ఎంట్రోపి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
==ఉపోద్ఘాతం==
[[ఎంట్రోపి]] అనేది ఒక వియుక్త ఉహనం (abstract concept). గభీమని అర్థం కాదు; [[గణితం]] లేకుండా, గుణాత్మకంగా కొంతవరకు అర్థం చేసుకోవచ్చు కానీ లోతుగా తరచి చూడాలంటే గణితం సహాయంతో పరిమాణాత్మక దృక్కోణం  తప్పనిసరి!
 
ఇంగ్లీషు భాష లోకి ఈ  మాట, సా.  శ. 1865 లో, క్లేసియస్ (Classius)  ప్రవేశపెట్టేడు. ఈమాట [[భౌతిక శాస్త్రంలోనిశాస్త్రము|భౌతిక శాస్త్రం]]<nowiki/>లోని తాపగతి శాస్త్రం (thermodynamics) లో పుట్టినా, ఇది ఎంతో మౌలికమైన భావం కనుక ఇతర రంగాలలోకి కూడా వ్యాపించింది.  కాని ఇక్కడ మనం ఇప్పుడు భౌతిక శాస్త్రపు దృష్టితో మాత్రమే మాట్లాడుకుందాం. ఎంట్రోపి అంటే అంతర్గత పరిణామం అని రూడ్యర్థం.
[[దస్త్రం:Clausius.jpg|thumb|upright|రుడోల్ఫ్ క్లషియస్]]
 
[[భౌతిక శాస్త్రం]] అనేది శక్తి యొక్క స్వరూప స్వభావాలని అధ్యయనం చేసే శాస్త్రం. శక్తి ఎప్పుడూ నశించదు; దాని రూపురేఖలు మారొచ్చు కాని దానికి నాశనం లేదు. శక్తి యొక్క మరొక లక్షణం విస్తరించే గుణం. పలచబడడం అనేది ఒక రకం విస్తరణ. బాహ్య స్వరూపం మారడం మరొక రకం  విస్తరణ. శక్తి ఎంతగా విస్తరించిందో కొలవాలంటే ఎంతగా పలచబడిందో కొలవచ్చు, లేదా ఏ మాత్రం ఇతర స్వరూపాలలోకి మారిందో కొలవచ్చు. దూరాన్ని కిలోమీటర్లులో కొలుస్తాము, బరువుని కిలోగ్రాములలో కొలుస్తాము. అలాగే శక్తి స్వరూపంలో అంతర్గతంగా జరిగే ఈ “విస్తరణ” ని కొలవడానికి వాడే కొలమానం పేరు “ఎంట్రోపీ” అని ఇంగ్లీషు లోను, “యంతరపి” అని తెలుగు లోనూ అంటారు.  తాపగతి శాస్త్రంలోని రెండవ సూత్రం ప్రకారం  ఈ “యంతరపి”  పెరుగుదల తగ్గుముఖం పట్టదు.  
 
కొన్ని ఉదాహారణలతో[[ఉదాహరణ వాజ్మయము|ఉదాహరణ]]<nowiki/>లతో మొదలు పెడదాం. ఎత్తుగా ఉన్న ప్రదేశం నుండి లోతుగా ఉన్న ప్రదేశం లోకి నీరు ప్రవహిస్తుంది. ఏదీ, “లోతుగా ఉన్న చోటు నుండి ఎగువకి నీరు ఎందుకు ప్రవహించదు?” అని అడిగి చూడండి. మిమ్మల్ని ఏ పిచ్చాసుపత్రిలోనో పడేస్తారు. సముద్రంలో అల్ప పీడన ద్రోణి ఏర్పడడం వల్ల - అంటే అక్కడ [[గాలి]] పీడనం పడిపోవడం  వల్ల  - నీరు పల్లమెరిగినట్లే గాలి కూడా పల్లమెరుగుతుంది. అధిక పీడన ప్రాంతం నుండి అల్ప పీడన ప్రాంతానికి గాలి జోరుగా వెళుతుంది. వేడిగా ఉన్న పెనాన్ని చల్లగా ఉన్న చపటా  మీద పెడితే, క్రమేణా వేడి పెనం చల్లబడుతుంది, చల్లని  చపటా  వేడెక్కుతుంది. ఇక్కడ పెనం నుండి చపటా  వైపు వేడి (heat) ప్రవహించింది.
 
