రవిప్రకాష్: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ చేర్పఉ
చి →‎కెరీర్: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో using AWB
పంక్తి 17:
 
== కెరీర్ ==
2000 లో రమణ దర్శకత్వంలో [[ఉషాకిరణ్ మూవీస్]] నిర్మించిన [[శుభవేళ]] అనే చిత్రంలో కథానాయకుడిగా తన నట ప్రస్థానాన్ని ప్రారంభించాడు. రమణ, దర్శకుడు [[తేజ]] స్నేహితుడు కావడంతో ఈ సినిమా నిర్మాణంలో ఆయనే కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాలో సిబ్బంది పొరపాటు వల్ల పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూ వల్ల రవికాంత్ అనే పేరుతో అచ్చైంది. తర్వాత రవిప్రకాష్ అని పేరు మార్చుకున్నాడు. అయితే ఈ సినిమా ఆశించినంతగా ఆడలేదు. తర్వాత హైదరాబాదులో గాంధీ ఆసుపత్రిలో రెండు సంవత్సరాలు హౌస్ సర్జన్ చేయడం కోసం గ్యాప్ తీసుకున్నాడు. పెద్దగా శిక్షణ లేకుండా మొదటి సినిమా నటించడం వల్ల నటనలో మరిన్ని మెలకువలు తెలుసుకోవడం కోసం మరోసారి పలు విభాగాల్లో శిక్షణ పొంది తన నైపుణ్యాలు మెరుగుపరుచుకున్నాడు. 2002 లో జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన [[ఈశ్వర్]], వై. వి. ఎస్. చౌదరి దర్శకత్వంలో నందమూరి హరికృష్ణ కథానాయకుడిగా వచ్చిన సీతయ్య సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రలు పోషించాడు. 2004 లో తమిళ దర్శకుడు గౌతం మీనన్ దర్శకత్వంలో వెంకటేష్ కథానాయకుడిగా తమిళ రీమేక్ చిత్రం ఘర్షణ లోఘర్షణలో అతను పోషించిన పోలీసు ఆఫీసరు పాత్ర అతనికి మంచి గుర్తింపునిచ్చింది. తర్వాత అలాంటి పాత్రలు చాలా నటించాడు. 2005 లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన [[అతడు (సినిమా)|అతడు]] సినిమాలో రవి ప్రకాష్ పోషించిన సి.బి.ఐ ఆఫీసరు పాత్ర కూడా అతనికి గుర్తింపు తెచ్చిపెట్టింది.
 
2010 లో క్రిష్ దర్శకత్వంలో వచ్చిన వేదం సినిమాలో కూడా పోలీసు అధికారి పాత్ర పోషించాడు. ముస్లింలందరినీ ఒకే గాటనకట్టి అనుమానించి చివరికి మానవత్వమే గొప్ప అని తెలుసుకునే పాత్ర.
"https://te.wikipedia.org/wiki/రవిప్రకాష్" నుండి వెలికితీశారు