"పుష్పగిరి ఆలయ సముదాయము" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (→‎పుష్పగిరిలోని శిల్ప సంపద: {{commons category|Pushpagiri Temple Complex}})
చి
}}
{{anchor|Introduction}}
పుష్పగిరి ఆలయముల సముదాయము [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశములోని]] [[కడప]] జిల్లా, [[చెన్నూరు]] మండలములోని పుష్పగిరి గ్రామమునందు కలదు<ref>{{Cite web|url = http://www.wikimapia.org/1694524/Penna-River|title = Wikimapia|date = |accessdate = |website = |publisher = Wikimapia.org|last = |first = }}</ref><ref>{{Cite web|title = Pushpagiri Temple Complex - Wikimapia|url = http://wikimapia.org/1233366/Pushpagiri-Temple-Complex|website = wikimapia.org|accessdate = 2015-04-28}}</ref>. [[వైఎస్ఆర్ జిల్లా|కడప జిల్లా]] కేంద్రమైన కడప పట్టణమునకు[[పట్టణము]]<nowiki/>నకు 16 కిలోమీటర్ దూరములో ఉంది. అనేక శైవవైష్ణవాలయముల సముదాయము పుష్పగిరి.<ref>{{Cite news|title = Rope suspension bridge at Pushpagiri|url = http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/rope-suspension-bridge-at-pushpagiri/article3720341.ece|newspaper = The Hindu|date = August 3, 2012|access-date = 2015-04-28|issn = 0971-751X|language = en|first = M. V.|last = Subramanyam}}</ref>
 
== నామము ==
'''పుష్పగిరి''' అనే పేరు ఈ గ్రామానికి రావటం వెనుక పురాణములలో[[పురాణము]]<nowiki/>లలో ఉటంకింపబడిన ఒక గాథను పేర్కొంటారు.
 
[[కశ్యపుడు|కశ్యప మహర్షికి]] ఇరువురు భార్యలు. [[వినత]], [[కద్రువ]]. వినత, కద్రువ ఇరువురూ గర్భముదాల్చి ఉండగా ఒకనాడు వినత కద్రువతో ఆడిన ఆటలో ఓడి, కద్రువకు, కద్రువ సంతతియైన [[పాము|సర్పములకు]] దాస్యము చేయుటకు అంగీకరించును. తదుపరి వినత వైనతేయుడైన [[గరుత్మంతుడు|గరుత్మంతునికి]] జన్మమివ్వగా, గరుత్మంతుడు ఒకనాడు తన తల్లిని గూర్చి తమ దాస్యమునకు కారణమును అడిగెను. దానికి ఆమె ఇచ్చిన సమాధానమును విన్న [[గరుత్మంతుడు]] కద్రువను చేరి తమ్మిరువురనూ దాస్యవిముక్తులు గావింపమని ప్రార్థించగా కద్రువ, తనకూ, తన బిడ్డలకూ [[అమృతము|అమృతమును]] స్వర్గమునుండి తెచ్చి ఇచ్చిన [[బానిసత్వం|దాస్యము]] తొలగునని తెలిపెను. దానికి సమ్మతించిన గరుత్మంతుడు, [[ఇంద్రుడు|దేవేంద్రునితో]] విరోధించి అమృతభాండమును స్వర్గమునుండి తెచ్చుసమయమున ఆ పాత్రనుండి ఒలికిన రెండు అమృతబిందువులు ఈ ప్రదేశములోని ఒక సరస్సులో జారిపడెను. తన్నిమిత్తముగా ఆ సరోవరమునందు స్నానమాచరించిన వారు నిత్యయవ్వనులై, జరామృత్యుభయము లేక ఉండిరి. <ref name="vaishnavatemple.blogspot.in"/><ref name="ReferenceA">A. Umamaheswara Shastry - A thesis on the inscriptions of Cuddapah district (కడప జిల్లా శాసనాలు)</ref>
 
