రాగి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
లింకులు చేర్చితిని
పంక్తి 1:
{{రాగి మూలకము}}
'''రాగి''' (Copper) ఒక [[మూలకము|రసాయనిక మూలకము]]. రాగిని తామ్రం అనికూడా పిలుస్తారు. దీని అణు సంఖ్య 29. సంకేత అక్షరం Cu ([[లాటిన్]] లో రాగిని Cuprum అందురు. ఇది ఒక లోహం. సాగకొట్టిన సన్నని తీగెలుగా సాగుతుంది. అలాగే పలుచని రేకులుగా సాగుతుంది. రాగి మంచి ఉష్ణవాహకం మరియు విద్యుత్తు వాహకం కూడా. కల్తీ లేని స్వచ్ఛమైన రాగి మృదువుగా ఉండి సులభంగా సాగే గుణం ప్రదర్సించును. రాగి ఎరుపు–నారింజ[[ఎరుపు]]–[[నారింజ]] రంగుల మిశ్రమ రంగును కలిగి ఉండును. మానవుడు మొదటగా ఉత్పత్తిచేసి, ఉపయోగించిన లోహం రాగి<ref>{{citeweb|url=http://www.mindat.org/min-1209.html|title=Copper|publisher=mindat.org|date=|accessdate=02-03-2015}}</ref>.రాగిని [[ఉష్ణము|ఉష్ణ]] మరియు [[విద్యుత్తు]] వాహకాల తయారిలోవిరివిగా వినియోగిస్తారు. అంతే కాదు గృహ వంటపాత్రలను తయారు చేయుటకు, మరియు గృహ ఉపకరములను చేయుట యందును వాడెదరు. రాగియొక్క మిశ్రమ లోహాలను ఉపయోగించి అనేక వస్తు వులను తయారు చేయుదురు. క్రీ.పూ.8000 వేల సంవత్సరాల నాటికే రాగి నుండి నాణెములను, [[ఆభరణాలు|ఆభరణము]] తయారు చెయ్యడం మానవునికి తెలుసు. క్రీ.పూ 5500 సంవత్సరాల సమయంలో మానవుడు రాతియుగంలో[[రాతి యుగము|రాతియుగం]]<nowiki/>లో వాడే రాతి పనుముట్లకు బదులుగా రాగితోను దాని యొక్క మిశ్రమ లోహాలతోను [[ఆయుధం|ఆయుధాలను]], పనిముట్లను తయారుచేసి వాడటము ప్రారంభించటం వలన నాటిమానవుని నాగరీకతలో మార్పులు చోటు చేసుకున్నవి<ref>{{citeweb|url=http://geology.com/usgs/uses-of-copper/|title=Facts About Copper|publisher=geology.com|date=|accessdate=02-03-2015}}</ref>
 
రాగిని, రాగియొక్క మిశ్రమ లోహాలను కొన్ని వేల ఏండ్లుగా రోమనుల కాలంలో ఉపయోగించినట్లు ఆధారాలున్నాయి. మొదట్లో ఈ లోహం యొక్క ముడి [[ఖనిజాలు|ఖనిజాన్ని]] సైప్రస్ ప్రాంత పు గనులనుండి త్రవ్వి తీయడం వలన ఈ లోహాన్ని మొదట సిప్రియం (сyprium ) అని పిలిచేవారు. అనగా సైప్రసులో లభించు లోహం అని అర్థం. ఆ పేరే కాలక్రమేనా కుప్రసుగా మారింది<ref>{{citeweb|url=http://www.thesaurus.com/browse/copper|title=copper|publisher=thesaurus.com|date=\accessdate=02-03-2015}}</ref>. రాగి యొక్క లవణములు నీలి లేదా ఆకుపచ్చ రంగును కలిగియుండి, రంగులుగా ఉపయోగించే వారని తెలియ వచ్చుచున్నది .
 
రాగి [[నీరు|నీటితో]] రసాయనిక చర్య జరుపకున్నను, గాలోలోని ఆమ్లజని ([[ఆక్సిజన్|ఆక్సిజను]]) తో నెమ్మదిగా చర్య జరపడం వలన ఏర్పడిన కాపర్ సల్పైడ్, లోహం ఉపరితలం పైన, బ్రౌను-నలుపు రంగులో పూత వలె ఏర్పడును. ఈ పూత లోహం యొక్క ఉపరితలానికి రక్షణ పూత వలె పనిచేయును .అందువలన లోహాన్ని గాలిలోని ఆక్సిజనుతో చర్య జరిపి మరింతగా క్షయికరణ చెందకుండా రక్షణ ఒసగును. రాగి దాదాపుగా 10 వేల ఏండ్ల నుండి వాడుకలో ఉన్నట్లుగా తెలుస్తున్నప్పటికీ, క్రి. శ.19 వ శతాబ్ది నుండి అధిక పరిమాణంలో ఉత్పత్తి చెయ్యడం మొదలైనది. ప్రసుత్తం ఉన్న రాగి నిల్వలలో 50% రాగిని కేవలం గత 25 సంవత్సరాలలో గనుల నుండి వెలికి తియ్యడం జరిగింది. అనగా ఈ మధ్య కాలంలో రాగి వాడకం ఎంతగా పెరిగినది తెలియుచున్నది.
==రాగియొక్క భౌతిక గుణగణాలు ==
ఆవర్తన పట్టికలో రాగి 11 సమూహము (గ్రూప్ ) నకు చెందిన మూలకం. వెండి మరియు బంగారు లోహాలు కూడా 11 గ్రూప్ నకు చెందిన మూలకములు. అందువలన ఈ మూడు మూలకములు కొన్ని ఉమ్మడి లక్షణాలు ప్రదర్శించును. ఆ మూడు మూలకములు మంచి విద్యుత్తు మరియు ఉష్ణ వాహకంలు. అంతేకాదు వీటిని అతిపలుచని సన్నని తీగెలు, రేకులుగా అతిసులభంగా మార్చవచ్చును. ఈ మూడు మూలకాల పరమాణు నిర్మాణంలో D-ఆర్బిటాల్ (వలయం) పూర్తిగా ఎలక్ట్రానికులను కలిగి, దాని వెలుపల S ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ కలిగి ఉండునును. రాగికున్న మృదుత్వతత్వము ఈ మూలకం యొక్క ఉత్తమ విద్యుత్తు మరియు ఉష్ణ వాహకతత్వము నకు కారణం. స్వచ్ఛ మైన రాగి మూలకం యొక్క విద్యుత్తు వాహక గుణ విలువ (59.6×106 S/m). రాగి 29 ఐసోటోపులను కలిగి యున్నది. అందులో <sup>63</sup>CU మరియు <sup>65</sup>CU ఐసోటోపులు స్థిరమైనవి.
"https://te.wikipedia.org/wiki/రాగి" నుండి వెలికితీశారు