రాగి: కూర్పుల మధ్య తేడాలు

లింకులు చేర్చితిని
లింకులను చేర్చితిని
పంక్తి 6:
రాగి [[నీరు|నీటితో]] రసాయనిక చర్య జరుపకున్నను, గాలోలోని ఆమ్లజని ([[ఆక్సిజన్|ఆక్సిజను]]) తో నెమ్మదిగా చర్య జరపడం వలన ఏర్పడిన కాపర్ సల్పైడ్, లోహం ఉపరితలం పైన, బ్రౌను-నలుపు రంగులో పూత వలె ఏర్పడును. ఈ పూత లోహం యొక్క ఉపరితలానికి రక్షణ పూత వలె పనిచేయును .అందువలన లోహాన్ని గాలిలోని ఆక్సిజనుతో చర్య జరిపి మరింతగా క్షయికరణ చెందకుండా రక్షణ ఒసగును. రాగి దాదాపుగా 10 వేల ఏండ్ల నుండి వాడుకలో ఉన్నట్లుగా తెలుస్తున్నప్పటికీ, క్రి. శ.19 వ శతాబ్ది నుండి అధిక పరిమాణంలో ఉత్పత్తి చెయ్యడం మొదలైనది. ప్రసుత్తం ఉన్న రాగి నిల్వలలో 50% రాగిని కేవలం గత 25 సంవత్సరాలలో గనుల నుండి వెలికి తియ్యడం జరిగింది. అనగా ఈ మధ్య కాలంలో రాగి వాడకం ఎంతగా పెరిగినది తెలియుచున్నది.
==రాగియొక్క భౌతిక గుణగణాలు ==
[[ఆవర్తన పట్టికలోపట్టిక]]<nowiki/>లో రాగి 11 సమూహము (గ్రూప్ ) నకు చెందిన మూలకం. వెండి మరియు [[బంగారం|బంగారు]] లోహాలు కూడా 11 గ్రూప్ నకు చెందిన మూలకములు. అందువలన ఈ మూడు మూలకములు కొన్ని ఉమ్మడి లక్షణాలు ప్రదర్శించును. ఆ మూడు మూలకములు మంచి విద్యుత్తు మరియు ఉష్ణ వాహకంలు. అంతేకాదు వీటిని అతిపలుచని సన్నని తీగెలు, రేకులుగా అతిసులభంగా మార్చవచ్చును. ఈ మూడు మూలకాల పరమాణు నిర్మాణంలో D-ఆర్బిటాల్ (వలయం) పూర్తిగా ఎలక్ట్రానికులను కలిగి, దాని వెలుపల S ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ కలిగి ఉండునును. రాగికున్న మృదుత్వతత్వము ఈ మూలకం యొక్క ఉత్తమ విద్యుత్తు మరియు ఉష్ణ వాహకతత్వము నకు కారణం. స్వచ్ఛ మైన రాగి మూలకం యొక్క విద్యుత్తు వాహక గుణ విలువ (59.6×106 S/m). రాగి 29 ఐసోటోపులను కలిగి యున్నది. అందులో <sup>63</sup>CU మరియు <sup>65</sup>CU ఐసోటోపులు స్థిరమైనవి.
 
<sup>63</sup>CU అను ఐసోటోపు సహాజంగా లభించు రాగి ఖనిజములో 69% వరకు ఉండు ను. రాగి యొక్క పైన చెప్పిన రెండు [[ఐసోటోపులు|ఐసోటోపు]]<nowiki/>లు మినహాయించి మిగిలిన రాగి యొక్క ఐసోటోపులు అణుధార్మిక గుణమును ప్రదర్శించును.
 