ఈ ఉదాహరణల తాత్పర్యం ఏమిటి? గాలి కానీ, [[నీరు]] కానీ, [[వేడి]] కానీ “ఎత్తు”  నుండి “పల్లానికి” ప్రవహిస్తుంది. ఇది ప్రకృతి నైజం. ఇలా ఒకే దిశలో [[ప్రయాణం]] చేసేది, మనం రోజూ అనుభవించేది, మరొకటి ఉంది. అది కాలం (time). ఇలా ఒకే దిశలో ప్రయాణం చేసేది, మన అనుభవానికి అతీతమైనది, మరొకటి ఉంది. అదే యంతరపి (entropy). ఒక వ్యష్టిగా ఉన్న వ్యవస్థలో యంతరపి ఏనాడూ తగ్గుముఖం పట్టదు” అనేది ఒక ప్రాథమిక, అతిక్రమించారని, భౌతిక సూత్రం. ఇది అనుభవానికి అతీతమైనది కనుక ఉపమానాలతో అర్థం చేసుకోడానికి  ప్రయత్నం చేస్తున్నాం.  
 
నీటి ప్రవాహం లో శక్తి ఉంది. అందు చేత ఆ ప్రవాహానికి అడ్డుగా ఒక చక్రం పెడితే అది గిర్రున తిరుగుతుంది. అప్పుడు ఆ తిరిగే చక్రానికి విద్యుత్ ఉత్పాదకిని తగిలిస్తే ఆ శక్తి  [[విద్యుత్తు]] రూపంలోకి మారుతుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. గాలి ప్రవాహానికి అడ్డుగా ఒక చక్రం పెట్టి గాలిమర ద్వారా విద్యుతుని  పుట్టిస్తున్నాము కదా! అనగా ఎత్తు నుండి పల్లానికి ఏది ప్రవహిస్తున్నా ఆ ప్రవాహంలోని అంతర్గత శక్తిని[[శక్తి]]<nowiki/>ని మనం మనకి అనుకూలమైన శక్తి రూపంలోకి  మార్చుకుని వాడుకోవచ్చు. ఎగువ నుండి దిగువకు వేడి ప్రవహిస్తూ ఉంటే దానిని కూడా మనం వాడుకోవచ్చా? నిక్షేపంగా! మనం కార్లు నడపడానికి ఇదే సూత్రాన్ని వాడి, ప్రవహిస్తున్న వేడిని వాడుకుంటున్నామని చాలామందికి తెలియదు.  ప్రవాహంలో గాఢంగా ఇమిడిన శక్తి (concentrated energy) అంతా సద్వినియోగం కాదు; కొంతవరకు వృధా అవుతుంది. ఇలా మనం వాడుకోడానికి వీలులేకుండా నష్టపోతున్న (విస్తరిస్తూన్న) శక్తిని కొలిచే కొలమానాన్ని '''యంతరపి''' (entropy) అంటారు. మరొక విధంగా చెబుతాను. ప్రకృతి సహజంగా విస్తరిస్తూ వృధాగా పోతున్న శక్తిని మనం ఊహాత్మకంగా, కొంతవరకు,  ఉపయోగించుకోవచ్చు.
 
