అహ్మద్ మొహియుద్దీన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక (2) using AWB
పంక్తి 16:
}}
 
'''[[అహ్మద్ మొహియుద్దీన్]]''' ([[1898]], [[అక్టోబరు 10]] – [[1966]], [[జనవరి 5]]) ఆర్ధికవేత్తఆర్థికవేత్త, పాలనాధికారి మరియు భారతీయ రాజకీయనాయకుడు. ఈయన 1952 నుండి 1957 వరకు, [[1వ లోకసభ|తొలి లోక్‌సభ]]లో [[హైదరాబాదు లోకసభ నియోజకవర్గం|హైదరాబాదు నియోజకవర్గానికి]] ప్రాతినిధ్యం వహించాడు. ఈయన రెండవ మరియు మూడవ లోక్‌సభలకు [[సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం|సికింద్రాబాదు నియోజకవర్గం]] నుండి ఎన్నికయ్యాడు. [[జవాహర్ లాల్ నెహ్రూ|నెహ్రూ]] మంత్రివర్గంలో కేంద్రమంత్రిగా పనిచేశాడు.
 
అహ్మద్ మొహియుద్దీన్, 1898, అక్టోబరు 10న [[హైదరాబాదు]]లో జన్మించాడు. ఈయన తండ్రి నూరుల్లా హుస్సేనీ. మొహియుద్దీన్, [[అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం]] మరియు [[కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం]]లో విద్య అభ్యసించాడు. హైదరాబాదు సంస్థానం యొక్క ప్రభుత్వ సేవలో పనిచేసి విరమణ పొందాడు. ఈయన హైదరాబాదు సంస్థానపు జాతీయ పునర్నిర్మాణ శాఖలో కొంతకాలం పనిచేశాడు. 1927 నుండి 1930 వరకు [[నిజాం కళాశాల]]లో ఆర్ధికశాస్త్రఆర్థికశాస్త్ర ఆచార్యుడిగా పనిచేశాడు.<ref name=loksabha>{{cite web|title=Third Lok Sabha - Member Profile|url=http://164.100.47.194/loksabha/writereaddata/biodata_1_12/1269.htm|accessdate=12 December 2017}}</ref> సంస్థానంలో బ్యాంకింగు వ్యాపారం పరిస్థితిని గురించి దర్యాప్తు చేయడానికి హైదరాబాదు ప్రభుత్వం ఏర్పాటుచేసిన విచారణ సంఘాలకు కార్యదర్శిగా పనిచేశాడు. 1938 నుండి 1943 వరకు వాణిజ్య పరిశ్రమల శాఖ డైరెక్టరుగా పనిచేశాడు. 1939లో కాంగ్రేసు ఏర్పాటుచేసిన జాతీయ ప్రణాళికా సమితిలో హైదరాబాదు ప్రతినిధిగా నియమించబడ్డాడు. ఆ తరువాత కొంతకాలం బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు కార్యదర్శిగా, కార్మిక శాఖ కార్యదర్శిగా పనిచేశాడు.<ref name=andhrabhoomi19660106>{{cite news|title=మొహియుద్దీన్ మృతి|url=http://www.pressacademyarchives.ap.nic.in/archive_new/STATE_CENTRAL_LIBRARY_AFZALGUNJ/ANDHRABHOOMI/111350_ANDHRABHOOMI_06_01_1966_Volume_no_6_issue_no_96/00000006.pdf|accessdate=13 December 2017|work=ఆంధ్రభూమి|date=6 January 1966|page=6}}</ref>
 
1958 నుండి 1962 వరకు కేంద్ర పౌరవిమానయాన శాఖకు సహాయమంత్రిగా పనిచేశాడు. 1962 నుండి మరణించే వరకు కేంద్ర సమాచార ప్రసరణ మరియు రవాణ శాఖకు ఉపమంత్రిగా పనిచేశాడు.