'''రాగియొక్క భౌతిక గుణగణాల పట్టిక '''<ref>{{citeweb|url=http://www.rsc.org/periodic-table/element/29/copper|title=Copper|publisher=.rsc.org|date=|accessdate=02-03-2015}}</ref>
పంక్తి 31:
ఖనిజంలో రాగి 0 .6%.గనులలో లభించు ముడి ఖనిజం ఇనుమును మలినంగా కలిగిన చాల్కొపైరేట్ (CuFeS2) గా లభించును. తక్కువ పరిమాణంలో chalcocite చాల్కొసిట్ (Cu<sub>2</sub>S) రూపంలో లభ్యం.
==రాగియొక్క మిశ్రమ లోహాలు==
రాగిని మూల లేదా ఆధార లోహాంగా, దానిలో [[తుత్తునాగము|జింకు]]/యశదము, [[తగరము|తగరం]], [[సీసము (మూలకము)|సీసం]], [[వెండి]], [[బంగారం]], [[అల్యూమినియం]] మరియు [[నికెలు]] వంటి లోహాలను వివిధ నిష్పత్తిలో కలిపి రాగి యొక్క మిశ్రమ లోహాలను తయారు చేయుదురు. ఇత్తడి, కంచు, గన్‌మెటల్ అనునవి రాగియొక్క మిశ్రమలోహాలు. మిశ్రధాతువు లేదా మిశ్ర లోహం అనగా ఒక ప్రధాన లోహాంలో ఇంకొకటి లేదా ఒకటి కంటే ఎక్కువ లోహాలను వివిధ ప్రమాణంలో కలిపి సమ్మేళనం చేసి తయారు చేసిన ధాతుసమ్మేళన పదార్థము.
===ఇత్తడి===
రాగి మరియు జింకు/యశదం లోహాలను మిశ్రం చేసి బట్టి పెట్టి రెండింటిని ద్రవీకరించి సమ్మేళనము చెయ్యడం వలన ఈ రెండింటి మిశ్రమ ధాతువు [[ఇత్తడి]] ఏర్పడుతుంది. ఇత్తడిలో జింకు శాతం 37 నుండి 45 % వరకు ఉంటుంది<<ref>{{citeweb|url=http://www.wisegeek.com/what-is-brass.htm|title=What Is Brass?|publisher=wisegeek.com|date=|accessdate=04-03-2015}}</ref>.ఇత్తడికి కొంచెం దృఢత్వం, మరియు సులభంగా తరణి పట్టునట్టు చేయుటకై సీసాన్ని స్వల్ప ప్రమాణంలో కలిపెదరు. రాగిలో 37 % వరకు జింకును కలిపినప్పుడు ఒకే దశలో చేత/దుక్క విధానంలో చేయుదురు. ఒకేదశలో పోత పోసిన లోహానికి పలకలుగా సాగేగుణం అధికంగా ఉంటుంది. రాగిలో 37 % కన్న ఎక్కువ ప్రమాణంలో జింకును కలిపి తయారు చేయవలసిన దానిని రెండంచల పద్ధతిలోచేయుదురు. రెండంచల విధానంలో ఉత్పత్తి చేసిన ఇత్తడికి దృఢత్వం ఎక్కువ ఉంటుంది, కాని సాగే గుణం తక్కువ. రెండంచల పద్ధతిలో ఇత్తడిని పోత విధానము (cast ing) పద్ధతిలో తయారు చేయుదురు.
 
ఇత్తడిని గృహ నిర్మాణ అవసరాలకు వాడెదరు. పాత్రలను పాత్ర భాగాలను తయారు చేయుటకు వాడెదరు. తలుపు గడియలు, ప్లగ్గులు, విద్యుత్ ఉపకరణాలు, తాళాలు, పంపులకు లోపలి భాగాలు, బోల్టులు, నట్టులు, ల్యాంప్ ఫిట్టింగులు, రేడియేటర్ అంతర్భాగాలు చేయుటకు ఉపయోగిస్తారు. సాధారణంగా ఇత్తడిని రెండు రకాలుగా విభజింప/వర్గికరించ వచ్చును<ref>{{citeweb|url=http://keytometals.com/page.aspx?ID=CheckArticle&site=ktn&NM=216|title=Classification and Properties of Copper Alloys|publisher=http://keytometals.com/|date=|accessdate=3-3-2014}}</ref>.
పంక్తి 79:
|}
 
===[[కంచు]] ===
కంచును రాగి మరియు తగరాన్ని సమ్మేళనము చేసి తయారు చేయుదురు. కంచులో రాగి దాపుగా 88.0%, తగరాన్ని 12.0% వరకు ఉండును<ref>{{citeweb|url=http://chemistry.about.com/od/alloys/f/What-Is-Bronze.htm|title=What Is Bronze?|publisher=http://chemistry.about.com/|date=|accessdate=04-03-2015}}</ref>.అయితే ఈ రెండు లోహాలతో పాటుగా కొద్ది ప్రమాణంలో భాస్వరం, అల్యూమినియం, సిలికాన్, మాంగనీస్, మరియు నికెల్ లోహాలలో ఏదో ఒకలోహాన్ని కుడా మిళితం చేయుదురు.ఈ రకపు మిశ్రమ లోహాలు ఎక్కువ దృఢత్వం కలిగిఉండి, క్షయీకరణను తట్టుకొను క్షయీకరణ నిరోధ గుణం, స్వభావం కలిగి ఉండును. ఈ రకపు మిశ్రమ లోహాలను స్ప్రింగులు, మూస అచ్చులు, బెరింగులు, జోర్నల్ బుషులు, గ్రుహోపకారణాలు చేయుటకు, అలంకరణ వస్తువులు, విగ్రహాలను పోతపోయుటకు వాడెదరు.
 
"https://te.wikipedia.org/wiki/రాగి" నుండి వెలికితీశారు