శాస్త్రంలో హఠాదుత్పన్న లక్షణం (emergent property) అనే దృగ్విషయం (phenomenon) ఉంది. అనగా, హఠాత్తుగా పుట్టుకొచ్చే లక్షణం. కొన్ని ఉదాహరణలు: తాపోగ్రత (temperature) అనే భావం  ఉంది. ఒకే ఒక అణువు (atom) ని కానీ, ఒకే ఒక బణువు (molecule) ని గాని తీసుకుని దాని “తాపోగ్రత” గురించి మాట్లాడడం అర్థ రహితం. ఒక్క చేతిని ఎంత  తాడించినా చప్పుడు కాదు, అలాగే ఒక్క బణువుకి తాపోగ్రత ఉండదు. ఒక చోట  కోట్ల కొద్దీ బణువులు, ఒక దానిని మరొకటి గుద్దుకుంటూ ప్రయాణం చేస్తూ ఉంటేనే వేడి (heat) పుడుతుంది, దాని ఉగ్రతని మనం తాపోగ్రత అంటున్నాం. కనుక తాపోగ్రత అన్నది హఠాదుత్పన్న లక్షణం. మరొక ఉదాహరణ. క్రిములు, [[కీటకాలు]], పశుపక్ష్యాదుల కంటే [[మానవుడు]] తెలివితేటలు (Intelligence) ఉన్నవాడని అంటారు కదా. దీనికి కారణం మన మెదడులో ఉన్న నూరానులు అనే జీవకణాల మధ్య ఉన్న లంకెలు. అల్ప  జీవుల మెదడులలో 100 కి మించి నూరానులు ఉండవు. కానీ మానవుడి మెదడులో[[మెదడు]]<nowiki/>లో కోటానుకోట్ల నూరానులు ఉండబట్టి అంతకి  నూరింతలు  లంకెలు ఉంటాయి కాబట్టి మానవుడు తెలివి ప్రదర్శిస్తున్నాడని ప్రచారంలో ఉన్న వాదం ఒకటి ఉంది. ఒకే ఒక నూరాను  ఉంటే లంకెలు ఏవి? కనుక ఒకే ఒక నూరాను తెలివిని ప్రదర్శించలేదు. అందుకని  తెలివి అనేది కూడా ఒక హఠాదుత్పన్న లక్షణం. ఇదే ధోరణిలో యంతరపి కూడా ఒక  హఠాదుత్పన్న లక్షణం.
 
ఈ ఉదాహరణలన్నిటి వెనుక ఒక ఉమ్మడి లక్షణం ఉంది. పదార్థాలన్నిటిలోను ఉన్న [[అణువు]]లు, [[బణువు]]లు సతతం ఆలా కదులుతూనే ఉంటాయి. మన చుట్టూ ఉన్న గాలిలో (వాయు పదార్థం) ఉన్న ఆమ్లజని బణువులు, సగటున, గంటకి 1500 కిలోమీటర్లు  వేగంతో ప్రయాణం చేస్తూ ఉంటాయంటే మీరు నమ్మగలరా? అవి ఒక సెంటీమీటరులో పది మిలియనవ భాగం ప్రయాణం చేసేసరికి పక్కనున్న మరొక బణువుని గుద్దుకుని, దిశ మార్చి, మరొక దిశలో ప్రయాణం చేస్తూ ఉంటాయి! గది  వేడెక్కుతున్న కొద్దీ ఈ  వేగం పెరుగుతుంది. ఘన పదార్థాలలో అణువులు స్పటిక చట్రాలు (crystal lattice) కి బందీలయి ఉంటాయి కనుక విశృంఖలంగా తిరగలేవు; ఉన్న చోటే కంపిస్తూ ఉంటాయి. ఈ  కదలికలలోను, కంపనాలలోను ఇమిడి ఉన్న శక్తిని విస్తరింపజేయాలని చూస్తూ ఉంటుంది ప్రకృతి - మరే బాహ్య శక్తులు అడ్డుకోకపోతే! ఈ  విస్తరణ కారణంగానే వేడిగా ఉన్న పెనం చల్లారుతోంది, కొండ మీద నీరు సముద్ర మట్టంలోకి దిగుతోంది. ఈ  నగ్న సత్యమే తాపగతి  శాస్త్రపు రెండవ సూత్రం, లేదా క్లుప్తంగా, రెండవ సూత్రం. ఈ విస్తరణ కొలమానము యంతరపి!
"https://te.wikipedia.org/wiki/ఎంట్రోపి" నుండి వెలికితీశారు