 
ఈ విషయమును గమనించిన [[దేవతలు]], [[మానవులు]] మృత్యుహీనులగుదురేని సృష్టిక్రమమునకు విరోధమగునని భావించి [[విష్ణువు|శ్రీమహావిష్ణువును]] శరణు వేడగా [[విష్ణువు]] గరుత్మంతుని ఆ సరోవరమును ఒక పర్వతభాగముతో కప్పివేయమని ఆజ్ఞాపించెను. కానీ అమృతబిందు మహత్యము వలన ఆ పర్వతభాగము సరోవరమునందు పుష్పమువలె తేలియాడెను. ఆ నాటినుండి ఈ ప్రదేశమునకు '''పుష్పగిరి''' అను నామము సార్థకమాయెనని లోకోక్తి.<ref name="vaishnavatemple.blogspot.in">{{Cite web|title = VAISHNAVA TEMPLES IN INDIA: Shri Chenna-Kesava Temple, Pushpagiri. Andhra Pradesh|url = http://vaishnavatemple.blogspot.in/2010/11/shri-chenna-kesava-temple-pushpagiri.html|website = vaishnavatemple.blogspot.in|accessdate = 2015-04-28}}</ref>
 
ఈ విచిత్రమును గమనించిన [[దేవతలు]], మరలా [[మహావిష్ణువు]]ను శరణు కోరగా, [[బ్రహ్మ]] [[విష్ణు]] [[శివుడు|మహేశ్వరులు]] తమ పాదములతో ఆ పర్వతమును అణచివేసిరి. ఈనాటికీ పుష్పగిరి గ్రామ సమీపమందు విష్ణుపాదము, రుద్రపాదము అను నామములతో వారి పాదముద్రలు కలవు.
 
== భౌగోళిక స్థితి ==
భౌగోళికముగా పుష్పగిరి ఆలయ సముదాయము సముద్రమట్టానికి రమారమి {{convert|380|m|ft|sigfig=1}} ఎత్తులో ఉన్నది. ఈ ఆలయ సముదాయము ఇంచుమించు {{convert|7.5|km2|sqmi|sigfig=2}} విస్తీర్ణములో వ్యాపించి ఉన్నది. ప్రక్కనే ఉన్న [[పెన్నానది]] మూలముగా సంవత్సర పర్యంతమూ వరిచేలతో[[వరి]]<nowiki/>చేలతో ఇక్కడి పొలాలు కళకళలాడుతూ ఉంటాయి. కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో నీటి ఎద్దడి ఉన్నా కూడా, ఇక్కడ మాత్రము భూగర్భజలాలు పుష్కలముగా ఉంటాయి.<ref>{{Cite web|url = http://www.mapsofindia.com/maps/andhrapradesh/rivers/cuddapah.html|title = Kadapa river map|date = |accessdate = |website = |publisher = |last = |first = }}</ref>
 
ఋతుపవనాల కాలములో వర్షాల తరువాత మామూలుగా ఎక్కువగా ఉన్న ఉష్ణోగ్రతలు చల్లబడుతాయి. [[పెన్నా నది|పినాకినీ]] నదితో ఇక్కడ నాలుగు ఉపనదులు సంగమించినందువల్ల ఈ ప్రదేశమును పంచనదీ సంగమమని, పంచ ప్రయాగ అని పిలుస్తారు. [[పెన్నా నది|పినాకినీ]] నదితో కలిసే మిగిలిన నాలుగు నదులు: కుముద్వతి, బాహుదా, మందాకినీ, పాపాఘ్ని. పినాకినీ నది [[కర్ణాటక]] దేశములోని [[నందికొండ]]లలో పుట్టి ఇక్కడ పెద్దగా పెరిగి చూపరులను ఆకట్టుకునేలా ఉంటుంది. [[పెన్నా నది|పెన్నా]] పూర్వగామిని. కానీ ఈ ప్రదేశములో కొద్దిగా దిశ మార్చుకొని దక్షిణాభిముఖముగా ప్రయాణించి పుష్పగిరి తరువాతి [[శివాలపల్లె]] అను గ్రామము వద్ద తిరిగి తూర్పుకు మళ్ళి ప్రవహిస్తుంది.<ref>{{Cite web|url = http://www.cgwb.gov.in/District_Profile/AP/Kadapa.pdf|title = Ground Water Brochure, Kadapa, Andhra Pradesh|website = Central Ground Water Board|publisher = GOI|last = |first = }}</ref><ref>{{Cite web|url = http://www.kadapa.ap.nic.in/dist_fauna.htm|title = Cuddapah District Administration|website = Cuddapah District Administration Website|publisher = Government of Andhra Pradesh|last = |first = }}</ref>
 
