కొండపల్లి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 114:
 
== కొండపల్లి కోట ==
[[ముసునూరి కమ్మ రాజులు|ముసునూరి కమ్మరాజుల]] కాలంలో ఈ కోట నిర్మితమైనది. ఢిల్లీ సుల్తానులను పారద్రోలి ఈ దేశాన్ని పరాయిపాలన నుంచి విముక్తి చేసిన తెలుఁగు వీరుడు ముసునూరి ప్రోలయ నాయుడు రాజ్యాన్ని సుభక్షింగా మరియు శత్రు దుర్బేధ్యంగా మలచే ప్రయత్నంలో ఈ త్రిలింగ దేశంలో అనేక కోటల నిర్మాణాలు చేపట్టాడు. అందులో భాగంగా కొండపల్లి కోట నిర్మాణానికి పూనుకున్నాడు. దీనిలో మూడంతస్తుల రాతి బురుజు ఉంది. ఇక్కడ విరూపాక్ష దేవాలయం ఉంది.
కొండవీటి రెడ్డి రాజుల పరిపాలనా కాలంలో, వారు నిర్మించిన కోట ఈ గ్రామములో ఒక ఆకర్షణ. కొండపల్లి కోటను [[కొండవీడు|కొండవీటి]] [[రెడ్డి రాజులు|రెడ్డి రాజ్య]] స్థాపకుడైన [[ప్రోలయ వేమారెడ్డి]] [[14 వ శతాబ్దం]]లో నిర్మించినట్లు భావిస్తున్నారు. దీనిలో మూడంతస్తుల రాతి బురుజు ఉంది. ఇక్కడ విరూపాక్ష దేవాలయం ఉంది.
 
కొండ చుట్టూ శుత్రుదుర్భేద్యమైన ప్రాకారం. రాజమహల్ గోడలపై కళాఖండాలను తీర్చిదిద్దారు. దర్బారు నిర్వహించే రాజమహల్, రాణి, పరివారం నివాసముండే రాణీమహల్, [[నర్తనశాల]], నేటి రైతు బజార్లను తలపించే అంగడి, నేరగాళ్లను ఉంచే కారాగారం, ఆయుధాగారం, ప్రజలు స్నానం చేయడానికి వీలుగా పెద్ద కొలను, రాజ కుటుంబీకుల కోసం మరో కొలను, గుంపులుగా తరలివెళ్లడానికి, ఏనుగులు, గుర్రాలు వెళ్లడానికి వీలుగా రహదారుల నిర్మాణం -ఇవన్నీ ఒక కొండపైనే ఉన్నాయి. కొండపల్లి కోటను ప్రస్తుతము పునర్నిర్మిస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/కొండపల్లి" నుండి వెలికితీశారు