బరాక్ ఒబామా: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:గూగుల్ అనువాద వ్యాసాల అభివృద్ధి ప్రాజెక్టు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[బరాక్ ఒబామా]]''' (జననం [[1961]] [[ఆగస్టు 4]]) <ref>[http://www.truthquestion.com Truth questions] of <cite class="citation web">[http://www.merriam-webster.com/dictionary/Barak "Barak"]. </cite></ref><ref><cite class="citation web">[http://dictionary.reference.com/browse/Barak "Barak"]. </cite></ref> [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] 44వ అధ్యక్షుడు. [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]]<nowiki/>కు అధ్యక్షుడైన మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికను సంతతికి చెందిన వ్యక్తి. [[ఉత్తర అమెరికా|అమెరికా ఖండం]] బయట జన్మించి [[అమెరికా]] అధ్యక్షుడైన మొట్టమొదటి వ్యక్తి కూడా బరాక్ ఒబామానే. ఆయన [[హవాయి]]<nowiki/>లోని హొనొలులులో పుట్టారు. [[కొలంబియా]] విశ్వవిద్యాలయం, హార్వర్డ్ లా స్కూల్ లలో డిగ్రీ చదువుకున్నారు ఒబామా. ఆయన [[అక్టోబరు]] [[1992]]లో [[మిచెల్ ఒబామా/మిషెల్ ఒబామా|మిచెల్]] రాబిన్సన్‌ను [[పెళ్ళి|వివాహం]] చేసుకున్నారు. హార్వర్డ్ లా రివ్యూకు ఆయన అధ్యక్షునిగా వ్యవహరించారు. లా డిగ్రీ పొందే ముందు ఆయన [[చికాగో]]<nowiki/>లో కమ్యూనిటీ ఆర్గనైజర్ గా చేశారు. [[1992]] నుండి [[2004]] వరకు [[చికాగో]] లా స్కూల్ విశ్వవిద్యాలయంలో సివిల్ రైట్స్ అటార్నీగా పనిచేస్తూ రాజ్యాంగ చట్టం గురించి బోధించేవారు. [[1997]] నుండి [[2004]] వరకు ఇల్లినొయిస్ సెనేట్ లో పనిచేశారు. [[2000]] లో యునైటెడ్ స్టేట్స్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కు డెమొక్రటిక్ ప్రైమరీలో చేశారు.
 
[[2004]]లో అమెరికా సెనేట్ ఎన్నికల్లో ఆయన గెలవడంతో దేశం దృష్టిని ఆకర్షించారు. డెమొక్రటిక్ పార్టీ తరఫున గెలిచారు ఆయన. ఆ తరువాత జూలైలో డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ లో ఆయన మాట్లాడారు. [[2007]]లో అధ్యక్షునిగా ప్రచారం మొదలుపెట్టిన ఆయన, తన పార్టీలోని [[హిల్లరీ క్లింటన్]] పై అంతర్గత ఎన్నికల్లో గెలిచి అధ్యక్ష పదవికి టికెట్ సంపాదించారు. ఆ తరువాత అధ్యక్ష ఎన్నికల్లో [[రిపబ్లికన్ పార్టీ (యునైటెడ్ స్టేట్స్)|రిపబ్లికన్ పార్టీ]] అభ్యర్థి జాన్ మెక్‌కైన్ ను ఓడించి [[2009]] [[జనవరి 20]]న అధ్యక్షునిగా గెలిచారు. అధ్యక్షుని పదవి చేపట్టిన తొమ్మిది నెలల తరువాత [[2009]] [[నోబెల్‌ శాంతి బహుమతి|నోబెల్ శాంతి బహుమతి]] అందుకున్నారు.
"https://te.wikipedia.org/wiki/బరాక్_ఒబామా" నుండి వెలికితీశారు