భోగి: కూర్పుల మధ్య తేడాలు

112 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చిదిద్దుబాటు సారాంశం లేదు
[[భోగిమంటలు]] సినిమా కొరకు చూడండి [[భోగిమంటలు (సినిమా)]]
----
{{Infobox holiday
}}
[[File:Bhogi Mantalu (YS) (2).JPG|thumb|భోగి పండుగ రోజు తెల్లవారుజామున వేస్తున్న భోగిమంటలు]]
'''భోగి''' లేదా '''భోగి పండుగ''' అనునది [[ఆంధ్రులు]] జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఆంధ్రులు [[పెద్ద పండుగ]]గా జరుపుకునే మూడు రోజుల [[సంక్రాంతి]] పండుగలో మొదటిరోజును భోగి అంటారు. భోగి పండుగ సాధారణంగా జనవరి 13 లేదా జనవరి 14 తేదిలలో వస్తుంది. [[దక్షిణాయనం]]లో [[సూర్యుడు]] రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి[[భూమి]]<nowiki/>కి దూరం అవుట వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు, [[ఉత్తరాయణం]] ముందురోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ భగ మండే మంటలు అందరు వేయటం వలన ఈ రోజుకు భోగి అనే పేరు వచ్చింది.
==విశేషాలు==
సంక్రమణ మహాపర్వానికి ముందు రోజుకి ఒక ప్రాధాన్యం ఉంది. దీనికి భోగిపర్వం అని పేరు. అయితే భోగము అనే మాటకు అర్థం ఏమిటంటే [[అనుభవము]] అని. ఆనందంగా దేనిని అనుభవిస్తామో లేదా దేనిని అనుభవించడం వల్ల ఆనందం పొండుతామో దానిని భోగము అనాలి. అలాంటి భోగములు అనుభవించవలసిన రోజుని భోగి అంటారు. నిజమైన ఆనందాన్ని అనుభవించడమే నిజమైన భోగం. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఆనందం. సామాన్యుల ఆనందాలు వేరు. వాళ్ళకి లౌకిక విషయాలు దొరికితే అది భోగం. ఆ విషయంతో విసుగు కలిగితే మరో విషయం లభించాలని. కానీ ఏది లభిస్తే మరి ఇంకేదీ కావాలని అనిపించదో, ఏది పరిపూర్ణమైన ఆనందమో అదే నిజమైన భోగం. అలాంటి భోగం యోగం వల్లనే లభ్యం అవుతుంది. అందుకే యోగులే భోగులు కాగలరు. అలాంటి దివ్య భోగం ఈరోజున అమ్మ గోదాదేవి ఆండాళ్ళమ్మ పొందినది. అదేమిటంటే పరమాత్మ ప్రాప్తి. రంగనాథుని చేపట్టినది. రంగనాథుని అనుగ్రహాన్ని పొందినది. రంగనాథుని సాంగత్యం అనబడేటటువంటి ఆ కైవల్యానందం అనే భోగాన్ని అమ్మ పొందినది కనుక ఈరోజు భోగి అనే పేరు భక్తి సాంప్రదాయం పరంగా నిర్వచించేవారు చెబుతారు. సరిగ్గా ఈ రోజుతో ధనుర్మాసం పూర్తి అవుతున్నది. తర్వాతు రీహ్య్ నుంచి మకర మాసం వస్తున్నది సౌరమానం ప్రకారంగా. ఈ [[ధనుర్మాసము|ధనుర్మాస]] వ్రతమంతా ఈరోజు పూర్తీ జరిగి దాని ఫలితంగా అమ్మవారు స్వామియొక్క అనుగ్రహాన్ని పొందినది.
 
==భోగి మంటలు==
 
==భోగి పులక==
కొన్ని ప్రాంతాలలో భోగి రోజున [[వ్యవసాయదారుడు|రైతులు]] తమ సాగుభూమికి ఆనవాయితీగా కొంతమేర [[సాగునీరు]] పారించి తడి చేస్తారు, ఒక పంట పూర్తయిన తదుపరి మళ్ళీ పంట కొరకు సాగుభూమిలో నీరు పారించడాన్ని పులకేయడం అంటారు, ఆనవాయితీగా భోగి రోజున పులకేయడాన్ని భోగి పులక అంటారు.
 
==కోడి పందాలు==
 
==గాలిపటాలు==
భోగి రోజున పిల్లలు చాలా ఆనందంగా [[గాలిపటాలు]] ఎగురవేస్తారు, వివిధ రకాల గాలిపటాలు తయారు చేసి లేదా కొనుక్కొని ఎగరవేయడంలో పోటీపడతారు.
 
==సెలవు==
1,95,706

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2280619" నుండి వెలికితీశారు