== వాతావరణము ==
పుష్పగిరి ఉష్ణోగ్రతలు[[ఉష్ణోగ్రత]]<nowiki/>లు కడపజిల్లాలోని సాధారణ ఉష్ణోగ్రతలనే పోలి ఉంటుంది ఎండాకాలములో వేడి ఎక్కువగా ఉండి [[పెన్నానది]] లోని నీరు కూడా అడుగంటి కొన్ని నీటి గుంటలలో మాత్రమే ఉంటాయి. సాధారణ ఉష్ణోగ్రత ఎండాకాలములో 37°C నుండి 45°C మధ్యలో ఉంటుంది. సాధారణముగా ఎండాకాలము మార్చి నెల నుండి జూలై నెల వరకూ ఉంటుంది.<ref>{{Cite web|title = Current weather in kadapa: Weekly forecast for kadapa, andhra pradesh|url = http://www.skymetweather.com/forecast/weather/india/andhra%20pradesh/kadapa/kadapa|website = www.skymetweather.com|accessdate = 2015-04-28}}</ref><ref>{{Cite web|title = Weather in Kadapa, India {{!}} 14 day weather outlook of Kadapa|url = http://www.worldweatheronline.com/Kadapa-weather/Andhra-Pradesh/IN.aspx|website = www.worldweatheronline.com|accessdate = 2015-04-28}}</ref><ref>{{Cite web|title = KADAPA Weather, Temperature, Best Season, Kadapa Weather Forecast, Climate|url = http://www.mustseeindia.com/Kadapa-weather|website = www.mustseeindia.com|accessdate = 2015-04-28}}</ref>
 
[[జూన్]], [[జూలై]] మాసాలలో [[ఋతుపవనాలు]] మొదలైన తరువాత ఉష్ణోగ్రతలు కొంచెం తగ్గుముఖం పడతాయి. సాధారణ వర్షాలతో పాటు చుట్టూ [[కొండలు]] ఉండటం వల్ల వాయుగుండాల వల్ల వచ్చే వర్షాలతో నది పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. సెప్టెంబర్ నుండి మార్చి వరకు ఉష్ణోగ్రతలు చాలా మటుకు తగ్గి వాతావరణము ఆహ్లాదముగా ఉంటుంది. [[డిసెంబర్]] నెల మామూలుగా మిగిలిన అన్ని నెలల కన్నా చల్లని నెల. సాధారణ ఉష్ణోగ్రతలు 17°C నుండి 23°C వరకు ఉండి, ఆలయాలను దర్శించడానికి వచ్చే యాత్రికులకు అనుకూలముగా ఉంటుంది. <ref name="www1.ncdc.noaa.gov">{{Cite web|title = Climate-Watch, October 2001 |url = http://www1.ncdc.noaa.gov/pub/data/extremeevents/specialreports/Climate-Watch-October-2001.pdf|website = www1.ncdc.noaa.gov|accessdate = 2015-04-28}}</ref>.<ref name="www1.ncdc.noaa.gov"/><ref>{{Cite web|title = Weather in Kadapa, India {{!}} 14 day weather outlook of Kadapa|url = http://www.worldweatheronline.com/Kadapa-weather/Andhra-Pradesh/IN.aspx|website = www.worldweatheronline.com|accessdate = 2015-04-28}}</ref> <ref>{{Cite web|title = KADAPA Weather, Temperature, Best Season, Kadapa Weather Forecast, Climate|url = http://www.mustseeindia.com/Kadapa-weather|website = www.mustseeindia.com|accessdate = 2015-04-28}}</ref>
 
