"వడ్లమాని విశ్వనాథం" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (→‎నాటకరంగం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ధృవ → ధ్రువ, తరవాత → తరువాత using AWB)
చి
[[దస్త్రం:Vadlamani.jpg|right|200px|thumb|వడ్లమాని విశ్వనాథం]]
'''[[వడ్లమాని విశ్వనాథం]]''' నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించి [[బళ్ళారి రాఘవ|బళ్లారి రాఘవ]] వంటి వారి మెప్పును పొందినవాడు.
==జీవిత విశేషాలు==
ఇతడు [[1912]]లో [[తూర్పు గోదావరి జిల్లా]], [[అంబాజీపేట]] మండలం, [[నందంపూడి]] అగ్రహారంలో వెంకటశాస్త్రి, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=853182 నటరత్నాలు - [[మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి]] - ఆంధ్రప్రభ వారపత్రిక - 15-03-1972]</ref>. బాల్యంలో ఆరవ ఏటనే విజయనగరం మహారాజావారి [[సంగీత పాఠశాలలోపాఠశాల]]<nowiki/>లో [[ఆదిభట్ల నారాయణదాసు]], [[ద్వారం వెంకటస్వామినాయుడు]]గారల శిక్షణలో 1918 వరకు సంగీతం అభ్యసించాడు.
 
==నాటకరంగం==
1918 వ సంవత్సరంలో వింజమూరి వెంకటలక్షీనరసింహారావుగారి ద్వారా [[పెద్దాపురం మండలం|పెద్దాపురం]] విద్యా వినోదినీ సభలో ప్రవేశించాడు. చావలి లక్ష్మీనారాయణ శాస్త్రి, కేశవరపు కామరాజు, కోఠీ శేషగిరిరావు మొదలైన ప్రముఖుల ఆదరణతో "హరిశ్చంద్ర" నాటకంలో లోహితుని పాత్ర ధరించడంతో ఆంధ్ర నాటకరంగంలో ప్రవేశించాడు. ఆ నాటకంలో[[నాటకం]]<nowiki/>లో హరిశ్చంద్ర పాత్రను వింజమూరి లక్ష్మీనరసింహారావు, చంద్రమతి పాత్రను మద్దూరి కోదండరామదీక్షితులు నటించారు. ఉద్దండులు ప్రదర్శించే ఆ నాటకంతో లోహితుని పాత్రలో విశ్వనాథం అడుగడుగునా అద్భుతమైన నటనను ప్రదర్శించడంతో నాటక ప్రదర్శనానికే ఒక నూతన కాంతి ఏర్పడేది. కాలకౌశికునకు [[చంద్రమతి]]ని విక్రయించి, తాను వీరబాహునకు అమ్ముడుపోయి ఇరువురూ వియోగంతో దుఃఖించేటప్పడు ఇతడు లోహితుడుగా చూపించిన సాత్వికాభినయం పేక్షకులను దుఃఖసాగరంలో ముంచివేసేది. కొంతకాలానికి విద్యా వినోదినీ సభ కార్యక్రమాలు మూలపడడంతో [[కాకినాడ]] లోని యంగ్ మెన్స్ హాపీ క్లబ్ వారు ఇతడిని తీసుకువెళ్ళారు. ప్రప్రథమంగా 'కృష్ణలీల'లో చిన్న కృష్ణుని పాత్రను, ప్రహ్లాద పాత్రను, ధ్రువ, మార్కండేయ, లవుడు, రఘురాముడు మొదలైన ముఖ్య బాలపాత్రలను అద్భుతంగా నటించి బాలనటుడిగా ఒక స్థానాన్ని సంపాదించాడు. 1926 నాటికి ప్రమీలార్జునీయంలో[[ప్రమీలార్జునీయము|ప్రమీలార్జునీయం]]<nowiki/>లో ప్రమీల, 'చింతామణి'లో [[చింతామణి (అయోమయ నివృత్తి)|చింతామణి]], జవ్హరీబాయి, సావిత్రి, [[మోహిని]] మొదలైన ముఖ్య స్త్రీ పాత్రలను పోషించాడు. బాలకృష్ణుడు మొదలు భక్తరామదాసు వరకు, చిత్ర మొదలు చింతామణి వరకు, దేవదేవి మొదలు విప్రనారాయణ వరకు సమస్త ముఖ్య స్త్రీ, పురుష పాత్రలను ఇతడు ధరించాడు.
 
ముఖ్యంగా ఇతడు నటించిన “ప్రమీల", "రోషనార", "చింతామణి" నాటక ప్రదర్శనాలతో వచ్చిన డబ్బుతో [[కాకినాడ]]లో ది యంగ్ మెన్స్ పాలెస్ థియేటర్ కట్టడమనేది చర్చిత ప్రసిద్ధమైన విషయం. ఆ గౌరవం ఇతడికే దక్కింది.
 
==సినిమారంగం==
ఆ తర్వాత ఆర్థిక పరిస్థితులు తారుమారు కావడం వల్ల [[సినిమా]] రంగంలో ప్రవేశించాడు. [[పి.పుల్లయ్య]] దర్శకత్వంలో వచ్చిన శ్రీవేంకటేశ్వర మహత్యం (1939) నుండి శ్రీవెంకటేశ్వర మహత్యం (1960) వరకు, నాటి శివరావు నటించిన పరమానందయ్య శిష్యులకథ(1950) నుండి [[పరమానందయ్య శిష్యుల కథ|పరమానందయ్య శిష్యులకథ]](1966) వరకు అనేక చిత్రాలలో బహువిధమైన పాత్రలను ధరించాడు.
 
ఇతడు నటించిన సినిమాల జాబితా:
 
==సన్మానాలు==
తెలుగుదేశంలో ఉన్న పెద్ద నటులందరితోను నటించి, లెక్కలేనన్ని [[బంగారం|బంగారు]] పతకాలు, రజితపాత్రలు అందుకున్నాడు. [[మైసూరు|మైసూర్]] మహారాజా, [[హైదరాబాదు]] రాజా కృష్ణప్రసాద్, [[జైపూర్ (రాజస్థాన్)|జయపూర్]] మహారాజా వంటి కళాపోషకులతో సత్కరింపబడ్డాడు.
 
==బిరుదులు==
1,93,177

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2282075" నుండి వెలికితీశారు