప్రేమించిన భరణి (శరత్ బాబు) ని పెళ్ళి చేసుకోవడం కుదరక దూరమవుతుంది. వేరే వూరిలో పరిచయమైన సుగుణాకర రావ్ (చిరంజీవి) పెళ్ళి చేసుకుంటానంటాడు. అతనికి తన విఫల ప్రేమ సంగతి చెపుతుంది. అయినా అతను పెళ్ళి చేసుకుంటాడు. పెళ్ళి అయినాక అతను పచ్చి శాడిస్టు అని తెలుస్తుంది. అతనితో వేగలేక జయసుధ తన బిడ్డతో వేరేవూరు వెళ్ళి ఉద్యోగంలో చేరుతుంది.
 
క్రొత్త ఆఫీసులో జానీ (కమల్ హాసన్) ఆమెకు సాయంగా నిలుస్తాడు. కమల్ హాసన్ ఒక వెంట్రిలోక్విస్టు. మాట్లాడే బొమ్మ సాయంతో తమాషాగా మాట్లాడుతూ అందరినీ ఉత్సాహపరుస్తుంటాడు. తను జయసుధను ప్రేమిస్తున్నానని ఆ బొమ్మ అంటుంటుంది కొత్త వూళ్ళో జయసుధ జీవితం నిలదొక్కుకుంటున్న సమయంలో మూడు సంఘటనలు మళ్ళీ ఆమెను కల్లోలంలోకి నెడుతాయి. ఆమె పాత ప్రియుడు (శరత్ బాబు) ఆమెకు దగ్గరవుతాడు. వారి ప్రేమ కొనసాగుతుంది. పెళ్ళి దాకా వెళుతుంది. మనుమడి మీద మమకారంతో చిరంజీవి తల్లి (చిరంజీవికి తెలియకుండా) జయసుధ ఇంట్లో పనిమనిషిగా చేరి ఆమె బిడ్డకు సేవలు చేసుకొంటుంటుంది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2276843" నుండి వెలికితీశారు