== చరిత్ర ==
పుష్పగిరి ఆలయ సముదాయము గురించి అతి విలువైన చారిత్రిక ఆధారాలు, చరిత్ర ఉన్నది.<ref>{{Cite web|url = http://www.abebooks.com/book-search/isbn/0521011094/|title = The Archaeology of Seafaring in Ancient South Asia.|date = |accessdate = |website = |publisher = N. Fagin Books|last = Ray|first = Himanshu Prabha}}</ref> పుష్పగిరి గురించిన మొట్టమొదటి ప్రస్తావన స్కంద పురాణములోని శ్రీశైలఖండములో ఉన్నది.<ref>{{Cite web|url = http://www.lingayatreligion.com/PilgrimCenters/Srisailam.htm|title = Srisailam|date = |accessdate = |website = Srisailam|publisher = |last = |first = }}</ref> అదే విధముగా సత్యనాథుడు రాసిన రసరత్నకారములో కూడా పుష్పగిరి యొక్క ప్రస్తావన ఉన్నది. [[ఇక్ష్వాకు వంశము|ఇక్ష్వాకు]] రాజుల శాసనాలలో [[శ్రీశైలం|శ్రీశైలమల్లికార్జున]] [[జ్యోతిర్లింగాలు క్షేత్రాలు|జ్యోతిర్లింగక్షేత్రమునకు]] దక్షిణ ద్వారముగా పుష్పగిరి వర్ణింపబడినది.<ref>{{Cite web|url = http://www.manadevunikadapa.blogspot.in/2013/02/welcome-to-mana-kadapa.html|title = Welcome to Mana Kadapa|date = |website = Welcome to Mana Kadapa|publisher = |last = |first = }}</ref> పూర్వ చోళుల వంశానికి చెందిన కరికాళచోళుని శాసనములో ఈ స్థలము అత్యంత పవిత్రమైనదిగా చెప్పబడినది.<ref name=":0">{{Cite web|url = http://mahavarnam.blogspot.in/2010/03/blog-post_05.html|title = అన్వేషి: పుష్పగిరి|date = |accessdate = |website = |publisher = |last = |first = }}</ref>
 
పుష్పగిరిలోని అనేక భవనములు, దేవస్థానములు [[చోళ సామ్రాజ్యము|చోళ]] [[చాళుక్యులు|చాళుక్య]] శిల్పకళా వైభవానికి అద్దముపట్టినట్టుగా ఉంటాయి. అదే విధముగా తరువాతి తరపు రాజులు చేసిన మార్పులు, చేర్పుల మూలముగా వారి వారి శిల్ప వాస్తు కళా సంపాదన చేర్చుకొనినాయి.[[దస్త్రం:A 1463 CE dated inscription before the Vaidyanatha Swamy temple, Pushpagiri.JPG|thumb|శ్రీవైద్యనాథస్వామి దేవస్థానము ఎదురుగానున్న 15వ శతాబ్దపునాటి రాతి శాసనము]]పినాకినీ నది గురించి ఇక్కడ ఒక్క ప్రస్తావన చేసితీరాలి. [[కర్ణాటక|కర్ణాటకలోని]] [[నందికొండ]]లలో వెలసియున్న భోగనందీశ్వరస్వామి దేవస్థానము వద్ద మూడు నదుల ఆవిర్భావమున్నది. అందులో ఒకటి [[పెన్నా నది|పినాకినీ]] కాగా, మిగిలిన రెండు ఆర్కావతి మఱియు పాలారు. అందు ఆర్కావతి, పాలారు క్రమముగా దేశగర్భములో కలిసిపోయినా, పినాకినీ ఒక్కటీ దెశములన్నీ దాటి కడపను ప్రవేశించింది. ఒక నానుడి ప్రకారము, [[పరమేశ్వరుడు]] చేసిన [[ఆనంద తాండవం|ఆనందతాండవ]] ఫలితముగా ఉద్భవించిన నందికొండలలో[[నందికొండ]]<nowiki/>లలో పినాకినీ ఈశ్వరుణ్ణి తన జన్మకారణమడిగి దిశానిర్దేశము చేయమనినప్పుడు [[ఈశ్వరుడు]] తన చేతిలోని ధనస్సుతో భూమిమీద ఒక రేఖ వ్రాసి దానిని అనుసరించమని ఆ నదీమతల్లిని ఆజ్ఞాపించినాడని, ఆ నది ఆ మార్గము గుండా వెళ్ళగా పుష్పగిరి దగ్గర చతుర్నదులు అందులో సంగమించి ఇప్పటి పెన్నా నది అయినదని లోకోక్తి.<ref>{{Cite web|url = http://www.karnataka.com/nandi-hills/about-nandi-hills/|title = Nandi Hills {{!}} Nandi Betta|date = |accessdate = |website = |publisher = |last = |first = }}</ref>
 
శివుని ధనుస్సు పేరు పినాకము అయినందువలన ఆ నది పినాకినీ అయినదని పద వ్యుత్పత్తి.
 
పూర్వ కాలపు [[రాజులు]] ఎందఱో ఈ క్షేత్రమును ఆరాధించి, పునరోద్ధారణ గావించి మడులు, మాన్యాలు సమర్పించి ధన్యులయినారు.
 
=== మధ్యమ యుగపు రాజులు మఱియు పాలేగాళ్ళు ===
1,87,135

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2282969" నుండి వెలికితీశారు