పేరిణి నృత్యం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
పేరిణి నృత్య కారుడు, రక్తి కలిగించేవారుగా, రూప సంపన్నుడుగా, అందాన్ని భావింప గలవాడుగా, రసానుభావం కలవాడుగా, తాళజ్ఞడుగా, గమకంలో నేర్పరిగా, ధ్వని గల శరీరం కలవాడుగా, మంచి రేఖ గలవాడుగా, వాయిద్యాలను ఎరిగిన వాడుగా వుండాలనీ, అటువంటి వాడే, పేరిణీ నృత్యానికి తగిన వారనీ అంటాడు జాయప సేనాని.
==తాండవ నృత్యం==
[[File:పేరిణీ శివతాండవం .png|thumb|right|200px|పేరిణి శివతాండవం]]
ఈ ఆధారాలు తప్ప, [[పేరిణి]]ని గురించి మరిన్ని ఆధారాలు దొరకవు. పై వర్ణనను అర్థం చేసుకో గలిగినప్పుడు, ఆ [[నృత్యం]] ఎలా వుంటుందో ఊహించవచ్చు. ఆ ఊహతోనే సృజనాత్మకంగా రామ కృష్ణగారు, చరిత్రాత్మకమైన, చిరస్మరణీయమైన ఈ ఉధృతతాండవ నృత్యాన్ని, వ్వయ ప్రయాసలతో తీర్చి దిద్దారు. పేరిణి తాండవ శైలికి సంబంధించింది. తాండవం అంటే తనలో తాను లయం చేసుకోవడమంటారు [[ఉమా వైజయంతీమాల]]గారు. లయ విన్యాసాన్ని తెలియజేసే నృత్తమే గాక, భావ ప్రకటనకు అనువైన భంగిమ గల నృత్యం, పేరణి ఈనృత్యం. నృత్తంతో ప్రారంభమై ...... నృత్యంతో వికశించి అంగికాభినయంతో ముగుస్తుంది.
 
పేరిణి తాండవం రెండు విధాలు. ఒకటి పురుషుల చేతా, రెండవది స్త్రీల చేతా చేయబడుతుంది. పురుషుని యొక్క పురుషత్వాన్ని లోకానికి తెలియచేస్తూ ప్రదర్శించే నర్తనమే ''పేరిణి శివ తాండవం.'' ఇది వీరులు చేసిన వీర నాట్యం. భారతీయ నృత్య రీతుల్లో ఎక్కడా ఈ పేరిణి నృత్యం కనిపించదు.
 
==రామప్ప ప్రజ్ఞ==
సంగీతానికి సప్తస్వరాలు ప్రాణం. అలాగే మృదంగానికీ త, ది, తో, ణం, ఆధారమైనట్లు, నృత్యం ఎన్ని విధాలుగా రూపొందినా దానికి ప్రధాన స్థానాలు ఎనిమిది మాత్రమే. ఇటివంటి మూల సూత్ర స్థానాలు రామప్ప శిల్పంలో రూపొందించ బడ్డాయి. అంతే కాదు ఆ స్థానాలను ప్రయోగించేటప్పుడు, వాయించ వలసిన తొలి మృదంగ శబ్ధాన్ని ఎంత తూకంలో ప్రయోగిస్తే ఆ విన్యాసం పూర్తిగా వికసించటానికి అవకాశముందో ఆ హస్త విన్యాస క్రమం, మొదలైన వెన్నో ఆ మృదంగ భంగిమలో రామప్ప మలిచాడంటుంది [[ఉమా వైజయంతీమాల]].
"https://te.wikipedia.org/wiki/పేరిణి_నృత్యం" నుండి వెలికితీశారు